🍀🌹 12 OCTOBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
🌹. విజయదశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami to All. 🌹
1) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 996 / Vishnu Sahasranama Contemplation - 996 🌹*
🌻 996. శార్ఙ్గధన్వా, शार्ङ्गधन्वा, Śārṅgadhanvā 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 567 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 567 - 2 🌹
🌻 567. 'భక్తనిధి’ - 2 / 567. 'Bhaktanidhi' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విజయదశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami to All. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం 🍀*
*నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |*
*నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్*
*రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |*
*జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః*
*🍀. శ్రీ విజయ దుర్గా స్తోత్రము 🍀*
*దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ*
*దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమ జ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా*
*🌷. విజయదశమి పండుగ విశిష్టత 🌷*
*దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయ బడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.*
*విజయదశమి పండుగ అపరాజిత పేరు మీద వస్తుంది. పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి, విజయదశమి అయింది. పాండవులు శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. విజయదశమి రోజు పరాజయం లేని అపరాజితాదేవిని .. శ్రీచక్ర అధిష్టాన దేవత... షోడశ మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ విజయదుర్గను ... శ్రీ రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అమ్మవారు పరమశాంత స్వరూపంతో, సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా, మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని, ఆది పరాశక్తి... రాజరాజేశ్వరి దేవిగా శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ, చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి, ఒక చేతితో అభయ ముద్రతో దర్శనమిస్తుంది. మణిద్వీప వర్ణనలో "శ్రీపురంలో చింతామణి "అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది. చెడుపై సాధించే విజయమే విజయదశమి. ముఖ్యంగా మన మనసులో ఉన్న చెడు ప్రవర్తన మార్చుకుని (చెడుపై సాధించిన విజయంగా..) విజయదేవిని, విజయదశమి రోజు పూజిస్తే సర్వ శుభాలూ కలుగుతాయి. ఈమె ఆది ప్రకృతి స్వరూపిణి. దుర్గాదేవి వివిధ కల్పాలలో, వివిధ రూపాలు ధరించి నానా దుష్టజనులని సహకరించి, లోకాలకి ఆనందం కలిగించింది. మహిమాన్విత అయిన శ్రీచక్ర అధిష్టాన దేవతయే... లలితా దేవతయే... శ్రీరాజరాజేశ్వరీ దేవి. ఈ తల్లి నివాసం "శ్రీమణిద్వీప -- శ్రీనగర స్థిత -- చింతామణి గృహం". ఈ తల్లి ఎక్కడ నివసిస్తుందో! అక్కడ అన్నీ శుభాలే!!!*
*🍀. దసరా సాధనాపర విశిష్టత 🍀*
*దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే ’’దశ హర‘’ అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా. పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకోవాలి.*
*🙏. చదువుకోవలసిన స్తోత్రాలు 🙏*
*రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం, కవచం, సహస్రనామ స్తోత్రం, శ్రీ విజయదుర్గా స్తోత్రం ఇత్యాదివి చదువుకోవాలి. లలితా సహస్రనామాల్లో "రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా" అనే శ్లోకం అత్యంత ఫలదాయకం. "ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః" అనే మంత్రం జపించుకోవచ్చు. రాజరాజేశ్వరి దేవి గాయత్రి మంత్రం "ఓం రాజరాజేశ్వరి రూపాయ విద్మహే! అంబికాయై ధీమ హి తన్నోమాతః ప్రచోదయాత్ "అనే మంత్రాన్ని జపించుకోవాలి.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 996 / Vishnu Sahasranama Contemplation - 996 🌹*
*🌻 996. శార్ఙ్గధన్వా, शार्ङ्गधन्वा, Śārṅgadhanvā 🌻*
