top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 11, SEPTEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 11, SEPTEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀

1) 🌹 శివ సూత్రాలు - భాగం 1 - శంభవోపాయ - 9వ సూత్రం స్వప్నో వికల్పః - స్వప్నాలు అంటే ఆలోచనల స్వేచ్ఛా విహారం. కల అనేది ఒక ఊహా లేదా కల్పన. 🌹

2) 🌹 Siva Sutras - Part 1 - Sambhavopaya - 9th Sutra : Svapno Vikalpaḥ - Dreaming is free ranging of thoughts. Dream is Fancy or Imagination. 🌹

3) 🌹 शिव सूत्र - भाग 1 - शंभवोपाय - 9वाँ सूत्र "स्वप्नो विकल्पः" - सपने विचारों की स्वतंत्रता का भ्रमण होते हैं। सपना एक कल्पना या विचार है। 🌹

4) 🌹. శ్రీమద్భగవద్గీత - 580 / Bhagavad-Gita - 580 🌹

🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 9 / Chapter 16 - The Divine and Demoniac Natures - 9 🌴

2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 977 / Vishnu Sahasranama Contemplation - 977 🌹

🌻 977. యజ్ఞకృత్, यज्ञकृत्, Yajñakr‌t 🌻

3) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 559 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 2 🌹

🌻 559. 'తాంబూలపూరిత ముఖీ' - 2 / 559. 'Tāmbūlapūrita Mukhi' - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 శివ సూత్రాలు - భాగం 1 - శంభవోపాయ - 9వ సూత్రం స్వప్నో వికల్పః - స్వప్నాలు అంటే ఆలోచనల స్వేచ్ఛా విహారం. కల అనేది ఒక ఊహా లేదా కల్పన. 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*


*శివ సూత్రాల 9వ సూత్రం "స్వప్నో వికల్పః" లో కలలు మరియు ఆలోచనల స్వేచ్ఛా విహారం అనే విషయాన్ని చర్చిస్తారు. సాధారణ వ్యక్తులలో కలలు జాగృత స్థితిలో సేకరించిన ఇంద్రియ అనుభవాల పునర్నిర్మాణాలు. యోగి, శివ చైతన్యంతో ఐక్యత సాధించినవాడు, ఈ మానసిక నిర్మాణాలను అధిగమించి, దివ్య చైతన్యాన్ని అనుభవిస్తాడు.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 Siva Sutras - Part 1 - Sambhavopaya - 9th Sutra : Svapno Vikalpaḥ - Dreaming is free ranging of thoughts. Dream is Fancy or Imagination. 🌹*

*Prasad Bharadwaj*


*In the 9th Shiva Sutra "Swapno Vikalpaha," dreams and the freedom of thought are discussed. For ordinary people, dreams are mental recreations of sensory impressions gathered during the waking state. A yogi, who has achieved unity with Shiva consciousness, transcends these mental constructs and experiences divine consciousness beyond the illusions of both waking and dreaming states.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 शिव सूत्र - भाग 1 - शंभवोपाय - 9वाँ सूत्र "स्वप्नो विकल्पः" - सपने विचारों की स्वतंत्रता का भ्रमण होते हैं। सपना एक कल्पना या विचार है। 🌹*

*प्रसाद भारद्वाज*


*9वें शिव सूत्र "स्वप्नो विकल्पः" में सपनों और विचारों की स्वतंत्रता पर चर्चा की जाती है। सामान्य व्यक्तियों के लिए सपने जाग्रत अवस्था में एकत्रित किए गए इंद्रिय अनुभवों की मानसिक पुनर्रचनाएं हैं। योगी, जो शिव चेतना के साथ एकता प्राप्त कर चुका होता है, इन मानसिक संरचनाओं को पार कर दिव्य चेतना का अनुभव करता है, जो जाग्रत और स्वप्न अवस्थाओं की माया से परे है।*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 580 / Bhagavad-Gita - 580 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 9 🌴*


