top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 14, AUGUST 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 14, AUGUST 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀

1) 🌹 ముక్తిని సాధించాలనే కాంక్ష ఉంటే విషయ భోగాలను విషతుల్యంగా భావించి త్యజించు - అష్టావక్ర గీత 2వ శ్లోకము 🌹

2) 🌹 If you desire liberation, then renounce sense objects as if they were poison. AshtaVakra Gita 1 - Verse 2 🌹

3) 🌹यदि तुम मोक्ष की कामना करते हो, तो विषय भोगों को विष के समान त्याग दो। 🌹

4) 🌹. శ్రీమద్భగవద్గీత - 563 / Bhagavad-Gita - 563 🌹

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 12 / Chapter 15 - Purushothama Yoga - 12 🌴

5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 963 / Vishnu Sahasranama Contemplation - 963 🌹

🌻 963. తత్త్వం, तत्त्वं, Tattvaṃ 🌻

6) 🌹 సిద్దేశ్వరయానం - 123 🌹

🏵 శ్రీశైల గుహ -శిష్యానుభూతి 🏵

7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 1 🌹

🌻 555. 'కలికల్మష నాశినీ'- 1 / 555. 'Kalikalmasha Nasini' - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 ముక్తిని సాధించాలనే కాంక్ష ఉంటే విషయ భోగాలను విషతుల్యంగా భావించి త్యజించు - అష్టావక్ర గీత 2వ శ్లోకము 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*


*"అష్టావక్ర గీత" - 1వ అధ్యాయం, 2వ భాగము, విముక్తి, మోక్ష సాధనలో నైతిక విలువలు, ప్రశాంత మనస్సు ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. అష్టావక్ర మహర్షి, విషయ భోగాలను విషతుల్యంగా భావించి త్యజించమని, క్షమ, దయ, ఋజు వర్తనం, సంతృప్తి వంటి గుణాలను అమృతంలా ఆచరించమని ఉపదేశిస్తాడు. ఆత్మ సాధన కోసం ప్రశాంత మనస్సు, వివేకబుద్ధి ఎంత అవసరమో, ఈ ప్రయాణంలో ఇవి ఎంత ముఖ్యమైనవో ఈ వీడియోలో తెలుసుకుందాం.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 If you desire liberation, then renounce sense objects as if they were poison. AshtaVakra Gita 1 - Verse 2 🌹*

*Prasad Bharadwaj*


*This passage from the "Ashtavakra Gita" (Chapter 1, Part 2) emphasizes the importance of moral values and a peaceful mind in the pursuit of liberation (Mukti). Ashtavakra advises renouncing worldly pleasures, akin to poison, and embracing virtues like forgiveness, compassion, humility, and contentment, viewing them as nectar. In this video, let us find the significance of maintaining a serene mind and discerning intellect for spiritual progress.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹यदि तुम मोक्ष की कामना करते हो, तो विषय भोगों को विष के समान त्याग दो। 🌹*

*प्रसाद भारद्वाज*


*"अष्टावक्र गीता" - प्रथम अध्याय, द्वितीय भाग, मोक्ष साधना में नैतिक मूल्यों और शांत मन की महत्ता को स्पष्ट करती है। अष्टावक्र महर्षि, विषय भोगों को विषतुल्य मानकर त्यागने और क्षमा, दया, ऋजु व्यवहार, संतोष जैसे गुणों को अमृत समान आचरण करने का उपदेश देते हैं। आत्म साधना के लिए शांत मन और विवेक बुद्धि की आवश्यकता और इस यात्रा में उनकी महत्ता को इस वीडियो में जानें।*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 563 / Bhagavad-Gita - 563 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 12 🌴*


*12. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలమ్ |*

*యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||*


*🌷. తాత్పర్యం : సమస్తజగమునందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్నితేజము కూడా నా నుండియే కలుగుచున్నదవి.*


*🌷. భాష్యము : ఏది ఏవిధముగా జరుగుచున్నదో మందబుద్దులైనవారు ఎరుగజాలరు. కాని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివరించు విషయమును అవగాహన చేసికొనుట ద్వారా మనుజుడు క్రమముగా జ్ఞానమునందు స్థితుడు కాగలడు. ప్రతియొక్కరు సూర్యుడు, చంద్రుడు,అగ్ని, విద్యుత్తులను గాంచుచునే యుందురు. అట్టి సూర్యుడు,చంద్రుడు, అగ్ని, విద్యుత్తుల యందలి తేజము దేవదేవుని నుండియే కలుగుచున్నదని వారు అవగతము చేసికొనుటకు యత్నించిన చాలును.*


*కృష్ణభక్తిరసభావనమునకు ఆరంభమువంటి అట్టి భావనము బద్ధజీవునకు భౌతికజగమునందు గొప్ప పురోగతిని కలిగించగలదు. వాస్తవమునకు జీవులు దేవదేవుడైన శ్రీకృష్ణుని నిత్యాంశలు. వారు ఏ విధముగా తిరిగి తనను చేరగలరనెడి విషయమున ఆ భగవానుడు ఇచ్చట కొన్ని సూచనల నొసగుచున్నాడు. గ్రహమండల మంతటిని సూర్యుడు ప్రకాశింపజేయుచున్నాడని ఈ శ్లోకము ద్వారా మనము అవగతము చేసికొనవచ్చును. వాస్తవమునకు విశ్వములు మరియు గ్రహమండలముల పెక్కు గలవు. అదేవిధముగా సూర్యులు,చంద్రులు, గ్రహములు కూడా పలుగలవు. కాని ఒక విశ్వమునందు మాత్రము ఒకే సూర్యుడుండును. భగవద్గీత (10.21) యందు తెలుపబడినట్లు చంద్రుడు నక్షత్రములలో ఒకడై యున్నాడు (నక్షత్రాణాం అహం శశీ). ఆధ్యాత్మికజగము నందలి భగవానుని ఆధ్యాత్మిక తేజమే సూర్యకాంతికి కారణమై యున్నది.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 563 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 15 - Purushothama Yoga - 12 🌴*


