top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 -4 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 -4 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 4🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।

దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀


🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।

మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀

🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 4 🌻

ఈ పద్మము యొక్క రహస్యమును వివరించునదే కఠయోగము. అదియే 'కఠోపనిషత్తు'. ఈ పద్మమును చేరిన ప్రజ్ఞ వాయుతత్త్వమును చేరును. అమృతత్త్వమును పొందును. ఇందు వసించు వారందరూ అమృతులు. వీరినే మహా వీరేంద్రులని కీర్తింతురు. ద్వాదశాక్షరీ మంత్రము కూడ ఈ పద్మమునకు సంబంధించి నదే. నారదునిచే ఉపదేశము పొంది ధృవుడు, ప్రహ్లాదుడు తురీయ స్థితిని చేరిరి. లోపల వెలుపల వ్యాపించిన దైవమును తెలిసిది. ఇట్టి మహత్తర జ్ఞానము ఈ పద్మము ప్రసాదించును. ఇచ్చట వసించు శ్రీమాత అభయ ముద్రను, వరద ముద్రను ధరించి యుండును. మిగిలిన రెండు చేతులలో అక్షమాలను, కపాలమును ధరించి యుండును. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 4 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻 🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻 🌻 Description of Nos. 485 to 494 Names - 4 🌻 Katha Yoga explains the secret of this lotus. That is 'Kathopanishad'. The pragya that reaches this lotus reaches Vayutattva. Gets amritattva. All those who live here are immortal. They are glorified as great heroes. Dvadasakshari mantra is also related to this lotus. Dhruva and Prahlad attained the state of Turiya after being initiated by Narada. Knows the divine that pervades within and without. This Padma bestows great knowledge. Srimata living here is wearing Abhaya Mudra and Varada Mudra. In the other two hands, Akshamala and Kapala are worn. Continues... 🌹 🌹 🌹 🌹 🌹



コメント


bottom of page