🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 8 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀
🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀
🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 8 🌻
షట్చక్ర నిరూపణమున ఈమెను కాకినీ శక్తి అని పిలుచుటలో అంతరార్థ అనాహత మందలి శ్రీమాతకు నేతి అన్నము ఎక్కువ ప్రీతి కలిగించును. ఆర్ష సంప్రదాయము ననుసరించు వారు తప్పక నేతి అన్నము భుజింతురు. నేయి తినకూడదన్న నేటి వైద్యుల వాదనము వారు మౌనముగ తోసిపుచ్చుదురు. మొదటి వేడి అన్నము ముద్దలో నేయి వేసుకొని తినుట సంప్రదాయము. దీని వలన హృదయమునకు మేలే కలుగును కాని కీడు కలుగదు. మహా వీరులకు వరముల నిచ్చునది శ్రీమాత అగుటచే 'మహా వీరేంద్ర వరదా' అని కీర్తింపబడుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 8 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya
danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻
🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻
🌻 Description of Nos. 485 to 494 Names - 8 🌻
According to Shatchakra proof, in calling her Kakini Shakti, ghee rice is more pleasing to Srimata. Those who follow the tradition of Arsha mandatorily eat ghee rice. They silently reject today's doctor's claim that ghee should not be eaten. It is traditional to eat the first hot rice with ghee mixed in it. This is good for the heart but not harmful. As Srimata is the giver of boons to great heroes she is glorified as 'Maha Virendra Varada'.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Kommentare