🌹 . శ్రీ శివ మహా పురాణము - 769 / Sri Siva Maha Purana - 769🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 17 🌴
🌻. విష్ణు జలంధర యుద్ధము - 5 🌻
అపుడు వారద్దరు మహాబలులు చేతులతో పిడికిళ్లతో మోకాళ్లతో మల్ల యుద్ధమును చేసిరి. ఆ శబ్దముతో భూమి ప్రతిధ్వనించెను (33). ఓ మహర్షీ! విష్ణువు చిరకాలము ఆ రాక్షసునితో యుద్ధమును చేసి ఆశ్చర్యమును పొందినవాడై మనస్సులో క్లేశమును, అలసటను పొందెను (34). మాయను ఎరింగిన వారిలో శ్రేష్ఠడు, మాయకు ఆధీశ్వరుడు అగు విష్ణుభగవానుడు అపుడు ప్రసన్నుడై. ఆ రాక్షసరాజును ఉద్దేశంచి మేఘంగంభీరమగు స్వరముతో నిట్లనెను (35).
విష్ణువు ఇట్లు పలికెను- ఓయీ! రాక్షసశ్రేష్ఠా! యుద్ధములో సహింప శక్యము గాని పరాక్రమము గల నీవు ధన్యుడవు. ఏలయన, మహాప్రభుడవగు నీవు గొప్ప ఆయుధములకైననూ భయపడుట లేదు (36). క్రూరములగు ఇవే ఆయుధములను ప్రయోగించగా గొప్ప బలము, తేజస్సు గల వీరులైన రాక్షసులు చాలామంది తెగిన దేహములు గలవారై మృతిని చెందిరి (37). ఓ గొప్ప రాక్షసుడా! నీ యుద్ధముచే నేను ప్రసన్నుడనైతిని. నీవు మహాత్ముడవు. స్థావర జంగమాత్మక మగు ముల్లోకములలో నీతో సమమగు వీరుడు కానరాడు (38). ఓ రాక్షసరాజా! వరమును కోరుకొనుము. నీ విక్రమమునకు నేను సంతసించితిని. నీకు ఈయరాని వరమునైననూ ఇచ్చెదను. నీ మనసులోని మాటను బయటపెట్టుము. (39).
సనత్కుమారుడిట్లు పలికెను - మాయను వశము చేసుకొన్నవాడు, పాపములను పోగొట్టువాడు అగు ఆ విష్ణువుయొక్క ఈ మాటను విని మహాబుద్ధిశాలి, రాక్షసుడునగు జలంధరుడు ఇట్లు బదులిడెను (40).
జలంధరుడిట్లు పలికెను- బావా! నీవు సంతుష్టుడవైనచో, నాకీ వరమునిమ్ము. నీవు నీ గణములతో, మరియు మా చెల్లెలితో గూడి నా ఇంటిలో నివసించుము (41).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 769🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 17 🌴
🌻 The fight between Viṣṇu and Jalandhara - 5 🌻
33. Then both of them equally powerful had a hand to hand fight hitting each other with arms, fists and knees. They filled the earth with reverberating sounds.
34. Fighting with the Asura thus, for a long time, O excellent sage, Viṣṇu was surprised. He felt dejected in the heart.
35. Then he the foremost among the magic-wielders assumed a delightful aspect. He addressed the king of Asuras in a thundering voice.
Viṣṇu said:—
36. “O excellent Asura, you are blessed. You are invincible in war. Since you are a great lord you are not at all afraid of even great weapons.
37. Many Asuras have been killed by these very same weapons in great battles. The wicked and haughty people have been pierced through their bodies and killed.
38. O great Asura, I am delighted by this fight with you. You are really great. A hero like you has not been seen in the three worlds including the mobile and immobile beings.
39. O lord of Asuras, choose a boon. I am pleased at your valour. I shall give you anything even that which cannot be given, whatever is in your mind.
Sanatkumāra said:—
40. On hearing these words of Viṣṇu, skilled in magic, the intelligent king of the Asuras replied thus.
Jalandhara said:—
41. O Brother-in-law, if you are pleased give me this boon. You stay in my house with all your followers, my sister and myself.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments