🍀🌹 08, AUGUST 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) *🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయము - ఆత్మానుభవోపదేశము - జనక ప్రశ్న 🌹*
2) 🌹 AshtaVakra Gita - 1st Chapter -Verse 1 - Self-experiential discourse
3) *🌹 अष्टावक्र गीता - 1व अध्याय - 1व श्लोक - आत्मानुभव पर आधारित संवाद 🌹*
🌹 06, AUGUST 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం , భౌమ వాసర సందేశాలు🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 960 / Vishnu Sahasranama Contemplation - 960 🌹
🌻 960. ప్రాణనిలయః, प्राणनिलयः, Prāṇanilayaḥ 🌻
5) 🌹 సిద్దేశ్వరయానం - 119 🌹
🏵 భైరవ సాధన - 1 🏵
6) 🌹. శివ సూత్రములు - 274 / Siva Sutras - 274 🌹
🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 4 / 3 - 45. bhūyah syāt pratimīlanam - 4 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయము - ఆత్మానుభవోపదేశము - జనక ప్రశ్న 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*ఆష్టావక్ర గీత 1వ అధ్యాయంలోని, 1వ శ్లోకంలో రాజు జనకుడి ప్రగాఢ ప్రశ్నలను తెలుసుకోండి. ఈ ప్రాచీన గ్రంథం లో జ్ఞానం, విముక్తి మరియు విరాగ్యం యొక్క సారాన్ని అన్వేషించండి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
AshtaVakra Gita - 1st Chapter -Verse 1 - Self-experiential discourse
Explore the profound questions of King Janaka in the Ashtavakra Gita 1st Sloka. Discover the essence of knowledge, liberation, and dispassion as we delve into the timeless wisdom of this ancient text.
Prasad Bharadwaj
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 अष्टावक्र गीता - 1व अध्याय - 1व श्लोक - आत्मानुभव पर आधारित संवाद 🌹*
*अष्टावक्र गीता, 1व श्लोक में राजा जनक के गहरे प्रश्नों का अन्वेषण करें। इस प्राचीन ग्रंथ की कालातीत बुद्धि में ज्ञान, मुक्ति और वैराग्य के सार को जानें।*
*✍️ प्रसाद भारद्वाज
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 960 / Vishnu Sahasranama Contemplation - 960 🌹*
*🌻 960. ప్రాణనిలయః, प्राणनिलयः, Prāṇanilayaḥ 🌻*
*ఓం ప్రాణనిలయాయ నమః | ॐ प्राणनिलयाय नमः | OM Prāṇanilayāya namaḥ*
యత్ర ప్రాణా ఇన్ద్రియాణి నిలీయన్తే హరావుత ।
తత్పరతన్త్రతయా వా దేహస్యైతస్య ధారకాః ॥
ప్రాణాపానాదయస్తస్మిన్ నిలీయన్తే హరావితి ।
వా ప్రాణనిలయః ప్రోక్తో విష్ణుర్వేదవిశరదైః ॥
యః ప్రాణితీతి స జీవః పరే పుంసి నిలీయతే ।
ప్రాణోవేత్యథవా ప్రాణాన్ జీవానపి చ సంహరన్ ॥
ఇతి వా ప్రాణనిలయ ఇతి విష్ణుస్సమీర్యతే ॥
*ప్రాణములు అనగా ఇంద్రియములు - ఎవనికి పరతంత్రములగుచు ఎవనియందు మిక్కిలిగా లయమును పొందుచున్నవో అట్టి జీవుడు 'ప్రాణనిలయః' అనబడును. అట్టి జీవుడు వాస్తవమున పరమాత్మునితో అభిన్నుడే! దేహమును నిలిపి పట్టు ప్రాణాపానాది ప్రాణములు ఎవనికి పరతంత్రములై ఎవనియందు మిక్కిలిగా లయమందుచున్నవో అట్టి జీవుడు ప్రాణనిలయః అనబడును.*
