🍀🌹 10, AUGUST 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 561 / Bhagavad-Gita - 561 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 11 / Chapter 15 - Purushothama Yoga - 11 🌴
5) 🌹 సిద్దేశ్వరయానం - 120 🌹
🏵 భైరవసాధన -2 🏵
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 554 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 554 - 1 🌹
🌻 554. 'అచింత్యరూపా' - 1 / 554. 'Achintyarupa' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 561 / Bhagavad-Gita - 561 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 10 🌴*
*10. యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ |*
*యతన్తోప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతస: ||*
*🌷. తాత్పర్యం : ఆత్మానుభవము నందు స్థితిని పొందిన యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా గాంచగలుగుదురు. కాని అచేతసులు మరియు ఆత్మానుభవము నందు స్థితిని పొందినవారు ప్రయత్నించినను ఏమి జరుగుచున్నదో గాంచలేరు.*
*🌷. భాష్యము : ఆత్మానుభవమార్గమున పలువురు యోగులున్నను ఆత్మానుభవమునందు స్థితుడు కానివాడు దేహి యొక్క దేహమునందు మార్పులెట్లు కలుగుచున్నవో గాంచలేడు. కనుకనే ఈ విషయమున “యోగిన:” అను పదము మిక్కిలి ప్రాధాన్యమును సంతరించుకొన్నది. నేటికాలమున పలువురు నామమాత్ర యోగులు మరియు నామమాత్ర యోగసంఘములున్నను వాస్తవమునకు ఆత్మానుభవ విషయమున వారందరును అంధులై యున్నారు. వారు కేవలము ఏదియోనొక దేహవ్యాయామమునకు అలవాటుపడి, దేహము దృఢముగా మరియు ఆరోగ్యముగా నున్నచో తృప్తినొందుచున్నారు. దానికి అన్యమైన విషయము వారికి తెలియదు. అట్టివారే “యతన్తోప్యకృతాత్మాన:” యనబడుదురు.*
*వారు అట్టి నామమాత్రయోగమును అభ్యసించినను ఆత్మవిదులు కాజాలరు. వారెన్నడును ఆత్మా యొక్క పునర్జన్మ విధానమును అవగతము చేసికొనజాలరు. వాస్తవముగా యోగమునందు నిలిచి ఆత్మ, జగత్తు, శ్రీకృష్ణభగవానుడు అనెడి అంశములను అవగాహన చేసికొనినవారే (అనగా కృష్ణభక్తిభావన యందు విశుద్ధ భక్తియోగమున నియుక్తులైన భక్తియోగులు) ఏది యెట్లు జరుగుచున్నదో అవగతము చేసికొనగలరు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 561 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 10 🌴*
*10. utkrāmantaṁ sthitaṁ vāpi bhuñjānaṁ vā guṇānvitam*
*vimūḍhā nānupaśyanti paśyanti jñāna-cakṣuṣaḥ*
*🌷 Translation : The foolish cannot understand how a living entity can quit his body, nor can they understand what sort of body he enjoys under the spell of the modes of nature. But one whose eyes are trained in knowledge can see all this.*
*🌹 Purport : The word jñāna-cakṣuṣaḥ is very significant. Without knowledge, one cannot understand how a living entity leaves his present body, nor what form of body he is going to take in the next life, nor even why he is living in a particular type of body. This requires a great amount of knowledge understood from Bhagavad-gītā and similar literatures heard from a bona fide spiritual master. One who is trained to perceive all these things is fortunate. Every living entity is quitting his body under certain circumstances, he is living under certain circumstances, and he is enjoying under certain circumstances under the spell of material nature.*
