🍀🌹 01, AUGUST 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 558 / Bhagavad-Gita - 558 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 07 / Chapter 15 - Purushothama Yoga - 07 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 113 🌹
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 10 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 7 🌹
🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 7 / 552. 'Sarvamrutyu Nivarini' - 7 🌻
5) 🌹🎥 हम चेतना की विभिन्न अभिव्यक्तियाँ हैं 🎥🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹🎥 हम चेतना की विभिन्न अभिव्यक्तियाँ हैं 🎥🌹*
प्रसाद भारद्वाज
*चेतना और इसके विभिन्न रूपों के गहरे अर्थ को जानिए। समझें कि कैसे चेतना हमें ब्रह्मांड से जोड़ती है और आत्म- जागरूकता के माध्यम से हमें आध्यात्मिक उन्नति की ओर ले जाती है। बाहरी दुनिया और हमारे आंतरिक आत्मा के बीच के अंतर को पहचानकर आत्म-ज्ञान की यात्रा शुरू करें।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 558 / Bhagavad-Gita - 558 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 07 🌴*
*07. మమైవంశో జీవలోకే జీవభూత: సనాతన: |*
*మన:షష్టానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||*
*🌷. తాత్పర్యం : ఈ బద్ధ భౌతిక జగము నందలి జీవులందరు నా శాశ్వతాంశలు. బద్ధజీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను గూడి వారు తీవ్రసంఘర్షణ కావించుచున్నారు.*
*🌷. భాష్యము : జీవుని యథార్థరూపము ఈ శ్లోకమునందు స్పష్టముగా ఒసగబడినది. యథార్థమునకు అతడు శ్రీకృష్ణభగవానుని శాశ్వతాంశము. అనగా అతడు బద్ధజీవితమున వ్యక్తిత్వమును పొంది, ముక్తస్థితిలో ఆ భగవానునితో ఐక్యమగునని కాదు. అతడు శాశ్వతముగా భగవానుని నుండి విడివడియే యుండును. ఈ విషయమే “సనాతన”యను పదము ద్వారా స్పష్టపరుపబడినది. వేదముల ప్రకారము శ్రీకృష్ణభగవానుడు అసంఖ్యాక రూపములలో వ్యక్తమై విస్తరించియుండును. వానిలో ప్రధానవిస్తారములు విష్ణుతత్త్వములనియు, అప్రధానవిస్తారములు జీవతత్త్వములనియు పిలువబడును. అనగా విష్ణుతత్త్వములు స్వీయ విస్తారములు కాగా, జీవులు విభక్తమైనట్టి విస్తారములు. ఈ రీతి శ్రీకృష్ణభగవానుడు తన స్వీయ విస్తారముతో రామ, నృసింహ, విష్ణుమూర్తి మరియు పలు వైకుంఠాధి పతుల రూపములందు వ్యక్తమగు చుండును.*
*విభక్తవిస్తారములైన జీవులు అతని నిత్య సేవకులే. భగవానుని స్వీయ విస్తారములు (విష్ణుతత్త్వములు) శాశ్వతముగా నిలుచునట్లే, భగవానుని విభక్తవిస్తారములైన జీవులు సైతము తమ వ్యక్తిత్వములను కలిగియున్నారు. దేవదేవుని అంశలుగా వారు అతని లక్షణములను అంశమాత్రము కలిగియున్నారు. దేవదేవుని అంశలుగా వారు అతని లక్షణములను అంశ మాత్రము కలిగియున్నారు. అట్టి లక్షణములలో స్వతంత్రమనునది యొకటి. అనగా ప్రతిజీవియు వ్యక్తిత్వమును మరియు స్వతంత్ర్య యొక్క సుక్ష్మాంశమును కలిగియున్నాడు. అట్టి సూక్ష్మస్వతంత్రతను దుర్వినియోగపరచుటచే అతడు బద్ధుడగుచుండ, సద్వినియోగముచే ముక్తుడగుచున్నాడు. బంధ, ముక్తస్థితులనెడి రెండింటి యందును అతడు దేవదేవుని వలనే గుణరీతి శాశ్వతుడు. ముక్తస్థితిలో అతడు భౌతికజీవనము నుండి విడివడియుండి శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియుక్తుడై యుండును. కాని బద్ధస్థితిలో గుణములచే ప్రభావితుడై ఆ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవను మరచియుండును. తత్పలితముగా అతడు భౌతిక జగమునందు తన జీవనమునకై తీవ్ర సంఘర్షణను కావింప వలసి వచ్చును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 558 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 07 🌴*
*07. mamaivāṁśo jīva-loke jīva-bhūtaḥ sanātanaḥ*
