🌹 . శ్రీ శివ మహా పురాణము - 800 / Sri Siva Maha Purana - 800 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 22 🌴
🌻. శివ జలంధరుల యుద్ధము - 4 🌻
సనత్కుమారడిట్లు పలికెను - మహారాక్షసుడగు జలంధరుడిట్లు పలికి, సర్వకార్యములను తేలికగా చేయువాడు, వృషధ్వజుడు అగు శంభుని డెబ్బది బాణములతో కొట్టెను (26). మహాదేవుడు జలంధరుని ఆ బాణములను తన వద్దకు చేరకమునుపే చిరునవ్వుతో వేగముగా తన వాడి బాణములతో ఛేదించెను (27). తరువాత ఆయన ఏడు బాణములతో జలంధరాసురుని గుర్రములను, ధ్వజమును, గొడుగును, ధనస్సును ఛేదించెను. ఓ మునీ! శివుడిట్లు చేయటలో ఆశ్చర్యము లేదు (28).
సముద్రతనయుడగు ఆ రాక్షసుడు విరిగిన ధనస్సు, రథము గలవాడై గదను చేతబట్టి కోపముతో వేగముగా శివునిపైకి ఉరికెను (29). ఓ వ్యాసా! గొప్ప లీలలను చూపే ఆ మహేశ్వరప్రభుడు తన పైకి విసరబడిన ఆ గదను వెంటనే బాణములతో రెండు ముక్కలుగా చేసెను (30). అయిననూ ఆ మహాసురుడు మహాక్రోధముతో పిడికిలిని బిగించి శివుని కొట్టవలెననే సంకల్పము గలవాడై మహావేగముతో వెంటనే ఆయన పైకి ఉరికెను (31). ఇంతలోనే, తెలికగా సర్వకార్యములను నిర్వహించు ఈశ్వరుడు వెంటనే జలంధరునిపై బాణములను గుప్పించి రెండుమైళ్ల దూరమువరకు నెట్టివేసెను (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 800 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 22 🌴
🌻 Description of Jalandhara’s Battle - 4 🌻
Sanatkumāra said:—
26. After saying this, Jalandhara the great Daitya hit the bull-bannered Śiva of indefatigable endeavour, with an incessant volley of arrows.
27. Laughingly, lord Śiva split all the arrows of Jalandhara by discharging his own sharp arrows even before his arrows reached him.
28. Then with seven arrows he split the horses, banner, umbrella and the bow of Daitya Jalandhara. O sage, it is not surprising in the case of Śiva.
29. The infuriated Asura the son of the ocean, devoid of a chariot and with bow split up rushed at Śiva lifting his mace vigorously.
30. O Vyāsa, lord Śiva of great sports immediately split asunder the mace hurled by him, by means of his arrows.
31. Yet the highly infuriated great Asura rushed at Śiva with the mailed fist lifted up, with a desire to kill him.
32. By a volley of arrows Jalandhara was hurled back a Krośa by Śiva of indefatigable enterprise.
Continues....
🌹🌹🌹🌹🌹
コメント