*As a result, he is suffering different kinds of happiness and distress, under the illusion of sense enjoyment. Persons who are everlastingly fooled by lust and desire lose all power to understand their change of body and their stay in a particular body. They cannot comprehend it. Those who have developed spiritual knowledge, however, can see that the spirit is different from the body and is changing its body and enjoying in different ways. A person in such knowledge can understand how the conditioned living entity is suffering in this material existence. Therefore those who are highly developed in Kṛṣṇa consciousness try their best to give this knowledge to the people in general, for their conditional life is very much troublesome. They should come out of it and be Kṛṣṇa conscious and liberate themselves to transfer to the spiritual world.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 120 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 భైరవసాధన -2 🏵*
*ఇటీవల తమిళనాడులోని ఒక సీనియర్ ఐ.ఎ.యస్. అధికారి కుర్తాళం వచ్చి మౌనస్వామి దర్శనం చేసుకొని ఆ తరువాత నా దగ్గరికి వచ్చాడు. తనను పరిచయం చేసుకొని నా ఫోటో ఒకటి తీసుకోవటానికి అనుమతి కోరాడు. 'తీసుకోండి మీఇష్టం' అన్నాను. తాను తీసిన ఫోటోలను ఆ కెమెరాలో అప్పటికప్పుడు చూపించాడు. ఆ ఫోటోలో నా చుట్టూ మూడు నక్షత్రాలు ప్రక్కనే ఒక నల్లని కుక్క కన్పిస్తున్నవి. ఇవి ఎలా వచ్చినవని ప్రశ్నించాను. అప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూచి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇటువంటి మహిమను నే నెన్నడూ చూడలేదు. అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ ఆ చిత్రాన్ని చూచారు. అతడు తన వెబ్సైట్లో ఆ ఫోటోలను పెట్టి కుర్తాళంలో మిరకిల్ అన్న శీర్షిక క్రింద తన అభిప్రాయాన్ని వ్రాసుకొన్నాడు. అది అతని విశ్వాసానికి చిహ్నం.*
*కొందరికి తమ ధ్యాన దర్శనాలు ప్రమాణమయితే కొందరికి తమ బాధానివారణ ప్రమాణం. కొందరికి తమ స్వప్నానుభవాలు ప్రమాణం. దేవతాత్మకములైన కలలు సత్యార్థ గంధులని జగద్గురు శంకరులు చెప్పిన వాక్యాన్ని వారు ప్రమాణంగా భావిస్తారు. భైరవునితో నాకు ఏర్పడిన ఈ అనుబంధం వల్ల ఆ స్వామిని గూర్చి పురాణ, తంత్ర గ్రంథ విశేషాలతో 'భైరవసాధన' అన్న ప్రత్యేక గ్రంథమొకటి రచించాను. దానిలోని కొన్ని పద్యాలను ఉదాహరిస్తున్నాను.*
*ఉ రజ్జువు దాల్చి వచ్చు యమరాజును వెన్కకు పంప గంగ లో మజ్జన మాచరించి నిశి మధ్యను ధ్యానముసేయ శూలియై గజ్జెల నొప్పు స్వీయ పదకంజములన్ గనిపింపజేయు నా కజ్జల రూపునిన్ దలతు కాశిక నేలెడు కాలభైరవున్.*
*పాశమును ధరించి వచ్చే యమధర్మరాజును వెనుకకు పంపటం కోసం గంగలో స్నానం చేసి అర్ధరాత్రి ధ్యానం చేస్తూంటే కాళ్ళకుగజ్జెలతో, చేతిలో శూలంతో, కాటుక కొండవలె కన్పించిన కాశీపాలకుడైన కాలభైరవుని స్మరిస్తున్నాను.*
