top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 13, AUGUST 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 13, AUGUST 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀

1) 🌹. శ్రీమద్భగవద్గీత - 562 / Bhagavad-Gita - 562 🌹

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 11 / Chapter 15 - Purushothama Yoga - 11 🌴

2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 962 / Vishnu Sahasranama Contemplation - 962 🌹

🌻962. ప్రాణజీవనః, प्राणजीवनः, Prāṇajīvanaḥ🌻

3) 🌹 సిద్దేశ్వరయానం - 122 🌹

🏵 జలభైరవుడు 🏵

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 554 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 554 - 2 🌹

🌻 554. 'అచింత్యరూపా' - 2 / 554. 'Achintyarupa' - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 శివ సూత్రాలు - 1-3. యోని వర్గః కళా శరీరం 🌹*

*🍀 ఏకమూలంగా ఉన్న బహువిధ రూపాలే విశ్వం యొక్క సంపూర్ణ దేహం. 🍀*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*



*శివసూత్రాలలో మూడవ సూత్రం "యోని వర్గః కళా శరీరం" అనే సూత్రం, బ్రహ్మన్ అనే ఒకే మూలం నుండి ప్రారంభమయ్యే భిన్నమైన రూపాల సముదాయంతో మొత్తం విశ్వం రూపొందించ బడిందనే భావనను పరిశీలిస్తుంది. ఈ సూత్రం అన్ని రూపాల యొక్క ఏకత్వాన్ని ప్రాధాన్యం చేస్తుంది మరియు ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ఆధ్యాత్మిక సాధకులను బహువిధత్వపు మాయ నుండి బయటపడే మార్గంలో నడిపిస్తుంది. ఈ మాయ సృష్టించే భ్రమ మరియు మలం అనే మలినతలు బ్రహ్మం యొక్క ఆత్మ జ్ఞానాన్ని అడ్డుకుంటున్నాయి అని వివరిస్తుంది.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 Siva Sutras - 1-3. "Yoni vargaḥ kala Sariram," 🌹*

*🍀 The Whole Body of the universe is the multitude of forms originating from a single source 🍀*

*✍️ Prasad Bharadwaj*



*The third sutra of the Siva Sutras, "Yoni vargaḥ kala Sariram," explores the concept that the entire universe is composed of diverse forms originating from a single source, Brahman. This sutra emphasizes the unity behind all forms and guides spiritual seekers to move beyond the illusion of multiplicity towards the realization of oneness with the Supreme Consciousness. It highlights the role of Maya in creating this illusion and the impurities (Mala) that cause bondage, preventing the realization of Brahman.*

*Prasad Bhardwaj*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 शिव सूत्र - भाग 1 - सांभवोपाय - सूत्र 3. योनि वर्गः कला शरीरम् 🌹*

*🍀 एकमूल रूप से विद्यमान विविध रूप ही विश्व का संपूर्ण शरीर हैं। 🍀*

*✍️. प्रसाद भारद्वाज.*


*शिव सूत्रों के तीसरे सूत्र "योनि वर्गः कला शरीरम्" में इस अवधारणा का अन्वेषण किया गया है कि संपूर्ण ब्रह्माण्ड अनेक रूपों से मिलकर बना है, जिनका मूल एक ही स्रोत, ब्रह्म है। यह सूत्र सभी रूपों के पीछे छिपे एकत्व को महत्व देता है और साधकों को माया के बहुविध भ्रामक रूपों से ऊपर उठकर परम चेतना के साथ एकत्व की प्राप्ति के मार्ग पर अग्रसर करता है। इसमें माया के द्वारा उत्पन्न भ्रम और माला के रूप में अशुद्धियों का वर्णन किया गया है, जो ब्रह्म की प्राप्ति में बाधा उत्पन्न करती हैं।*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 562 / Bhagavad-Gita - 562 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 11 🌴*