*09. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మా నోల్ప బుద్ధయ: |*

*ప్రభవన్త్యుగ్రకర్మాణ: క్షయాయ జగతోహితా: ||*


*🌷. తాత్పర్యం : నష్టాత్ములును, అల్పబుద్దులును అగు అసురస్వభావము గలవారు ఇట్టి అభిప్రాయములనే అనుసరించుచు ఆహితములును, జగద్వినాశకరములును అగు ఘోరకర్మలలో నియుక్తులగుదురు.*


*🌷. భాష్యము : అసురస్వభావము గలవారు ప్రపంచనాశకర కర్మల యందే నియుక్తులై యుందురు. అట్టివారిని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట అల్పబుద్ధులని తెలుపుచున్నాడు. భగవద్భావన ఏమాత్రము లేనటువంటి ఆ భౌతికవాదులు తాము పురోభివృద్ది చెందుచున్నట్లు తలచినను భగవద్గీత ప్రకారము వారు అల్పబుద్ధులు మరియు జ్ఞానము లేనట్టివారే యగుదురు. భౌతికజగము నందు సాధ్యమైనంతవరకు సుఖము ననుభవింపవలెనని యత్నింపగోరుటచే ఇంద్రియతృప్తికి ఏదియో ఒక క్రొత్తదానిని కనిపెట్టుట యందు వారు సదా నిమగ్నులై యుందురు. అట్టి భౌతికపరిశోధన ఫలితములు మాత్రము జనులు మరింత హింసాప్రాయులుగా, క్రూరులుగా తయారగుచున్నారు. జనులు హింసామనస్కులై జంతువుల యెడ, ఇతర మానవుల యెడ హింసాప్రవృత్తిని వృద్ది చేసికొనుచున్నారు.*


*ఇతర జీవుల యెడ ఏ విధముగా వర్తించవలెనో వారు ఎరుగజాలకున్నారు. అట్టి అసురస్వభావుల యందు జంతుహింస మిక్కిలి ప్రముఖమై యుండును. తమ పరిశోధనల ద్వారా సర్వులకు వినాశనము కూర్చునదేదో తయారుచేయనున్నందున లేదా కనిపెట్టకున్నందున అట్టివారు ప్రపంచమునకు శత్రువులుగా పరిగణింపబడుదురు. అనగా అణ్వాయుధముల సృష్టి నేడు సమస్త ప్రపంచమునకు గర్వకారణమైనను, యుద్దారంభమైనంతనే అవి ఘోరవిపత్తును సృష్టింపగలవు. అట్టి యుద్ధము ఏ క్షణమునందైనను కలుగవచ్చును. అట్టివి కేవలము ప్రపంచ వినాశనముకే సృష్టింపబడునని ఇచ్చట పేర్కొనబడినది. భవద్భావన లేకపోవుట చేతనే అట్టి మారణాయుధములు మానవసమాజమున సృష్టింపబడుచున్నవి. అవి ఎన్నడును ప్రపంచ శాంతి, పురోగతులకు దోహదములు కాజాలవు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 580 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 09 🌴*


*09. etāṁ dṛṣṭim avaṣṭabhya naṣṭātmāno ’lpa-buddhayaḥ*

*prabhavanty ugra-karmāṇaḥ kṣayāya jagato ’hitāḥ*


*🌷 Translation : Following such conclusions, the demoniac, who are lost to themselves and who have no intelligence, engage in unbeneficial, horrible works meant to destroy the world.*


*🌹 Purport : The demoniac are engaged in activities that will lead the world to destruction. The Lord states here that they are less intelligent. The materialists, who have no concept of God, think that they are advancing. But according to Bhagavad-gītā, they are unintelligent and devoid of all sense. They try to enjoy this material world to the utmost limit and therefore always engage in inventing something for sense gratification. Such materialistic inventions are considered to be advancement of human civilization, but the result is that people grow more and more violent and more and more cruel, cruel to animals and cruel to other human beings.*


