top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 12, AUGUST 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹

🍀🌹 12, AUGUST 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹🍀

1) 🌹 శివ సూత్రాలు - 1-3. యోని వర్గః కళా శరీరం 🌹

2) 🌹 Siva Sutras - 1-3. "Yoni vargaḥ kala Sariram," 🌹

3) 🌹 शिव सूत्र - भाग 1 - सांभवोपाय - सूत्र 3. योनि वर्गः कला शरीरम् 🌹

🌹

4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 961 / Vishnu Sahasranama Contemplation - 961 🌹

🌻 961. ప్రాణభృత్, प्राणभृत्, Prāṇabhr‌t 🌻

5) 🌹 సిద్దేశ్వరయానం - 121 🌹

🏵 భైరవ సాధన - 3 🏵

6) 🌹. శివ సూత్రములు - 275 / Siva Sutras - 275 🌹

🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 5 / 3 - 45. bhūyah syāt pratimīlanam - 5 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 శివ సూత్రాలు - 1-3. యోని వర్గః కళా శరీరం 🌹*

*🍀 ఏకమూలంగా ఉన్న బహువిధ రూపాలే విశ్వం యొక్క సంపూర్ణ దేహం. 🍀*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*



*శివసూత్రాలలో మూడవ సూత్రం "యోని వర్గః కళా శరీరం" అనే సూత్రం, బ్రహ్మన్ అనే ఒకే మూలం నుండి ప్రారంభమయ్యే భిన్నమైన రూపాల సముదాయంతో మొత్తం విశ్వం రూపొందించ బడిందనే భావనను పరిశీలిస్తుంది. ఈ సూత్రం అన్ని రూపాల యొక్క ఏకత్వాన్ని ప్రాధాన్యం చేస్తుంది మరియు ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ఆధ్యాత్మిక సాధకులను బహువిధత్వపు మాయ నుండి బయటపడే మార్గంలో నడిపిస్తుంది. ఈ మాయ సృష్టించే భ్రమ మరియు మలం అనే మలినతలు బ్రహ్మం యొక్క ఆత్మ జ్ఞానాన్ని అడ్డుకుంటున్నాయి అని వివరిస్తుంది.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 Siva Sutras - 1-3. "Yoni vargaḥ kala Sariram," 🌹*

*🍀 The Whole Body of the universe is the multitude of forms originating from a single source 🍀*

*✍️ Prasad Bharadwaj*



*The third sutra of the Siva Sutras, "Yoni vargaḥ kala Sariram," explores the concept that the entire universe is composed of diverse forms originating from a single source, Brahman. This sutra emphasizes the unity behind all forms and guides spiritual seekers to move beyond the illusion of multiplicity towards the realization of oneness with the Supreme Consciousness. It highlights the role of Maya in creating this illusion and the impurities (Mala) that cause bondage, preventing the realization of Brahman.*

*Prasad Bhardwaj*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 शिव सूत्र - भाग 1 - सांभवोपाय - सूत्र 3. योनि वर्गः कला शरीरम् 🌹*

*🍀 एकमूल रूप से विद्यमान विविध रूप ही विश्व का संपूर्ण शरीर हैं। 🍀*

*✍️. प्रसाद भारद्वाज.*


*शिव सूत्रों के तीसरे सूत्र "योनि वर्गः कला शरीरम्" में इस अवधारणा का अन्वेषण किया गया है कि संपूर्ण ब्रह्माण्ड अनेक रूपों से मिलकर बना है, जिनका मूल एक ही स्रोत, ब्रह्म है। यह सूत्र सभी रूपों के पीछे छिपे एकत्व को महत्व देता है और साधकों को माया के बहुविध भ्रामक रूपों से ऊपर उठकर परम चेतना के साथ एकत्व की प्राप्ति के मार्ग पर अग्रसर करता है। इसमें माया के द्वारा उत्पन्न भ्रम और माला के रूप में अशुद्धियों का वर्णन किया गया है, जो ब्रह्म की प्राप्ति में बाधा उत्पन्न करती हैं।*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 961 / Vishnu Sahasranama Contemplation - 961 🌹*