*11. యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ |*

*యతన్తోప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతస: ||*


*🌷. తాత్పర్యం : ఆత్మానుభవమునందు స్థితిని పొందిన యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా గాంచ గలుగుదురు. కాని అచేతసులు మరియు ఆత్మానుభవము నందు స్థితిని పొందని వారు ప్రయత్నించినను ఏమి జరుగుచున్నదో గాంచలేరు.*


*🌷. భాష్యము : ఆత్మానుభవ మార్గమున పలువురు యోగులున్నను ఆత్మానుభవము నందు స్థితుడు కానివాడు దేహి యొక్క దేహము నందు మార్పులెట్లు కలుగుచున్నవో గాంచలేడు. కనుకనే ఈ విషయమున “యోగిన:” అను పదము మిక్కిలి ప్రాధాన్యమును సంతరించుకొన్నది. నేటికాలమున పలువురు నామమాత్ర యోగులు మరియు నామమాత్ర యోగసంఘములున్నను వాస్తవమునకు ఆత్మానుభవ విషయమున వారందరును అంధులై యున్నారు. వారు కేవలము ఏదియోనొక దేహ వ్యాయామమునకు అలవాటుపడి, దేహము దృఢముగా మరియు ఆరోగ్యముగా నున్నచో తృప్తినొందుచున్నారు.*


*దానికి అన్యమైన విషయము వారికి తెలియదు. అట్టివారే “యతన్తోప్యకృతాత్మాన:” యనబడుదురు. వారు అట్టి నామమాత్రయోగమును అభ్యసించినను ఆత్మవిదులు కాజాలరు. వారెన్నడును ఆత్మా యొక్క పునర్జన్మ విధానమును అవగతము చేసికొనజాలరు. వాస్తవముగా యోగమునందు నిలిచి ఆత్మ, జగత్తు, శ్రీకృష్ణభగవానుడు అనెడి అంశములను అవగాహన చేసికొనినవారే (అనగా కృష్ణభక్తిభావన యందు విశుద్ధ భక్తియోగమున నియుక్తులైన భక్తియోగులు) ఏది యెట్లు జరుగుచున్నదో అవగతము చేసికొనగలరు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 562 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 15 - Purushothama Yoga - 11 🌴*


*11. yatanto yoginaś cainaṁ paśyanty ātmany avasthitam*

*yatanto ’py akṛtātmāno nainaṁ paśyanty acetasaḥ*


*🌷 Translation : The endeavoring transcendentalists who are situated in self-realization can see all this clearly. But those whose minds are not developed and who are not situated in self-realization cannot see what is taking place, though they may try.*


*🌹 Purport : There are many transcendentalists on the path of spiritual self-realization, but one who is not situated in self-realization cannot see how things are changing in the body of the living entity. The word yoginaḥ is significant in this connection. In the present day there are many so-called yogīs, and there are many so-called associations of yogīs, but they are actually blind in the matter of self-realization. They are simply addicted to some sort of gymnastic exercise and are satisfied if the body is well built and healthy. They have no other information.*


*They are called yatanto ’py akṛtātmānaḥ. Even though they are endeavoring in a so-called yoga system, they are not self-realized. Such people cannot understand the process of the transmigration of the soul. Only those who are actually in the yoga system and have realized the self, the world and the Supreme Lord – in other words, the bhakti-yogīs, those engaged in pure devotional service in Kṛṣṇa consciousness – can understand how things are taking place.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 962 / Vishnu Sahasranama Contemplation - 962 🌹*


*🌻962. ప్రాణజీవనః, प्राणजीवनः, Prāṇajīvanaḥ🌻*


*ఓం ప్రాణజీవాయ నమః | ॐ प्राणजीवाय नमः | OM Prāṇajīvāya namaḥ*


*ప్రాణినో జీవయన్ ప్రాణనామభిః పవనైర్హరిః ।*

*ప్రాణజీవన ఇత్యుక్తో వేదాన్తార్థవిశారదైః ॥*


*ప్రాణములు అను పేరు కల ప్రాణ, అపానాది వాయువుల ద్వారమున ప్రాణులను జీవింపజేయుచున్నవాడు కనుక ఆ హరి ప్రాణజీవనః.*