*They have no idea how to behave toward one another. Animal killing is very prominent amongst demoniac people. Such people are considered the enemies of the world because ultimately they will invent or create something which will bring destruction to all. Indirectly, this verse anticipates the invention of nuclear weapons, of which the whole world is today very proud. At any moment war may take place, and these atomic weapons may create havoc. Such things are created solely for the destruction of the world, and this is indicated here. Due to godlessness, such weapons are invented in human society; they are not meant for the peace and prosperity of the world.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 977 / Vishnu Sahasranama Contemplation - 977 🌹*


*🌻 977. యజ్ఞకృత్, यज्ञकृत्, Yajñakr‌t 🌻*


*ఓం యజ్ఞకృతే నమః | ॐ यज्ञकृते नमः | OM Yajñakr‌te namaḥ*


*జగదాదౌ తదన్తేచ విష్ణుర్యజ్ఞం కరోత్యుత ।*

*కృతన్తీతి హరిర్యజ్ఞకృదితి ప్రోచ్యతే బుధైః ॥*


*జగత్తు ఆదియందు అనగా సృష్టియందును, జగత్ అంతమునందు అనగా ప్రళయమందున యజ్ఞమునాచరించును. ప్రళయకాలమున యజ్ఞమును ప్రవర్తిల్లకుండ చేయును.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 977 🌹*


*🌻 977. Yajñakr‌t 🌻*


*OM Yajñakr‌te namaḥ*


*जगदादौ तदन्तेच विष्णुर्यज्ञं करोत्युत ।*

*कृतन्तीति हरिर्यज्ञकृदिति प्रोच्यते बुधैः ॥*


*Jagadādau tadanteca viṣṇuryajñaṃ karotyuta,*

*Kr‌tantīti hariryajñakr‌diti procyate budhaiḥ.*


*At the beginning of the world and at the end of it, He performs yajña or destroys it; so Yajñakr‌t.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr‌dyajñakr‌dyajñī yajñabhugyajñasādhanaḥ,Yajñāntakr‌dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 559 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 559 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*

మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*


*🌻 559. 'తాంబూలపూరిత ముఖీ' - 2 🌻*


*తాంబూల చర్వణము దుర్గంధమును పారద్రోలు టయే గాక జిహ్వ జాడ్యములను కూడ నిర్మూలించును. దేహము ఆరోగ్యముగ నుండును. నోరు కూడ సుగంధ మగు వాసనను కలిగి యుండును. భోజనానంతరము తీరికగ తాంబూలమును గొనుట వలన స్వీకరించిన భోజనము సులభముగ జీర్ణమగును. శ్రీమాత దాడిమీ పూరిత ముఖము సాధకులకు ఈ సందేశ మిచ్చును. అంతేకాక శ్రీమాత రతిప్రియ గనుక, సతతము శివునితో కూడి యుండును గనుక ఆమె నోటి సుగంధము శివుని ఆకర్షించి తన కుమ్ముఖము చేయును. స్త్రీలు కూడా పురుషుల నాకర్షించుటకు తాంబూలమును ఒక సాధనముగ వాడుదురు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 559 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 114. Tanbulapuritamukhi dadimikusumaprabha

mrugashi mohini mudhya mrudani mitrarupini  ॥114 ॥ 🌻*


*🌻 559. 'Tāmbūlapūrita Mukhi' - 2 🌻*


*Chewing tāmbūla not only eliminates bad breath but also eradicates the sluggishness of the tongue, promoting overall health. It also leaves the mouth fragrant. Consuming tāmbūla leisurely after a meal aids in easy digestion. The Goddess Śrī Mātā, with lips colored like a pomegranate, conveys this message to her devotees. Additionally, since Śrī Mātā is beloved by Śiva and is constantly with him, the fragrance of her mouth attracts Śiva and draws him toward her. Women also use tāmbūla as a means to attract men.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹


Commenti


bottom of page