*manaḥ-ṣaṣṭhānīndriyāṇi prakṛti-sthāni karṣati*
*🌷 Translation : The living entities in this conditioned world are My eternal fragmental parts. Due to conditioned life, they are struggling very hard with the six senses, which include the mind.*
*🌹 Purport : In this verse the identity of the living being is clearly given. The living entity is the fragmental part and parcel of the Supreme Lord – eternally. It is not that he assumes individuality in his conditional life and in his liberated state becomes one with the Supreme Lord. He is eternally fragmented. It is clearly said, sanātanaḥ. According to the Vedic version, the Supreme Lord manifests and expands Himself in innumerable expansions, of which the primary expansions are called viṣṇu-tattva and the secondary expansions are called the living entities. In other words, the viṣṇu-tattva is the personal expansion, and the living entities are the separated expansions.*
*By His personal expansion, He is manifested in various forms like Lord Rāma, Nṛsiṁha-deva, Viṣṇumūrti and all the predominating Deities in the Vaikuṇṭha planets. The separated expansions, the living entities, are eternally servitors. The personal expansions of the Supreme Personality of Godhead, the individual identities of the Godhead, are always present. Similarly, the separated expansions of living entities have their identities. As fragmental parts and parcels of the Supreme Lord, the living entities also have fragmental portions of His qualities, of which independence is one. Every living entity, as an individual soul, has his personal individuality and a minute form of independence.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 114 🌹*
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 10 🏵*
*భారతదేశంలో పుట్టి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక తమిళుడు పది పదకొండు యాక్సిడెంట్లకు గురిఅయినాడు. నా రెండవ అమెరికా పర్యటనలో ఒక స్నేహితుడు అతనిని చూపించి ఈ ప్రమాదాల నుంచి రక్షించమని అడిగాడు. అతని ఇంటిలో హోమం చేశాను. అగ్నిగుండంలో విచిత్రమైన దృశ్యం కన్పించింది. అతను పూర్వజన్మలో ఒక రాజుయొక్క రెండవ కొడుకు. రాజ్యం కోసం తండ్రిని అన్నను ఖైదు చేశాడు. ఆ పాప ఫలితంగా ఒక పిశాచం పట్టుకొన్నది. అతనిని బాధించి, బాధించి చంపాలని ఆ పిశాచం యొక్క సంకల్పం దాని బాధ నుండి అతనిని రక్షించాను. ఇటీవలి నా మూడవ అమెరికా యాత్రకు అతడు కారకుడయినాడు. భారతదేశానికి వచ్చినప్పుడల్లా గుంటూరులోను కుర్తాళంలోను మన ఆశ్రమాలలో కొద్ది రోజులు సకుటుంబంగా ఉండి వెడుతుంటాడు*
*సాహిత్యరంగంలో నేను భువన విజయాది రూపక ప్రదర్శనలు నిర్వహిస్తున్న రోజులలో వారిలో పాల్గొన్న వారిలో ఇద్దరు రచయిత్రులు ఉన్నారు. అందులో ఒకామె పూర్వజన్మలో ముస్లిం జమీందారిణి. ఆమె భవనానికి కొంచెం దూరంలో ఒక హిందూ దేవాలయం ఉండేది. ఆమె రోజూ అక్కడి భజనలు, పాటలు వింటూండేది. ఒకసారి మతకలహాలు జరిగి సాయుధులైన మహమ్మదీయులు దేవాలయం మీదకు దాడిచేశారు. గుడిలో ఉన్న హిందువులు చెల్లాచెదురుగా పరిగెత్తారు. వారిలో కొందరు ఈమె భవనంలో దూరి దాక్కున్నారు. దుండగులు అక్కడకు వచ్చి దాక్కున్న వాళ్ళను బయటకన్నా పంపండి లేదా మేమే లోపలకు వచ్చి వాళ్ళను చంపుతాము అన్నారు. ఆమె అంగీకరించక వారిని కఠినంగా మందలించి వెళ్ళిపొమ్మని చెప్పింది. ఆమె తమ మతానికి చెందిన గౌరవనీయ వ్యక్తి కావటం వల్ల వారు వెనక్కు వెళ్ళిపోయినారు.*