*ప్రాణధారణ చేయును కావున 'ప్రాణః' అనగా జీవుడు. అట్టి ప్రాణము లేదా జీవుడు ఎవనియందు మిక్కిలిగా లయమును, ఏకత్వమును పొందునో అట్టి పరమపురుషుడు, పరమాత్ముడు ప్రాణనిలయః అనబడును. ప్రాణములను, ఇంద్రియములను, ప్రాణాపానాదికమును, జీవులను - తనయందు ఉపసంహరించుకొనును కావున పరమాత్మునకు 'ప్రాణనిలయః' అను నామము సరిపడియున్నది.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 960🌹*
*🌻 960. Prāṇanilayaḥ 🌻*
*OM Prāṇanilayāya namaḥ*
यत्र प्राणा इन्द्रियाणि निलीयन्ते हरावुत ।
तत्परतन्त्रतया वा देहस्यैतस्य धारकाः ॥
प्राणापानादयस्तस्मिन् निलीयन्ते हराविति ।
वा प्राणनिलयः प्रोक्तो विष्णुर्वेदविशरदैः ॥
यः प्राणितीति स जीवः परे पुंसि निलीयते ।
प्राणोवेत्यथवा प्राणान् जीवानपि च संहरन् ॥
इति वा प्राणनिलय इति विष्णुस्समीर्यते ॥
Yatra prāṇā indriyāṇi nilīyante harāvuta,
Tatparatantratayā vā dehasyaitasya dhārakāḥ.
Prāṇāpānādayastasmin nilīyante harāviti,
Vā prāṇanilayaḥ prokto viṣṇurvedaviśaradaiḥ.
Yaḥ prāṇitīti sa jīvaḥ pare puṃsi nilīyate,
Prāṇovetyathavā prāṇān jīvānapi ca saṃharan.
Iti vā prāṇanilaya iti viṣṇussamīryate.
*Prāṇas or life forces are the senses. They are sustained in the jīva i.e., living being as they are extra-dependent. In the ultimate analysis, the jīva, hence, is identical with Brahman. So the jīva is Prāṇanilayaḥ. Prāṇa, apāna and such life forces are the supports of the body. They merge in Him; so Prāṇanilayaḥ.*
*Breathe stands for prāṇa, the jīva. That merges in the supreme person who is, thus, called Prāṇanilayaḥ. The Paramātma annihilates the prāṇas and jīvas. So He is aptly called Prāṇanilayaḥ - the refuge or resting place of life forces.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥
Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhrt prāṇajīvanaḥ,Tattvaṃ tattvavidekātmā janmamrtyujarātigaḥ ॥ 103 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 119 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 భైరవసాధన - 1 🏵*
*కొద్దికాలం క్రింద ఒక ఉద్యోగిని చిత్రమైన సమస్యతో వచ్చింది. ఆమెకు ఇద్దరు కుమారులు. పుత్రులిద్దరూ మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఒకడు అమెరికాలో ఉన్నాడు. మరొకడు పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉన్నాడు. కూతుళ్ళిద్దరు ఉన్నారు. వారు కూడా బాగానే ఉన్నారు. ఇంతలో భర్త మరణించాడు. సహజంగా దుఃఖహేతువే. అయితే ఎంత అనుబంధం కలవారికైనా కొన్నాళ్ళకు దుఃఖతీవ్రత తగ్గుతుంది. కానీ ఈమెకు తగ్గలేదు. నెలలు గడుస్తున్నవి. సంవత్సరాలు గుడుస్తున్నవి. శోకమాగదు. ఆమె నడిగితే ఎందుకమ్మా! ఇంత దుఃఖిస్తున్నావు అంటే 'ఏమో నాకు తెలియదు. వద్దనుకున్నా ఆగకుండా ఏడుపు వస్తున్నది. ఆపటం నా తరం కావటం లేదు" అన్నది.*