*(గమనిక : పూర్వకాలంలో కాటి కాపరులు ఊళ్ళోకి వచ్చేటపుడు తమ రాకను తెలియ చేయటం కోసం కాళ్ళకు గజ్జెలు కట్టుకొని వచ్చేవారు).*
ఉ దుర్జయ కాలదండధరుదూరముగా పరుగెత్త జేయు నీ గర్జనమీద మోజుపడి కాశికి వచ్చితి శబ్దశాసనో పార్జితమైన నాదు కవితాకృతి నర్పణసేయుచుంటి నో
నిర్జరపూజ్యపాద ! ఇక నీదగు చిత్తము నాదు భాగ్యమున్*
*దండధరుడైన కాలుడు దుర్జయుడు. అతనిని గెలవటం ఎవరికీ సాధ్యం కాదు. అతనిని, దూరంగా పలాయనమయ్యేటట్లు చేయగలిగినది నీ గర్జన మాత్రమే. దానిమీద మోజుపడి కాశీకి వచ్చాను. శబ్ద ప్రపంచం మీద నేను కొంత సాధన చేసి ఉన్నాను. నాకు కవితాశక్తి ప్రాప్తించింది. ఓ దేవపూజ్య చరణా ! దానిని నీకు అర్పిస్తున్నాను. ఇక నీ చిత్తము, నా భాగ్యము.*
*చం॥ గమనిక నీదు పాదముల గజ్జెలచప్పుడు నట్టహాసమున్ డమరుక నాదమున్ శునక డంబరమున్ గురుతింప శ్రద్ధతో నెమకుచునుంటి కాశిపురి నీదగు మంత్రజపంబు సేయుచున్*
*సమయము దాటుచున్న యది స్వామి ! ననున్ కరుణింపు మింతకున్.*
*నీ పాదముల గజ్జెల చప్పుడు, నీ అట్టహాసం, నీ చేతిలోని డమరుకపు చప్పుడు, నీతో ఉన్న శునకముల ఆడంబరము గుర్తించటం కోసం నీ మంత్రజపం చేస్తూ కాశీలో వెదుకుతున్నాను స్వామీ ! సమయం దాటిపోతున్నది. ఇకనైనా దయచూపించు.*
*ఉ॥ అచ్చపు భక్తితో నొక శతాబ్దము క్రిందట వచ్చి యిచ్చటన్ ముచ్చటతోడ నీ కడనె మోహనరాగము పాడినాడ న న్నెచ్చటనో జనించుటకు నెందుకు పంపితి వైన నేమి ! నే వచ్చితి గుర్తు వచ్చె ప్రభువా! మరి నన్నెటు పంపబోకుమా !*
*ఓ ప్రభూ ! ఒక శతాబ్దం క్రింద ఇక్కడకు వచ్చి నీ పాదము లాశ్రయించి నీకు పూజలు చేశాను. చేతనైన విధంగా నిన్ను గూర్చి పాటలు పాడాను. నన్ను ఎక్కడనో పుట్టటానికి ఎందుకు పంపించావు ? పోనీలే! గుర్తు వచ్చేటట్లు చేశావు కదా! ఇక నన్ను ఎక్కడికి పంపవద్దని ప్రార్థిస్తున్నాను.*
*స్వామీ ! వయస్సు పైనబడుతున్నది. వెనుకటి వలె తీవ్రసాధనలు చేయగల శక్తి లేదు. ఓపిక లేదు. నీ దయను నమ్ముకొని ఇక్కడకు వచ్చాను. ఆశ్రయించిన వారిని రక్షించే దేవరవు నీవు. నన్ననుగ్రహించు. ఈ భావాలతో ఆయనను ప్రార్థించాను.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 554 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 554 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*
*🌻 554. 'అచింత్యరూపా' - 1 🌻*
*చింతించుటకు శక్యము కాని రూపము గలది శ్రీమాత అని వేయి నామములతో కీర్తించిననూ శ్రీమాతను పరిపూర్ణముగ ప్రశంసింపలేము. నిర్వచింపలేము. భావింపలేము. చింతించువాని చింతన కూడ ఆమెలోనే జరుగుచున్నది. చింతించువాడు సహితము ఆమెలో అణుమాత్రము చేయడు. అట్టి స్థితిలో ఆమె స్వరూపమును గూర్చి ఎంత చింతన చేయకలడు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 554 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*
*katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻*
*🌻 554. 'Achintyarupa' - 1 🌻*
*Even if we glorify Srimata with a thousand names, we cannot fully praise Srimata, whose form is unfathomable. Cannot be defined. Cannot feel it. The contemplation of the one who does is also happening in her. A person who contemplates is not equivalent to even an atom within her. In such a state, how much can he contemplate about her form.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Bình luận