top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 7


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 7 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।

దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀


🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।

మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀


🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 7 🌻


కాళరాత్రి ఆదిగా గల శక్తులు పండ్రెండు సమూహములుగ నుండును. ఈ శక్తులు 'క'కారము మొదలుకొని 'ఈ' కారము వరకు 12 సమూహములుగ నుండును. అవి వరుసగ ఖ గ ఘ ఙ; చ ఛ జ ఝ ఞ; ట ఠ అక్షరములు, ఈ ప్రతి అక్షరమునకు సమూహము లున్నవి. అవియే గుణింతములు, అక్షరము లన్నియూ శక్తులే. విశుద్ధి చక్రమున పదహారు అచ్చులు పదహారు దళముల శక్తులుగా పేర్కొనబడినవి. విశుద్ధి యందు మొదటి పండ్రెండు హల్లులు పేర్కొనబడినవి. ఈ వరుస ననుసరించియే సంస్కృతమున ఇతర అక్షరములను పేర్కొనిరి. తత్కారణముగ సంస్కృత భాష దేవ భాష అయినది. 'క' ఆదిగ గల పండ్రెండు శక్తులతో కూడిన మాత కావున 'కాకినీ' మాత అని కూడ అనాహత మందలి మాతని పిలతురు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹







🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 7 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya

danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻


🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya

mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻


🌻 Description of Nos. 485 to 494 Names - 7 🌻


Forces with Kalaratri as the primary are of twelve groups. These energies are in 12 groups starting from 'Ka'kara to 'E'kara. They are kha ga gha j; Cha Cha Ja Jha Na; Each of these letters has a group. They are multiples and letters are energies. The sixteen vowels in the Vishuddhi Chakra are said to be the energies of the sixteen petals. The first twelve consonants are mentioned in Vishuddhi. Following this sequence are other letters in Sanskrit. Thus the Sanskrit language is the language of Gods. Mata at Anahata is also known as 'Kakini' Mata because she is a mother with twelve powers having the origin of 'Ka'.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page