*ఓం శర్ఙ్గధన్వనే నమః | ॐ शर्ङ्गधन्वने नमः | OM Śarṅgadhanvane namaḥ*
*ఇన్ద్రియాద్యహఙ్కారాత్మకం శార్ఙ్గం నామ* *ధనురస్యాస్తీతి శార్ఙ్గధన్వా ।*
*'ధనుషశ్చ' ఇతి అనఙ్గ సమాసాన్తః ॥*
*ఇంద్రియాద్యహంకార రూపమగు శార్ఙ్గ నామ ధనుస్సు ఈతనికి కలదు.*
*'ధనుషస్చ' అను పాణినీ సూత్రముచే సమాసాంత ప్రత్యయమురాగా 'అనఙ్' ప్రత్యయమురాగా: శార్ఙ్గ + ధనుష్ + అన్ = శార్ఙ్గ + ధను + అన్ = శార్ఙ్గధన్వన్ అగును.*
:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
భూతాదిమిన్ద్రియాదిం చ ద్విధాహఙ్కారమీశ్వరః ।
బిభర్తి శాఙ్ఖరూపేణ శార్ఙ్గ్రూపేణ చ స్థితమ్ ॥ 70 ॥
*భూతములయందు అహంకారమును పంచభూతాత్మకమైన శంఖముగను, ఇంద్రియాహంకారమైన శార్ఙ్గముగను ఈశ్వరుడు రెండు విభాగములుగ ఆధారమును కల్పించును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 996 🌹*
*🌻 996. Śārṅgadhanvā 🌻*
*OM Śarṅgadhanvane namaḥ*
इन्द्रियाद्यहङ्कारात्मकं शार्ङ्गं नाम धनुरस्यास्तीति शार्ङ्गधन्वा ।
'धनुषश्च' इति अनङ्ग समासान्तः ॥
*Indriyādyahaṅkārātmakaṃ śārṅgaṃ* *nāma dhanurasyāstīti śārṅgadhanvā,*
*'Dhanuṣaśca' iti anaṅga samāsāntaḥ.*
*He has the bow called Śārṅga of the form of the sense organs and the ahaṅkāra or ego.*
*The construct is as per the pāṇinī precept of grammar whereing for compound words with anaṅ suffix: śārṅga + dhanuṣ + an = śārṅga + dhanu + an = śārṅgadhanvan.*
:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
भूतादिमिन्द्रियादिं च द्विधाहङ्कारमीश्वरः ।
बिभर्ति शाङ्खरूपेण शार्ङ्ग्रूपेण च स्थितम् ॥ ७० ॥
Śrī Viṣṇu Mahā Purāṇa - Part I, Section 22
Bhūtādimindriyādiṃ ca dvidhāhaṅkāramīśvaraḥ,
Bibharti śāṅkharūpeṇa śārṅgrūpeṇa ca sthitam. 70.
*Īśvara the Lord supports ahaṅkāra or egotism in its twofold division, into elements and organs of sense, in the emblems of his conch-shell and his bow.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhrnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 567 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 567 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*
*🌻 567. 'భక్తనిధి’ - 2 🌻*
*కోరిన వారి కోరికలు వారి వృద్ధికి తోడ్పడునవి అగుచో వానిని పూరించుట, అట్లు కానిచో స్మృతి పథము నుండి తప్పించుట, లేక అట్లు కోరు విషయముల యందు వికర్షణ కలిగించుట చేయుచుండును. భక్తుల కోరికలు తీర్చు విషయమున శ్రీమాత నేర్పు అనుపమానము. భక్తుల వృద్ధిని దృష్టి యందుంచుకొని ఆమె వారిని పరితృప్తులను చేయుచుండును. ఆమె అనిర్వచనీయమైన నిధి వంటిది. అందుండి పొందలేని విషయము సృష్టిలో లేదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 567 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻*
*🌻 567. 'Bhaktanidhi' - 2 🌻*
*If the desires of the devotees are conducive to their growth, she fulfills them; if not, she diverts their minds away from them or causes a sense of detachment. Śrī Māta has unparalleled wisdom when it comes to fulfilling the desires of her devotees. Keeping their growth in mind, she ensures their satisfaction. She is an indescribable treasure, and there is nothing in the universe that cannot be obtained through her.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*_శ్రీ దేవి శరన్నవరాత్రులు 10వ రోజు 12/10/2024 ఇంద్రకీలాద్రిపై "శ్రీ రాజరాజేశ్వరీ దేవి" గా దర్శనం_*
🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒
*_శ్లో𝕝𝕝 అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ._*
*శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. "అపరాజితాదేవి" గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి.*
*_నైవేద్యం:_*
*ఈ రోజున నైవేద్యంగా కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నం సమర్పిస్తారు.*
*_శ్రీ రాజరాజేశ్వరీదేవ్యై నమః_*
🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comentarios