:: కఠోపనిషత్ ద్వితీయాధ్యాయము, 2వ వల్లి ::

న ప్రాణేన నాఽపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవన్తి యస్మిన్నేతా వుపాశ్రితౌ ॥ 5 ॥


*మర్త్యుడు ఏ ఒక్కడును ప్రాణవాయువుచే గాని, అపానవాయువుచే గాని జీవించుటలేదు. ఏ తత్త్వమునందు ఈ రెండును సన్నిహితములై ఆశ్రయమును పొంది యున్నవో, అట్టి మరియొక (పరమాత్ముని) తత్త్వముచే మాత్రమే జీవించుచున్నాడు.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 962 🌹*


*🌻962. Prāṇajīvanaḥ🌻*


*OM Prāṇajīvāya namaḥ*


प्राणिनो जीवयन् प्राणनामभिः पवनैर्हरिः ।

प्राणजीवन इत्युक्तो वेदान्तार्थविशारदैः ॥


*Prāṇino jīvayan prāṇanāmabhiḥ pavanairhariḥ,*

*Prāṇajīvana ityukto vedāntārthaviśāradaiḥ.*


*By the prāṇas i.e., life forces, He makes the creatures live.*


:: कठोपनिषत् द्वितीयाध्याय, २ वल्लि ::

न प्राणेन नाऽपानेन मर्त्यो जीवति कश्चन इतरेण तु जीवन्ति यस्मिन्नेता वुपाश्रितौ ॥ ५ ॥


Kaṭhopaniṣat Chapter 2, Canto 2

Na prāṇena nā’pānena martyo jīvati kaścana itareṇa tu jīvanti yasminnetā vupāśritau. 5.


*Not by prāṇa, not by apāna does the mortal live; but the life forces are brought together by another one (Paramātma) upon which these two depend.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr‌t prāṇajīvanaḥ,Tattvaṃ tattvavidekātmā janmamr‌tyujarātigaḥ ॥ 103 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 సిద్దేశ్వరయానం - 122 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*


*🏵 జలభైరవుడు 🏵*


*హిమాలయాల నుండి కుర్తాళం*

*ఒకనాటి ప్రాతస్సంధ్యా సమయంలో సిద్ధేశ్వరానంద స్వామివారు కుర్తాళ జలపాతాలలో స్నానం చేయటానికి వెళ్ళారు. అందులోని నీళ్ళు వ్యాధి నివారకమైనవని ప్రసిద్ధి. వేల లక్షలమంది అక్కడ స్నానం చేయటానికి వస్తుంటారు. స్నాన ఘట్టాలు చాలా ఉన్నా ఊరికి దగ్గరగా ఉన్న చోట్ల ఎక్కువ జనం వస్తుంటారు. కొంచెం దూరంగా ప్రశాంతంగా ఉండే స్థలం దగ్గరకు పీఠ అధికారులు స్వామివారిని తీసుకెళ్ళారు. స్నానం పూర్తి అయిన తర్వాత వస్త్రాలు ధరించి సూర్యదేవుని వైపు చూస్తూ నమస్కారం చేశారు.*


*అలంకారప్రియోవిష్ణుః అభిషేకప్రియశ్శివః నమస్కారప్రియస్సూర్యః గణేశస్తర్పణప్రియః దీపప్రియః కార్తవీర్యః దత్తస్తు స్మరణప్రియః హోమప్రియో మహేంద్రస్తు జగన్మాతార్చనప్రియా||*

