🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 6🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀
🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀
🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 6 🌻
హృదయ కేంద్రమున నున్న శ్రీమాత ప్రాణశక్తిగా రక్తమందు వశించును. అందువలన ఆమె రుధిర సంస్థిత. ప్రాణమునకు హృదయమే కేంద్రము. హృదయమే రక్త ప్రసారము గావించు చుండును. చెడు రక్తమును హరించుచు, మంచి రక్తమును ప్రసరించుచు, ఏక కాలమున రక్తమును నిర్వహించుచూ నుండును. రక్త ప్రసారము చేయుట, రక్తమును శుద్ధి చేయుట రెండు కోరలుగ దర్శించిన శ్రీమాత భక్తులు ఆమెను ఎఱ్ఱని దంతములతో ప్రకాశించు మాత (దంష్టోజ్వలా) అని ప్రశంసించిరి. ఇడ, పింగళ నాడులను కూడ రెండు దంతములుగా తెలుపుదురు. ఇవియు కాంతివంతమగు ప్రజ్ఞా ప్రవాహములే. ఉజ్జ్వలమగు దంతము లతో ఇట్లు శ్రీమాత ప్రకాశించుచుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 6 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya
danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻
🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻
🌻 Description of Nos. 485 to 494 Names - 6 🌻
Sri Mata at the center of the heart resides in the blood as the life force. So she is Rudhira Samsthita. The heart is the center of life. The heart circulates the blood. It drains the bad blood, circulates the good blood and maintains the blood at the same time. Seeing her doing the two rituals of blood transmission and blood purification, devotees of Sri Mata, hailed her as the Radiant Mother (Damshtojwala) with red teeth. Ida and Pingala Nadi are also known as two teeth. These are also streams of light and wisdom. Srimata shines with bright teeth.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments