🍀🌹 09, SEPTEMBER 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹🍀
1) 🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 6వ శ్లోకము. - నీవు కర్తవు కాదని. భోక్తవు కాదని గుర్తించు. నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు, ముక్తుడవు. 🌹
2) 🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 - Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated. 🌹
3) 🌹 अष्टावक्र गीता पहला अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 6 - यह पहचानो कि तुम ना कर्ता हो और ना ही भोगता हो। तुम सदा स्वतंत्र और मुक्त हो। 🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 7 / Chapter 16 - The Divine and Demoniac Natures - 7 🌴
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 975 / Vishnu Sahasranama Contemplation - 975 🌹
🌻 975. యజ్ఞవాహనః, यज्ञवाहनः, Yajñavāhanaḥ 🌻
3) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 3 🌹
🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 3 / 558. 'kamalaksha nishevita' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 6వ శ్లోకము. - నీవు కర్తవు కాదని. భోక్తవు కాదని గుర్తించు. నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు, ముక్తుడవు. 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*అష్టావక్ర గీత - మొదటి అధ్యాయం, 6వ శ్లోకము ఆత్మ కర్తవు లేదా అనుభవించే వాడు కాదు అని బోధిస్తుంది. ఈ శ్లోకము ధర్మం, అధర్మం, సుఖం, దుఃఖం వంటి భావనలు మనసుకు సంబంధించినవని, కానీ ఆత్మ వీటికి అతీతంగా, శాశ్వత స్వేచ్ఛ కలిగినదని ప్రతిపాదిస్తుంది. అష్టావక్ర మహర్షి, జనక మహారాజుకు అహంకారమే కర్త, అనుభవించే వాడు అనే భ్రమను సృష్టిస్తుందని వివరిస్తున్నారు, కానీ ఆత్మ ద్వంద్వాలకు అతీతంగా ముక్తమైంది.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 - Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated. 🌹*
*Prasad Bharadwaj*
*Ashtavakra Gita - Chapter 1, Verse 6 teaches that the soul is neither the doer nor the experiencer. The verse emphasizes the eternal freedom of the self, unaffected by dharma, adharma, pleasure, or pain, which belong to the mind. Ashtavakra reveals to King Janaka that the ego creates the illusion of being the doer and enjoyer, but the soul remains liberated beyond dualities.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 अष्टावक्र गीता पहला अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 6 - यह पहचानो कि तुम ना कर्ता हो और ना ही भोगता हो। तुम सदा स्वतंत्र और मुक्त हो। 🌹*
*प्रसाद भारद्वाज*
*अष्टावक्र गीता के पहले अध्याय का 6वां श्लोक सिखाता है कि आत्मा ना कर्ता है और ना ही अनुभव करने वाला। यह श्लोक यह स्पष्ट करता है कि धर्म, अधर्म, सुख और दुःख जैसी भावनाएं मन से संबंधित होती हैं, लेकिन आत्मा इन सबसे परे, सदा स्वतंत्र और मुक्त रहती है। अष्टावक्र ऋषि राजा जनक को बताते हैं कि अहंकार ही कर्ता और भोगता होने का भ्रम उत्पन्न करता है, परंतु आत्मा इन द्वंद्वों से परे मुक्त होती है।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 7 🌴*
*07. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురా: |*
*న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ||*
*🌷. తాత్పర్యం : ఆసురీగుణములు గలవారు చేయవలసినదేదియో, చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వముగాని, సదాచారముగాని, సత్యముగాని వారి యందు గోచరింపదు.*
*🌷. భాష్యము : ప్రతి నాగరిక మానవసమాజము నందు ఆది నుండియు ఆచరింపబడెడి కొన్ని శాస్త్ర నియమనిబంధనలు ఉండును. వేదనాగరికతను పాటించుచు మిక్కిలి నాగరికులని ప్రసిద్ధినొందిన ఆర్యుల విషయమున ఇది ముఖ్యముగా సత్యమై యున్నది. కాని అట్లు శాస్తనిబంధనలను పాటింపనివారే ఆసురస్వభావము కలిగినవారు. కనుకనే ఆసురస్వభావము గలవారు శాస్త్రనియమముల నెరుగుటగాని, వానిని అనుసరింపవలెనను ఉద్దేశ్యమును కలిగియుండుటగాని సంభవింపదని ఇచ్చట పేర్కొనబడినది. అట్టివారిలో అధికశాతము ఆ నియమములను ఎరుగకుందురు. ఒకవేళ కొంతమంది ఆ నియమములను ఎరిగియున్నను వాని ననుసరించుటకు సిద్ధమైయుండరు.*
*అనగా శ్రద్ధగాని, వేదనియమానుసారము వర్తించవలెననెడి సంకల్పము గాని ఆసురస్వభావము గలవారికి ఉండదు. వారు ఆంతర్యమునందు గాని, బాహ్యమునందు గాని శుచిత్వమును కలిగియుండరు. ప్రతియొక్కరు స్నానము, దంతధావనము, క్షౌరము, శుభవస్త్రధారణము వంటి కర్మల ద్వారా దేహమును బాహ్యమునందు శుచిగా నుంచవలెను. అదే విధముగా చిత్తమును హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే శ్రీకృష్ణనామకీర్తనము సదా చేయుట ద్వారా శుచిగా నుంచవలెను. ఆసురీస్వభావులు ఈ అంతర్భాహ్య శుచిత్వకర్మలను అంగీకరించుటగాని, అనుసరించుటగాని చేయరు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 578 🌹*