*చక్కగా తులసిదళాలతో అలంకరిస్తే నారాయణుడు సంతోషిస్తాడు. అభిషేకం చేస్తే పరమేశ్వరునకిష్టం. నమస్కారాలు చేస్తే సూర్యుడికిష్టం. అందుకే సూర్య నమస్కారాలంటారు. తర్పణములు చేస్తే వినాయకుడు సంతృప్తిచెంది వరాలిస్తాడు. దీపం వెలిగించి కార్తవీర్యార్జునా! అంటే ఆ యింటికి చోరాది ఉపద్రవములు లేకుండా చూసుకొంటాడా సహస్ర బాహువు. స్మరిస్తే చాలు దత్తా! అనగానే దత్తాత్రేయస్వామి దిగివస్తాడు. ఇంద్రుడు యజ్ఞములంటే ఇష్టపడతాడు. జగన్మాత పరమేశ్వరి పూలతో కుంకుమతో పూజిస్తే సంతోషించి వరాలిస్తుంది.*


*అందుకని స్వామివారు సూర్యునకు నమస్కరించారు. అలా ప్రణతులు, ప్రణుతులు అర్పిస్తున్నవారి నోటినుండి కమనీయ కవిత ప్రవహించింది.*

*గీ॥ ప్రకృతిదేవీ పరిష్వంగ పారవశ్య మధురకల్పాంత రతిరసోన్మత్తుడైన విశ్వపురుషుడు కన్నులు విచ్చువేళ విరియు తొలిసంజమము నడిపించుగాక!*


*వింటున్న భక్తులు సువర్ణ సుందరమైన కవిత్వాన్ని వినే అదృష్టం ఇవాళ మాకు లభించిందని పొంగిపోయినారు. అక్కడి భక్తుడొకడు “స్వామివారూ! మీరు క్రిందటి జన్మలో యోగులయితే ఈ జన్మలో యోగీశ్వరులు” అని నమస్కరించాడు. స్వామివారు చిరునవ్వుతో “సరి! దానికేమి! ఆశ్రమానికి పోదాం పదండి" అని కదిలారు.*

*పీఠానికి వెళ్ళిన తరువాత కాసేపటికి మౌనస్వామి సమాధి దగ్గరకు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు. మనోభూమికలో ఒక దృశ్యం కన్పిస్తున్నది. మౌనస్వామి, వారి గురువుగారు అచ్యుతానందసరస్వతీ స్వామి, చౌరంగీనాధ్ జలపాతాలపైన ఆకాశంలో కనిపిస్తున్నారు. అచ్యుతానందస్వామి ఇలా పలికారు. "సిద్ధేశ్వరా! ఈ జలపాతం భైరవస్వరూపం. ఇన్నాళ్ళు నీవు భైరవుని జప ధ్యానములలో కాళీవల్లభునిగా, కాశీ క్షేత్ర పాలకునిగా, హోమములో అగ్నిస్వరూపునిగా భావిస్తున్నావు. ఇకమీద జలభైరవునిగా కూడా అర్చించు. ఈ జలరూపుడైన మహాభైరవుడు సర్వప్రయోగములను, ఉపద్రవములను తొలగించి రక్షిస్తాడు. దీని మంత్ర తంత్ర విధానాలు నీకు తెలియజేయ బడుతున్నవి. మౌనస్వామి, చౌరంగీనాధుడు ఆశీర్వదించారు. వారదృశ్యులైనారు.*


