🍀🌹 12, SEPTEMBER 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
🌹 కపిల గీత - కపిల దేవహూతి సంవాదం - దేవహూతి కుమారుడు కపిల భగవానుని బోధనలు - పరిచయం 🌹
2) 🌹 Kapila Gita - Conversation between Kapila and Devahuti - Teachings of Lord Kapila, the Son of Devahuti - Introduction 🌹
3) 🌹 कपिल गीता - कपिल और देवहूति का संवाद - देवहूति के पुत्र कपिल भगवान की शिक्षाएँ - परिचय 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 581 / Bhagavad-Gita - 581 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 10 / Chapter 16 - The Divine and Demoniac Natures - 10 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 977 / Vishnu Sahasranama Contemplation - 978 🌹
🌻 978. యజ్ఞీ, यज्ञी, Yajñī 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 559 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 3 🌹
🌻 559. 'తాంబూలపూరిత ముఖీ' - 3 / 559. 'Tāmbūlapūrita Mukhi' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 కపిల గీత - కపిల దేవహూతి సంవాదం - దేవహూతి కుమారుడు కపిల భగవానుని బోధనలు - పరిచయం 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*కపిల మహర్షి, దేవహూతి కుమారుడిగా ప్రసిద్ధి పొందిన కపిల భగవానుడు, సాంఖ్య యోగం అనే తత్వాన్ని వివరించారు. ఈ తత్వం ఆత్మ, భగవంతుడు మరియు భౌతిక ప్రపంచం మధ్య ఉన్న సంబంధాన్ని బోధిస్తుంది. కపిల మహర్షి భౌతిక ప్రపంచం మాయలో జీవులు కర్మ బంధాలకు లోనవుతారని, భక్తి యోగం ద్వారా కర్మ బంధాల నుంచి విముక్తి పొందవచ్చని చెప్పారు. ఆయన నియమబద్ధ జీవనాన్ని, భక్తి యోగాన్ని పాటించడం ద్వారా పరమాత్మను సాక్షాత్కరించడమే ఆధ్యాత్మిక పరిణామం అని బోధించారు.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Kapila Gita - Conversation between Kapila and Devahuti - Teachings of Lord Kapila, the Son of Devahuti - Introduction 🌹*
*✍️ Prasad Bharadwaj*
*Kapila Muni, known as the son of Devahuti, explained the philosophy of Sankhya Yoga, which elucidates the relationship between the soul, God, and the material world. He taught that souls are bound by karma in the illusion of the material world, and liberation from these bonds is possible through devotion (bhakti yoga). Kapila Muni emphasized the importance of regulated life and devotion to attain spiritual progress and realization of the Supreme.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 कपिल गीता - कपिल और देवहूति का संवाद - देवहूति के पुत्र कपिल भगवान की शिक्षाएँ - परिचय 🌹*
*✍️ प्रसाद भारद्वाज*
*कपिल मुनि, जो देवहूति के पुत्र के रूप में जाने जाते हैं, ने सांख्य योग के दर्शन को समझाया, जो आत्मा, भगवान और भौतिक जगत के बीच संबंध की व्याख्या करता है। उन्होंने बताया कि जीव भौतिक दुनिया के भ्रम में कर्म बंधन से बंधे होते हैं, और भक्ति योग के माध्यम से इन बंधनों से मुक्ति संभव है। कपिल मुनि ने नियमित जीवन और भक्ति का पालन कर आध्यात्मिक उन्नति और परमात्मा के साक्षात्कार को महत्वपूर्ण बताया।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 581 / Bhagavad-Gita - 581 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 10 🌴*
*10. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితా: |*
*మోహాద్ గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తన్తేశుచివ్రతా: ||*
*🌷. తాత్పర్యం : పూరింప శక్యము కానటువంటి కామము నాశ్రయించి గర్వము మరియు మిథ్యాహంకారములను కూడినవారై భ్రాంతినొందినటువంటి ఆసురస్వభావులు ఆశాశ్వతములైనవాని యెడ ఆకర్షితులై సదా అపవిత్ర వ్రతులగుదురు.*
*🌷. భాష్యము : ఆసురస్వభావము గలవారి మనస్తత్వము ఇచ్చట వర్ణింపబడుచున్నది. వారి కామవాంఛకు తృప్తియన్నది ఉండదు. తృప్తినెరుగని విషయభోగానుభవ కోరికలను వారు సదా వృద్ధిచేసికొనుచుందురు. అశాశ్వతములైనవాటిని ఆంగీకరించుటచే కలుగు దుఃఖములందు పూర్తిగా మునిగియున్నను, మాయాకారణముగా వారు అట్టి కార్యములందే నిమగ్నులై యుందురు. జ్ఞానరహితములైన అట్టివారు తాము తప్పుమార్గమున చనుచున్నామని ఎరుగలేరు. అశాశ్వతవిషయముల నంగీకరించుచు అట్టి అసురస్వభావులు తమకు తామే ఒకే దేవుడని మరియు మంత్రములను సృష్టించుకొని జపకీర్తనములను గావింతురు.*
*తత్ఫలితముగా వారు మైథునభోగము మరియు ధనమును కూడబెట్టుట యనెడి విషయముల యెడ మిగుల ఆకర్షితులగుదురు. “అశుచివ్రతా:” యను పదము ఈ సందర్భమున అతి ముఖ్యమైనది. అనగా అసురస్వభావులు మగువ, మదిర, జూదము, మాంసభక్షణములకు సంపూర్ణముగా ఆకర్షితులై యుందురు. అవియే వారి అశుచియైన అలవాట్లు. గర్వము మరియు మిథ్యాహంకారములచే ప్రభావితులై అట్టివారు వేదములచే ఆమోదయోగ్యములు గాని కొన్ని ధర్మనియమములను సృష్టించుకొందురు. అట్టివారు వాస్తవమునకు ప్రపంచమునందు అత్యంత అధములైనను జనులు వారికి కృత్రిమముగా మిథ్యాగౌరవమును కల్పింతురు. అసురస్వభావులైన అట్టివారు నరకమునకు దిగజారుచున్నను తమను తాము పురోభివృద్ది నొందినవారుగా భావింతురు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 581 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 10 🌴*