*🌻 961. ప్రాణభృత్, प्राणभृत्, Prāṇabhr‌t 🌻*


*ఓం ప్రాణభృతే నమః | ॐ प्राणभृते नमः | OM Prāṇabhr‌te namaḥ*


*పోషయన్నన్నరూపేణ ప్రాణాన్ స ప్రాణభృద్ధరిః*


*అన్న రూపమున తానుండి ప్రాణములను నిలుపుచు పోషించుచునుండును కనుక ప్రాణభృత్‍.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 961🌹*


*🌻 961. Prāṇabhr‌t 🌻*


*OM Prāṇabhr‌te namaḥ*


*पोषयन्नन्नरूपेण प्राणान् स प्राणभृद्धरिः / Poṣayannannarūpeṇa prāṇān sa prāṇabhr‌ddhariḥ*


*Through and as food, He sustains the prāṇās or life forces - so Prāṇabhr‌t.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr‌t prāṇajīvanaḥ,Tattvaṃ tattvavidekātmā janmamr‌tyujarātigaḥ ॥ 103 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 సిద్దేశ్వరయానం - 121 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*


*🏵 భైరవసాధన -3 🏵*


*ఆంధ్రదేశంలో చాలా చోట్ల భైరవాలయాలు ఉన్నాయి. ఉజ్జయినిలో, ఢిల్లీలో ఇంకా అనేక క్షేత్రాలలో ప్రసిద్ధమయిన భైరవాలయాలు ప్రకాశిస్తున్నాయి. దాదాపు ప్రతిచోట మద్యాన్ని నైవేద్యం పెట్టటం ఆచారంగా ఉంది. ఆంధ్రదేశంలో కడప జిల్లాలోని పులివెందుల దగ్గర మోపూరు గ్రామంలో కొండమీద బాలభైరవుని ఆలయమున్నది. ఆ దేవుని వర్ణన క్రీడాభిరామంలో వల్లభరాయడనే కవి ఇలా వర్ణించాడు.*


సీ|| చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు విమల దంష్ట్రా ప్రరోహములవాని

పవడంపు కొనలతో ప్రతివచ్చు ననవచ్చు కుటిలకోమల జటాచ్ఛటల వాని

ఇంద్రనీలములతో నెనవచ్చు ననవచ్చు కమనీయతర దేహకాంతి వాని

ఉడురాజు రుచులతో నొరవచ్చు ననవచ్చు చంచన్మదాట్టహాసముల వాని

గీ॥ సిగ్గుమాలిన మొలవాని చిరుతవాని ఎల్లకాలంబు ములికినా డేలువాని

అర్థి మోపూర నవతారమైన వాని భైరవుని గొల్వవచ్చిరి భక్తవరులు.


*అతడు భైరవుని ప్రత్యక్షం చేసుకొని సిద్ధసారస్వతశ్రీని పొందానని వ్రాసుకొన్నాడు. ఆ మోపూరి భైరవుని భక్తుడయిన ఒకరు ఇప్పుడు గోదావరి జిల్లాలో పుట్టి నా దగ్గరకువచ్చి కుర్తాళంలో భైరవసాధన మొదలు పెట్టాడు. అతడి జన్మరహస్యం కుర్తాళనాడీగణపతి సన్నిధిలో తెలియచేయబడింది. కుర్తాళంలో కుర్తాళ నాథేశ్వరుని ఆలయంలో సుందరమైన భైరవ విగ్రహం ఉన్నది. అక్కడే మౌనస్వామి చాలా కాలం తపస్సు చేశాడు. దక్షిణదేశంలో చాలా చోట్ల శివాలయాలలో, కుమారస్వామి ఆలయాలలో భైరవ విగ్రహాలున్నవి. ప్రాచీనులు ఎప్పుడో ఆ ఆలయాలను నిర్మించారు. కానీ భైరవునికి పూజలు జరగటం అంతగా కన్పించటం లేదు. కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠంలోను, గుంటూరులో సిద్ధేశ్వరీ వీఠమందిరంలోను, విశాఖపట్టణంలోని లలితాపీఠంలోనూ కాలభైరవునకు ఆలయాలు కట్టించాను. అక్కడ నిత్యపూజలు జరుగుతున్నవి. మందార వారుణీ మద ఘూర్ణితాత్ముడు, డమరు, ఖట్వాంగ కపాలపాణి, కుర్కుర పరివార కోటిసేవితుడైన ఆ భైరవుని స్తుతిస్తూ నేను చెప్పిన పద్యాలను చూడండి.*