*(చౌరంగీనాధ్ సారంగనాధుడు. తెలుగు భాషలో ఇతనిని గూర్చిన కథ నాటకంగా వచ్చింది. రాజమహేంద్రపురపాలకుడైన రాజరాజ నరేంద్రునకు రత్నాంగి, చిత్రాంగి భార్యలు. పెద్ద భార్య రత్నాంగి కుమారుడు సారంగధరుడు. చిన్న భార్య చిత్రాంగి యువకుడైన సారంగధరుని తన కామవాంఛ తీర్చమని కోరింది. ధర్మవిరుద్ధమని అతడు తిరస్కరించాడు. చిత్రాంగి మహారాజుతో సారంగధరుడు తనను బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది. ఆ రాజు నమ్మి తన కుమారుని కాళ్ళు చేతులు నరికించాడు. వధ్యశాలలో జరిగిన ఈ దృశ్యాన్ని ఆకాశంలో వెళుతున్న మత్స్యేంద్రనాధుడనే సిద్ధుడు చూచి సారంగధరుని రక్షించి తనతో తీసుకొనివెళ్ళి సిద్ధుని చేశాడు. అయితే ఈ కథను చరిత్ర పరిశోధకులు కొట్టిపారేశారు. రాజరాజ నరేంద్రునకు రత్నాంగి, చిత్రాంగి అనే భార్యలుకాని సారంగధరుడనే కుమారుడుగాని లేరు. ఈ కథ తెలుగు దేశపు కథ కాదు. మహారాష్ట్రలో ఈ కథ జరిగింది. ఆ సారంగధరుడే చౌరంగీ నాధుడు. సిద్ధమార్గంలో నాధ సంప్రదాయం ప్రసిద్ధమైనది. మత్స్యేంద్రనాథ్ కథ సినిమాగా కూడా వచ్చింది. స్వామివారు యాత్రలకు వెళ్ళినప్పుడు ఉజ్జయినిలో మత్స్యేంద్రనాధునిదని చెప్పబడే సమాధిని, గోరఖ్నాధుని గుహను చూచారు. ఉజ్జయినిలో మహకాళి ఉన్నది. గోరఖ్నాధుడు చేసిన కాళీమంత్రం వేగనిద్ధిదాయకమైనది. కుర్తాళవీరానికి అచ్యుతానందసరస్వతీస్వామి నుండి సాధనలో నాధసంప్రదాయం ప్రవేశించింది)*


*ఈ మధ్య గడ్డాలు జడలు పెరిగిన ఒక యువకుడు వచ్చి అలఖ్ నిరంజన్ అంటూ పాదనమస్కారం చేశాడు. ఎవరు నీవు అంటే అతడు "స్వామివారు! నేను కాలేజీలో మీ దగ్గర చదువుకొన్నాను. ఉత్తరాదికి వెళ్ళి నాధయోగులలో చేరాను. ఇటీవల ఒక పెద్దాయన నీవు చదువుకొనేప్పుడు నీకు పాఠాలు చెప్పిన గురువుగారు ఇప్పుడు గొప్ప పీఠాథిపతి. సిద్ధపురుషుడు. వారిదగ్గరకు వెళ్ళి మంత్రోపదేశం పొందిరా! అని పంపించాడు. నన్ను ఆనుగ్రహించండి" అని ప్రార్ధించాడు. స్వామివారా యువకునిపై దయ చూపించారు. కొన్నాళ్ళు గుంటూరు కాళీ పీఠంలో ఉండి సేవచేసిన అతనిని పూర్వ మిత్రులు పలకరించి అతడు తిరుగుతున్న కొండలలో గుహలలో ఉండే విశేషాలను ఆసక్తితో తెలుసుకొన్నారు.*

*( సశేషం )*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 554 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 554 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*

*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*


*🌻 554. 'అచింత్యరూపా' - 2 🌻*


*సముద్రమున పుట్టిన బిందువు సముద్రమును అవగాహన చేసుకొనగలదా? లీనము కాగలదు. తన్మయత్వమును పొందగలదు. జీవుని పరిస్థితి కూడ నదియే. ఆరాధన మార్గమున శ్రీమాత యను విశ్వ చైతన్యమునందు లీనమగుటయే యుండును గాని పూర్ణమగు అవగాహన ఎవ్వరికినీ కలుగదు. త్రిమూర్తులు సహితము శ్రీమాతను అవగాహన చేసుకొనలేదు. వారు కూడ ఆమె అంశావతారములే. అంశము మొత్తమును ఎరుగలేదు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 554 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*

*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*


*🌻 554. 'Achintyarupa' - 2 🌻*


*Can a dot born in the ocean understand the ocean? Can be absorbed. Can attain selfhood. The condition of the living being is also the same. Through worship one can immerse oneself in the universal consciousness of Sri Mata, but no one can attain complete discernment. Even Trinity did not understand Srimata. They are also her partial-incarnations. A part cannot know the whole.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹


Comments


bottom of page