*ధ్యానంలో చూస్తే అది ఆమె దుఃఖం కాదు. ఆమె భర్త మరణించినా ఆమెను విడిచిపెట్టలేక ఆమెను పట్టుకొన్నాడు. ఆ దుఃఖం అతని దుఃఖం. ఆమెది కాదు. భైరవుని ప్రార్థిస్తే ఆస్వామి అతనిని ప్రక్కకు తప్పించి ఉత్తమ గతికి పంపించాడు. ఇప్పు డామె ప్రశాంతంగా ఉన్నది. తన స్వగ్రామంలో ఒక గుడిని కట్టించి అక్కడ సేవ చేసుకొంటూ కాలం గడుపుతున్నది.*
*కొన్ని సంవత్సరాల క్రింద ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. ఒక వృద్ధస్త్రీ తీవ్రవ్యాధిగ్రస్తురాలయి మరణించింది. ఆమెకు ఒక్కతే కూతురు. ఆ అమ్మాయికి పెళ్ళిచేసింది. ఆ అమ్మాయి భర్తతో కాపురం చేసుకొంటున్నది. కొంతకాలానికి తల్లి ఏ వ్యాధితో మరణించిందో ఈ అమ్మాయికి కూడా అదే వ్యాధి వచ్చింది. తెలిసినవారితో వచ్చి ఆ అమ్మాయి తన వ్యాధిని గూర్చి నివేదించినపుడు చూడగా ఆ అమ్మాయిలో ఆమె తల్లి కన్పిస్తున్నది. “ఇదేమిటమ్మా! నీ కూతురంటే నీకు ప్రేమకదా? అమ్మాయిని పట్టుకొని పీడిస్తున్నావేమిటి ? అని అడిగాను. దానికి ఆమె సమాధానం ఇలా చెప్పింది. "అయ్యా ! మా అల్లుడు అమ్మాయిని సరిగా చూసుకోవటం లేదు. నేను దీనిని తీసుకు వెళ్ళి నా దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూచుకొంటాను.” నేను ఆశ్చర్యంతో "అదేమిటమ్మా! నీ బిడ్డ కదా ! చంపుతావా?" అన్నాను. “చంపితే ఏమి ? నేను చావలేదా ? చావనేది ఒక మజిలీయే కదా! పాంచ భౌతిక శరీరం నుండి మరో శరీరంలోకి మారే స్థలం సమయమది" అని ఆమె అన్నది.*
*అప్పుడు నేను "అమ్మా! ఈ అమ్మాయిని కొంతకాలం ఇక్కడ ఉండనియ్యి. నీవు వెళ్ళిపో నీకూతురు బ్రతికి ఉండాలని కోరుతున్నది. ఆమెకు ఇప్పుడు రావాలని లేదు" అని చెప్పి దేవతాను గ్రహం వల్ల ఆమెను అవతలకు పంపించి వేశాను. శత్రుత్వం తోటో, ప్రయోగం వలననో లేక కర్మవశాననో కాక ప్రేమతో కూడా ప్రేతములు మనుష్యులను బాధిస్తవి అన్న సంగతిని చూచాను.*
*కాశీలో కాలభైరవునితో అనుబంధము రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఊరికి ఒక వైపు చివర కపాలమోచన తీర్థం. రుద్రుడు బ్రహ్మ అయిదవ శిరస్సును ఛేదించగా బ్రహ్మహత్య ఆవహించి ఆ కపాలము చేతికి అంటుకొని భైరవుడై ఆ పునుకతో భిక్షాటనం చేసి దానిలో భుజిస్తూ లోకాలన్నీ సంచారం చేసి చివరకు కాశీలో అడుగు పెట్టినపుడు ఆ కపాలం క్రింద పడిపోయింది. అక్కడ కపాలమోచనతీర్థం రూపొందింది. అక్కడ భైరవుని కపాల భైరవుడంటారు. శ్రీనాధుడు తన కాశీఖండంలో “అదెవిధాతృ కపాల మవని వ్రాలిన చోటు, వాడె శ్రీమత్కాలవటుకరాజు" అని వ్రాశాడు. అతడే కాలభైరవుడని, వటుక భైరవుడని కొందరి అభిప్రాయము.*
*ఏదైనా, ఆలయాలకు సంబంధించినంత వరకు విశ్వనాధుడి ఆలయంతో సహా ప్రాచీన స్థానాలు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ధ్వంసమై తరువాతి కాలలో ఎక్కడెక్కడో పునర్నిర్మించబడినవి. ఎక్కడ నిర్మించినా భక్తుల పూజలు అందుకోటానికి ఆయా దేవత లక్కడికి వస్తూనే ఉంటారు. కపాలభైరవ మందిరానికి వెళ్ళినప్పుడు మొదటిసారి అక్కడ అడుగుపెట్టగానే భైరవుడు, అతని భార్య కాళి - అక్కడ కాళీవిగ్రహం కూడా ఉన్నది. ఇద్దరూ సాక్షాత్కరించారు. కాశీ వెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళ్ళి జపహోమ ధ్యానములు చేస్తూ నా శిష్యుల చేత చేయిస్తూ ఉన్నాను. ఒక రాత్రి యజ్ఞం చేస్తుంటే హోమకుండంలో నాలుగు వందల సంవత్సరాల వయసున్న ఒక బలిష్ఠ కాపాలికుడు దర్శన మిచ్చాడు. నాకే కాక నాతో వచ్చిన అనేకులకు అక్కడ దివ్యాను భూతులు కలిగినవి.