శ్లో॥ నమో భూతనాధం నమః ప్రేతనాథం నమః కాలకాలం నమోరుండమాలం

నమః కాళికా ప్రేమలోలం కరాళం నమో భైరవం కాశికా క్షేత్రపాలం

సీ ॥ హాలామదాలోల లీలా విలాసాయ భవ నమస్తే కాలభైరవాయ

కాళికా సురత శృంగార సంప్రీతాయ వర నమస్తే కాలభైరవాయ

డమరు కృపాణ దండ కపాలహస్తాయ భర్గ నమః కాలభైరవాయ

అట్టహాస పలాయితాంతకాయ హరాయ వందనం తే కాలభైరవాయ


*లోకములో కొందరు ప్రేమోన్మాదులు. కొందరు దివ్యోన్మాదులు. నేను మంత్రోన్మాదిని. వ్యాసుని రచనలు చూచి కాశీకి వెళ్ళాలి. గంగలో స్నానం చేయాలని చాలా సార్లు అనుకొనేవాడిని. నీ అనుమతి వస్తేనే గదా ఎవడైనా ఆ పంచక్రోశపరీత క్షేత్రంలో అడుగు పెట్టేది. ఎలానో వచ్చాను. నీ వెలుగు కోసం వెదుకుతున్నాను. అన్నట్లు మొన్న నీ ద్వీపానికి వెళ్ళి వచ్చాను. అక్కడ నీ దర్శనమైన తర్వాత అది నీ నివాసమైన భైరవ ద్వీపమని తెలుసుకొన్నాను. నా అనుచరుడు కూడా స్వామీజీ! ఇక్కడి కిదివర కెప్పుడో వచ్చినట్లు అనిపిస్తున్నది అన్నాడు. నిజమే ! ఇక్కడ నీవు కాళీదేవితో విహరించావు. ఎన్ని జన్మల నుంచో అప్పుడప్పుడు వచ్చి నిన్ను సేవిస్తూనే ఉన్నాము.*


*పూర్వం ఒక జన్మలో జాతకరీత్యా మారక సమయం వచ్చింది. గ్రహముల శక్తిని ఎదిరించే ఆశ పోయింది. అయినా నిన్ను నమ్మి భజించాను. మృత్యువు దూరంగా వెళ్ళిపోయింది. నా భక్తి భరిత సాధనకు సంతోషించి నన్ను మహాసిద్ధుని చేశావు. నాధ సంప్రదాయంలో తపస్సు చేసినందువల్ల అందరూ నన్ను భైరవనాధుడన్నారు. ఆనాడు నన్ను ఎలా ఉద్ధరించావో ఓ ప్రభూ ! ఈనాడు కూడా ఆవిధంగానే రక్షించు.*


*కాశీలో భూగుహలున్నవని చెప్పబడే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆది యుగాలలో జైగీషవ్యుడనే మునిగా నే నక్కడ ఉన్నట్లు స్ఫురించింది. అలానే హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక చోట నివసిస్తూ అనూరాధ అనే ఒక దేవకన్యను పెండ్లి చేసుకొని సంతానాన్ని కన్న తరువాత విశ్వామిత్రుని కథలో మేనకవలె ఆమె విడిచి వెళ్ళిపోయిందని తెలిసింది. క్షేత్రంలో రకరకాల అనుభూతులు. నావే కాక నాతో పాటున్న ఎందరివో జన్మ రహస్యాలు, దేవతలు, సిద్ధులు తెలియచేస్తున్నారు. ఏమైనా ఇప్పుడు బృందావనము, కాశీ, కుర్తాళము ఈ మూడూ ప్రధాన కేంద్రాలుగా నా తపస్సాధన సాగుతున్నది.*

