top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 801 / Sri Siva Maha Purana - 801


🌹 . శ్రీ శివ మహా పురాణము - 801 / Sri Siva Maha Purana - 801 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 22 🌴


🌻. శివ జలంధరుల యుద్ధము - 5 🌻


అపుడు జలంధరాసురుడు బలములో రుద్రుడు అధికుడని గ్రహించి రుద్రుని మోహింపజేసే అద్భుతమగు గాంధర్వమాయను సృష్టించెను (33). వాని మాయా ప్రభావముచే అనేకములగు గందర్వ-అప్సరసల గణములు రుద్రుని మోహింప జేయుట కొరకై ఆవిర్భవించినవి (34). అపుడు గంధర్వ-అప్సరసల గణములు గానమును, నాట్యమును చేసిరి. మరి కొందరు తాళమలను, వేణువులను, మృదంగములను వాదనము చేసిరి (35). ఆ గణములు చూపించిన ఆ మహాశ్చర్యమును గాంచి రుద్రుడు మోహమును పొందెను. ఆయన చేతులనుండి ఆయుధములు జారిననూ, ఆయన ఎరుంగలేక పోయెను (36). రుద్రుడు ఏకాగ్రతతో వారిని చూచుచుండగా గాంచిన జలంధరాసురుడు మాయావేషముతో వేంటనే గౌరీదేవి ఉన్నచోటకు వెళ్లెను (37).


ఆతడు యుద్ధములో మహాబలశాలురగు, శుంభ నిశుంభులను వారిని నిలబెట్టెను. పది చేతులు అయిదు ముఖములు, మూడు కన్నులు, జటలు గల వాడై (38). గొప్ప వృషభమునధిష్ఠించి అన్ని విధములుగా రుద్రుని పోలియున్న వాడై ఆ జలంధరుడు అచటకు వెళ్లెను. ఓ వ్యాసా! రాక్షసమాయచే జలంధరుడు అట్లు కాగల్గెను (39). అపుడు భవాని రుద్రుడు వచ్చుచుండుటను గాంచి సఖురాండ్ర మధ్యనుండి లేచి ఎదురేగెను. ఆమె ఆయన దృష్టి ప్రసరించు స్థలమునకు వచ్చియుండెను (40). ఆ రాక్షసేశ్వరుడు సుందరియగు పార్వతిని చూచెను. వెంటనే ఆతని అవయవములు శక్తిని గోల్పోవుటచే ఆతడు జడునివలె ఆయెను (41).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 801 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 22 🌴


🌻 Description of Jalandhara’s Battle - 5 🌻


33. Then, considering Śiva more powerful, Jalandhara the Daitya, created the illusion of Gandharvas that mysteriously fascinated even Śiva.


34. By the power of his Māyā, hosts of Gandharvas and celestial damsels came into view for fascinating Śiva.


35. The Gandharvas and celestial damsels sang and danced. Others played on flutes, mṛdaṅgas and cymbals.


36. On seeing that wonderful feat, Śiva was fascinated by the Gaṇas. He was not conscious of even the garments let down from the hands.


37. On seeing Śiva concentrated in the dance Jalandhara urged by lust immediately went to the place where Gaurī stood.


38-39. He entrusted the powerful Śumbha and Niśumbha with the conduct of war. With his demonaic Māyā he assumed the form of Śiva—with ten brawny arms, five faces, three eyes, and matted hair. He was seated on the great bull. In every respect, O Vyāsa, Jalandhara appeared like Śiva.


40. On seeing Śiva coming, the beloved of Śiva came out from the midst of her female friends within the range of his vision.


41. When the lord of Asuras saw the bauntiful Pārvatī, he let drops of semen fall and his limbs became benumbed.



Continues....


🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comments


bottom of page