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 274 / Siva Sutras - 274 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 4 🌻*
*🌴. చైతన్యం యొక్క ప్రకాశం వల్ల పరిమిత జీవి కరిగి పోవడంతో, స్వచ్ఛమైన స్వయం తిరిగి దాని అసలైన స్వచ్ఛమైన స్థితికి తిరిగి వస్తుంది. 🌴*
*మనం థియేటర్‌లో సినిమా చూసినప్పుడు, మన అవగాహనను తెరపై నుంచి కదలనీయము. స్పృహ భావన చాలా సులభం. మనం దేనిపైనా ఏకాగ్రత పెట్టినప్పుడు, ఆ వస్తువు యొక్క లక్షణాలను పొందుతాము. మనం నిరంతరం ఒక ఋషితో కలిసి తిరిగినప్పుడు, ఆ ఋషి యొక్క గుణాలను మనం పొందుతాము. అదేవిధంగా, విశ్వానికి కారణమైన వ్యక్తితో మన అవగాహనను స్థిరపరచినప్పుడు, మనల్ని మనం అదిగా మార్చుకుంటాము. అది విశ్వమంతటా వ్యాపించి ఉన్న పరమ శక్తి. ఆ శక్తి ఈ విశ్వంలో వ్యాపించని స్థలం ఏదీ లేదు. ఈ శక్తి వివిధ రూపాలు మరియు ఆకారాలలో కనిపిస్తుంది. రూపాలు మరియు ఆకారాలు కేవలం సూక్ష్మమైన శక్తికి తొడుగులుగా ఏర్పడతాయి. దానిని గ్రహించలేని అజ్ఞానమే మాయ, భ్రమ.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 274 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 3 - 45. bhūyah syāt pratimīlanam - 4 🌻*
*🌴. With the illumination of the consciousness and dissolution of the beingness, the pure-self reverts to its original, pure state again. 🌴*
*When we watch a movie in a theatre, we never move our awareness from the screen. The concept of consciousness is very simple. When we concentrate on something, we acquire the qualities of that object. When we continuously move with a sage, we acquire the qualities of that sage. Similarly, when we fix our awareness with the One, who is the cause of the universe, we transform ourselves as That. That is the Supreme Energy that pervades the entire universe. There is not a single point where That Energy is not diffused in this universe. This energy appears in different forms and shapes. The forms and shapes merely form as coverings to the subtle That. The ignorance of not realising That is māyā, the illusion.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
శుభ శ్రావణ తోలి శుక్రవారం గరుడ పంచమి మరియు నాగ పంచమి శుభాకాంక్షలు . ఆ నాగ దేవత మనందరి పట్ల ప్రసన్నముగా ఉండాలని అందరి మనోవాంఛలను నెరవేర్చాలని కోరుకుంటూ ..........
ప్రసాద్ భరద్వాజ
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comments