*వేల సంవత్సరాలనుండి అనేక దివ్యక్షేత్రముల వలె కుర్తాళం కూడా ఒక అద్భుత సిద్ధక్షేత్రం. అగస్త్య మహర్షి దీనిని మహనీయ యోగకేంద్రంగా తీర్చిదిద్దాడు. ఎందరో మహాయోగులు తపస్సు చేసిన స్థలమిది. ఇప్పటికి గుర్తువచ్చినంత వరకు నాలుగు వేల ఏండ్ల క్రింద నేను ఇక్కడకు మొదటిసారి వచ్చాను. మహనీయుడైన మౌనస్వామి కూడా వచ్చారు. అప్పటినుండి ఈ స్థలంతో ఈ క్షేత్రంతో ఇక్కడ యోగులతో అనుబంధం. ఇక్కడి యోగులు మరెక్కడ పుట్టినా, మరెక్కడ నివసిస్తున్నా వారితో పరిచయం పునరావృతమౌతూనే ఉన్నది. అందుకే ఇది సిద్ధిస్థానం. ఇక్కడకు వచ్చి తపస్సు చేయండి. శీఘ్రంగా ఫలిస్తుంది అని యెలుగెత్తి ఉద్బోదిస్తున్నాను.*

*( సశేషం )*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 275 / Siva Sutras - 275 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*3వ భాగం - ఆణవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 5 🌻*


*🌴. చైతన్యం యొక్క ప్రకాశం వల్ల పరిమిత జీవి కరిగి పోవడంతో, స్వచ్ఛమైన స్వయం తిరిగి దాని అసలైన స్వచ్ఛమైన స్థితికి తిరిగి వస్తుంది. 🌴*


*జ్ఞానోదయం పొందిన యోగి తన అవగాహనను అంతర్గతం నుండి బాహ్యానికి తరలిస్తాడు. అతను లోపల ఉన్న భగవంతుడిని తెలుసుకుంటాడు మరియు అతను తన చైతన్యాన్ని బాహ్యంగా కదిలించినప్పుడు, అక్కడ కూడా జ్ఞానోదయం పొందిన యోగి భగవంతుడిని సాక్షాత్కరిస్తాడు. విశ్వమంతా ఆయనకు భగవంతుని స్వరూపంగా కనిపిస్తుంది, ఇది పరమ సత్యం. ఈ యోగి ఈ దశలో కొనసాగినప్పుడు, అతని కర్మలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయిపోతాయి. ఈ అంతిమ ప్రక్రియ అతనికి భగవంతునితో కలిసిపోయేలా చేస్తుంది. యోగి ఇప్పటి వరకు శివుని వలె కనిపించాడు, ఇప్పుడు తానే శివుడు అవుతాడు. ఆ జ్ఞానోదయమైన యోగి ఇక ఉండడు. ఇది మళ్లీ విడిపోకుండా సముద్రంలో కలిసే నదిలా ఉంటుంది.*

*శివ సూత్రాలు సమాప్తం*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 275 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

*Part 3 - āṇavopāya*

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 3 - 45. bhūyah syāt pratimīlanam - 5 🌻*


*🌴. With the illumination of the consciousness and dissolution of the beingness, the pure-self reverts to its original, pure state again. 🌴*


*The enlightened yogi moves his awareness from internal to external. He realises the Lord within and when he moves his consciousness externally, there also the enlightened yogi realises the Lord. The whole universe appears to Him as the manifestation of the Lord, which is the Ultimate Truth. When this yogi continues to exist in this stage, all his karma-s are burnt to ashes leaving no impressions whatsoever. This ultimate process enables him to merge with the Lord. The yogi till now appeared like Śiva, becomes Śiva Himself. That enlightened yogi does not exist any longer. It is like a river that confluents into a sea, not to be separated again.*

*Śiva Sūtra-s concluded.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹


Comments


bottom of page