*✍️ Sri Prabhupada, *📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 07 🌴*
*07. pravṛttiṁ ca nivṛttiṁ ca janā na vidur āsurāḥ*
*na śaucaṁ nāpi cācāro na satyaṁ teṣu vidyate*
*🌷 Translation : Those who are demoniac do not know what is to be done and what is not to be done. Neither cleanliness nor proper behavior nor truth is found in them.*
*🌹 Purport : In every civilized human society there is some set of scriptural rules and regulations which is followed from the beginning. Especially among the Āryans, those who adopt the Vedic civilization and who are known as the most advanced civilized peoples, those who do not follow the scriptural injunctions are supposed to be demons. Therefore it is stated here that the demons do not know the scriptural rules, nor do they have any inclination to follow them. *
*Most of them do not know them, and even if some of them know, they have not the tendency to follow them. They have no faith, nor are they willing to act in terms of the Vedic injunctions. The demons are not clean, either externally or internally. One should always be careful to keep his body clean by bathing, brushing teeth, shaving, changing clothes, etc.*
*As far as internal cleanliness is concerned, one should always remember the holy names of God and chant Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. The demons neither like nor follow all these rules for external and internal cleanliness.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 975 / Vishnu Sahasranama Contemplation - 975 🌹*
*🌻 975. యజ్ఞవాహనః, यज्ञवाहनः, Yajñavāhanaḥ 🌻*
*ఓం యజ్ఞవాహనాయ నమః | ॐ यज्ञवाहनाय नमः | OM Yajñavāhanāya namaḥ*
*యజ్ఞాన్ ఫలహేతు భూతాన్ యో వాహయతి కేశవః ।*
*స యజ్ఞవాహన ఇతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥*
*ఫలమునకు హేతుభూతములగు యజ్ఞములను ప్రవర్తిల్లజేయును కనుక కేశవునికి యజ్ఞవాహనః అను నామము కలదు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 975 🌹*
*🌻 975. Yajñavāhanaḥ 🌻*
*OM Yajñavāhanāya namaḥ*
यज्ञान् फलहेतु भूतान् यो वाहयति केशवः ।
स यज्ञवाहन इति प्रोच्यते विबुधोत्तमैः ॥
*Yajñān phalahetu bhūtān yo vāhayati keśavaḥ,*
*Sa yajñavāhana iti procyate vibudhottamaiḥ.*
*He directs the performance of the yajñas or vedic sacrificial rituals which are fruitful; hence He is Yajñavāhanaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥
భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥
Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*
*🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 3 🌻*
*గజేంద్రుడు సృష్టి మూలము, ఆత్మమూలమునగు తత్త్వము నారాధించెను. ఆ తత్త్వమున కధిదేవత అర్ధనారీ స్వరూపము. అందు శివుడు స్థాణువు. స్థిరముగ నుండవాడు, శ్రీమాత అతని విశ్వచేతన. ఆమె కతడు ఆధారము. ఆమె సృష్టి కాధారము. ఆమె సర్వాత్మిక కూడ. అదే స్థితి యందున్న శ్రీ మహా విష్ణువునకు ఆమె కలిగించిన ప్రేరణ వలన శ్రీ మహా విష్ణువు అకస్మాత్తుగ హుటాహుటిని బయలుదేరి గజేంద్రుని రక్షించెను. శ్రీమాతయే శ్రీ మహా విష్ణువునందు గల సంకల్పశక్తి. ఆమె ప్రేరణ మూలమున తన పరివారమునకు గాని, తన భార్యకు గాని తెలుపకయే హుటాహుటిని గజేంద్ర రక్షణమునకు పూనుకొనెను.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini*
*katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻*
*🌻 558. 'kamalaksha nishevita' - 3 🌻*
*Gajendra worshipped the primordial principle, the essence of the soul, which is represented by the form of Ardhanarishvara (half-Shiva and half-Shakti). In this form, Shiva is immovable (Sthanu), and Sri Mata is the universal consciousness, his support, and the foundation of creation. She is also the soul of all. In the same way, when Sri Mata inspired Maha Vishnu, he, without informing his consort or anyone else, hurriedly set out to rescue Gajendra. Sri Mata is the willpower that resides within Maha Vishnu, and due to her inspiration, he embarked on this mission to protect Gajendra without delay.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comments