*ఆమెకు రెండు పుణ్యాలు మిగిలినవి. ఒకటి రోజూ దేవాలయ సంకీర్తనలు విన్న పుణ్యం, రెండవది ఆపదలో ఉన్న వారిని రక్షించిన పుణ్యం. దీనివల్ల ఆమె ఈ జన్మలో హిందువుగా పుట్టింది. సంగీతంలో విద్వాంసురాలయింది. తెలుగులో డాక్టరేటు చేసి ప్రభుత్వ సర్వీసులో చేరి గవర్నమెంటు కాలేజీ ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేసి ప్రస్తుతం ఒక సంగీత పాఠశాలను నడుపుతున్నది. చేసిన కర్మలు ఫలితాలను వివిధ రీతులుగా ఇస్తుంటవి. అలాగే మరొక రచయిత్రి పూర్వజన్మలో ఒక అమాయకురాలయిన పల్లెటూరి పిల్ల. ప్రతిరోజూ తన గ్రామం నుండి పూలు, పండ్లు తెచ్చి పట్టణంలో అమ్ముకొని వెళ్ళేది. ఆ పట్టణ పరిపాలకుడయిన ఒక మహమ్మదీయ ప్రభువు ఆమెను చూచి వాంఛించాడు. ఆమె అంగీకరించలేదు. కోపంతో ఖైదులో పెట్టించాడు. ఆ ఖైదులోనే ఆమె మరణించింది. ఆమె కారాగారంలో ఉన్నప్పుడు నే నామెకు కొంత సహాయం చేశాను. ఆమె ఈ జన్మలో రచయిత్రి అయి నా సారస్వత పరివారంలో స్థానం పొందింది.*
*జన్మలు మారినపుడు పురుషులు స్త్రీలు కావచ్చు, స్త్రీలు పురుషులు కావచ్చు, మతములు జాతులు మారవచ్చు. అలా మార్పులు చెందిన వాళ్ళని కూడా చాలా మందిని చూచాను. కాశీలో ఒక మహమ్మదీయుడు ఒక శతాబ్దం క్రింద నా శిష్యుడు. ఈ జన్మలో స్త్రీగా పుట్టి చదువుకొని ఉద్యోగం చేస్తూ నాకు భక్తురాలు కావటం జరిగింది. అయిదు వందల ఏండ్ల క్రిందటి ఒక బౌద్ధయోగిని తెలుగు భూమిలో పుట్టి ఒక హైస్కూలు హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసి ఇప్పుడు కుర్తాళం ఆశ్రమంలో తపస్సు చేసుకొంటున్నది. వీళ్ళలో చాలా మంది కాశీ, బృందావనం మొదలైన చోట్లకు తీర్థయాత్రలకు నాతో పాటు రావటం మంత్రోపదేశం పొంది తీవ్ర జప, ధ్యాన సాధనలు చేయటం అలవాటు చేసుకొన్నారు. పూర్వజన్మలో బృందావనంలో నా దగ్గర ఉన్న ఒక యువకుడు ఈ జన్మలో కవి అయి శతావధానియై ఆశుకవితా నిపుణుడై కీర్తి పొంది కాలేజీలో నా విద్యార్థిగా ఉండి ఇటీవల నేను పీఠాధిపతినైన తరువాత నా మీద ఒక శతకమే రచించాడు. ఈ విధంగా చెప్పటం మొదలు పెడితే వీటికోసం వేరే ఒక పుస్తకమే వ్రాయవలసి ఉంటుంది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 7 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*
*🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 7 🌻*
*సుందర కాండము, మహాయోగుల జీవితములు, సనత్సుజాతీయము వంటివి కూడా మృత్యువు స్వరూప స్వభావములను వివరించుచూ మృత్యువును దాటు ఉపాయములను అందించినవి. శ్రీమాత సర్వమృత్యు నివారిణి గనుక ఆమె ఆరాధనమున ఉపాసకులు ఆమె వెలుగున ప్రవేశింతురు. ఆమె వెలుగు ఆవరణలో ప్రవేశించుట నేర్చినవారికి దేహము విడచుటయే యుండును గాని దేహమున మరణించుట యుండదు. అట్లే అకాల మృత్యువు, అపమృత్యువు కూడ నుండదు. శ్రీదేవి ఆరాధనమున ఆమె దివ్యకాంతిని తమయందు దర్శించుచూ ఆ కాంతి ఆవరణలో ప్రవేశించుట జరుగ వలెను. ఆమె హిరణ్య ప్రాకారమున చేరువారి కిక మృత్యువు లేదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 7 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻*
*🌻 552. 'Sarvamrutyu Nivarini' - 7 🌻*
*Sundara Kanda, Lives of Mahayogis and Sanatsujatiya also explain the nature of death and provide ways to transcend death. As Shrimata is Sarvamrityu Nivarini, in their devotion her worshipers enter into her light. Those who have learned to enter the enclosure of her light will leave the body but will not die in the body. Likewise, there is no premature death or untimely death. In the worship of Sridevi, it should be seeing her divine light in oneself and entering the enclosure of that light. There is no death for those who reach her Hiranya Prakaram.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comments