*10. kāmam āśritya duṣpūraṁ dambha-māna-madānvitāḥ*
*mohād gṛhītvāsad-grāhān pravartante ’śuci-vratāḥ*
*🌷 Translation : Taking shelter of insatiable lust and absorbed in the conceit of pride and false prestige, the demoniac, thus illusioned, are always sworn to unclean work, attracted by the impermanent.*
*🌹 Purport : The demoniac mentality is described here. The demons have no satiation for their lust. They will go on increasing and increasing their insatiable desires for material enjoyment. Although they are always full of anxieties on account of accepting nonpermanent things, they still continue to engage in such activities out of illusion. They have no knowledge and cannot tell that they are heading the wrong way. Accepting nonpermanent things, such demoniac people create their own God, create their own hymns and chant accordingly. The result is that they become more and more attracted to two things – sex enjoyment and accumulation of material wealth.*
*The word aśuci-vratāḥ, “unclean vows,” is very significant in this connection. Such demoniac people are only attracted by wine, women, gambling and meat-eating; those are their aśuci, unclean habits. Induced by pride and false prestige, they create some principles of religion which are not approved by the Vedic injunctions. Although such demoniac people are most abominable in the world, by artificial means the world creates a false honor for them. Although they are gliding toward hell, they consider themselves very much advanced.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 978 / Vishnu Sahasranama Contemplation - 978 🌹*
*🌻 978. యజ్ఞీ, यज्ञी, Yajñī 🌻*
*ఓం యజ్ఞినే నమః | ॐ यज्ञिने नमः | OM Yajñine namaḥ*
*శ్రీ విష్ణురేవ యజ్ఞానాం తత్సమారాధనాత్మనామ్ ।*
*శేషీతి ఖలు యజ్ఞీతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥*
*యజ్ఞములు ఈతని సాత్తులుగానున్నవి. లెస్సయగు తన ఆరాధనమే రూపముగా కల యజ్ఞములకు పరమాత్ముడు శేషి. యజ్ఞమనబడు ఆరాధనకు శేషియైన పరమాత్ముడు యజ్ఞీ అనబడును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 978 🌹*
*🌻 978. Yajñī 🌻*
*OM Yajñine namaḥ*
*श्री विष्णुरेव यज्ञानां तत्समाराधनात्मनाम् ।*
*शेषीति खलु यज्ञीति प्रोच्यते विबुधोत्तमैः ॥*
*Śrī Viṣṇureva yajñānāṃ tatsamārādhanātmanām,*
*Śeṣīti khalu yajñīti procyate vibudhottamaiḥ.*
*Yajñas i.e., vedic sacrificial rituals are to please Him. He is the whole of which the yajñas are parts.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥
Yajñabhrdyajñakrdyajñī yajñabhugyajñasādhanaḥ,Yajñāntakrdyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 559 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*
*🌻 559. 'తాంబూలపూరిత ముఖీ' - 3 🌻*
*సామాన్య రతి నుండి శివానుభూతి వరకు కూడ తాంబూలమునకు ప్రాముఖ్యత గలదు. తాంబూలమునకు ప్రధానమగు వస్తువులు తమలపాకు, సున్నము, వక్క, యాలకులు, లవంగములు, పచ్చ కర్పూరము యిత్యాదులు. కొనుగోలు చేయు మిఠాయి కిళ్లీలు తాంబూలము కాజాలదు. తాంబూలమును ఆహార స్వీకరణమునకు తదుపరియే గైకొనవలెను గాని తోచినప్పుడెల్ల తినరాదు. అట్లు జేసినచో జీర్ణావయవముల యందు పుండ్లు పడు అవకాశ ముండును. తాంబూలము గూర్చి తర్కించుటకన్న శ్రీమాతకు ప్రియము గనుక తాంబూలము గైకొనుట భక్తులు చేయవలసిన పని.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 114. Tanbulapuritamukhi dadimikusumaprabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻*
*🌻 559. 'Tāmbūlapūrita Mukhi' - 3 🌻*
*From ordinary intimacy to spiritual union with Śiva, tāmbūla holds significance. The primary ingredients of tāmbūla include betel leaves, lime, areca nut, cardamom, cloves, and edible camphor. Commercially available sweet paan cannot be considered true tāmbūla. Tāmbūla should be consumed after meals but not frequently, as excessive use can lead to ulcers in the digestive system. Instead of debating about tāmbūla, devotees should offer it to Śrī Mātā as it is dear to her.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comments