*12. yad āditya-gataṁ tejo jagad bhāsayate ’khilam*

*yac candramasi yac cāgnau tat tejo viddhi māmakam*


*🌷 Translation : The splendor of the sun, which dissipates the darkness of this whole world, comes from Me. And the splendor of the moon and the splendor of fire are also from Me.*


*🌹 Purport : The unintelligent cannot understand how things are taking place. But one can begin to be established in knowledge by understanding what the Lord explains here. Everyone sees the sun, moon, fire and electricity. One should simply try to understand that the splendor of the sun, the splendor of the moon, and the splendor of electricity or fire are coming from the Supreme Personality of Godhead. In such a conception of life, the beginning of Kṛṣṇa consciousness, lies a great deal of advancement for the conditioned soul in this material world. The living entities are essentially the parts and parcels of the Supreme Lord, and He is giving herewith the hint how they can come back to Godhead, back to home.*


*From this verse we can understand that the sun is illuminating the whole solar system. There are different universes and solar systems, and there are different suns, moons and planets also, but in each universe there is only one sun. As stated in Bhagavad-gītā (10.21), the moon is one of the stars (nakṣatrāṇām ahaṁ śaśī). Sunlight is due to the spiritual effulgence in the spiritual sky of the Supreme Lord. With the rise of the sun, the activities of human beings are set up. They set fire to prepare their foodstuff, they set fire to start the factories, etc. So many things are done with the help of fire. Therefore sunrise, fire and moonlight are so pleasing to the living entities. Without their help no living entity can live. So if one can understand that the light and splendor of the sun, moon and fire are emanating from the Supreme Personality of Godhead, Kṛṣṇa, then one’s Kṛṣṇa consciousness will begin. By the moonshine, all the vegetables are nourished. The moonshine is so pleasing that people can easily understand that they are living by the mercy of the Supreme Personality of Godhead, Kṛṣṇa. Without His mercy there cannot be sun, without His mercy there cannot be moon, and without His mercy there cannot be fire, and without the help of sun, moon and fire, no one can live. These are some thoughts to provoke Kṛṣṇa consciousness in the conditioned soul.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 963 / Vishnu Sahasranama Contemplation - 963 🌹*


*🌻 963. తత్త్వం, तत्त्वं, Tattvaṃ 🌻*


*ఓం తత్త్వాయ నమః | ॐ तत्त्वाय नमः | OM Tattvāya namaḥ*


*పరమార్థతస్సతత్త్వం సత్యం తథ్యం తథామృతమ్ ।*

*పరమార్థసతస్తస్య బ్రహ్మణో వాచకా ఇమే ॥*


*తథ్యం, అమృతం, సత్యం, పరమార్థసతత్త్వం అను ఇట్టి అన్ని పదములును ఏకార్థవాచకములు అనగా ఒకే అర్థమును కలిగి, దేశకాల వస్తు పరిచ్ఛేదము లేకుండ ఉనికిని పొందియుండు బ్రహ్మ తత్త్వమును తెలుపు పదములు.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 963🌹*


*🌻963. Tattvaṃ🌻*


*OM Tattvāya namaḥ*


परमार्थतस्सतत्त्वं सत्यं तथ्यं तथामृतम् ।

परमार्थसतस्तस्य ब्रह्मणो वाचका इमे ॥


*Paramārthatassatattvaṃ satyaṃ tathyaṃ tathāmr‌tam,*

*Paramārthasatastasya brahmaṇo vācakā ime.*


*The words tathyaṃ, amr‌taṃ, satyaṃ and paramārthasatattvaṃ - all are synonymous that imply the transcendental phenomenon which cannot be divided into/by time, territory and material i.e., Brahman.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr‌t prāṇajīvanaḥ,Tattvaṃ tattvavidekātmā janmamr‌tyujarātigaḥ ॥ 103 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 సిద్దేశ్వరయానం - 123 🌹*

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


*🏵 శ్రీశైల గుహ -శిష్యానుభూతి 🏵*


*స్వామివారు కొన్ని వందల సంవత్సరాల క్రింద శ్రీశైలంలో తపస్సుచేశారు. వారి ధ్యానగుహ అరణ్యంలో చాలా దూర ప్రదేశంలో ఉంది. ఒకసారి భక్తులతో మాట్లాడుతూ ప్రసంగ వశాన అది ఎక్కడ ఉన్నదో అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పారు. ఆ విషయం తెలుసుకొన్న ఒక భక్తురాలు - తీవ్ర సాధకురాలు. ఆ గుహకు వెళ్ళి తానుకూడా ధ్యానం చేయాలని సంకల్పించింది. ప్రొద్దుననే లేచి అల్పాహారం తీసుకొని మధ్యాహ్నమునకు కావలసినది పొట్లం కట్టుకొని ఒక సీసా మంచినీళ్ళు తీసుకొని బయలుదేరింది. ఆ కొండమీద అడవిలో వెదుకుతూ సరిగా దోవలేని చోట ఏకాంతంగా ఒక్కతే వెళ్ళటం చాలా సాహసం. సుమారు ముప్ఫై అయిదు సంవత్సరాల వయస్సు. బయలుదేరిన మొదట అక్కడక్కడ మనుషులు కనిపించారు. తరువాత లోపలకు పోయినకొద్దీ నిర్మానుష్య ప్రదేశాలు. మధ్యాహ్నానికి కష్టం మీద ఆ గుహకు చేరుకొంది ఆమె. దానికి కొద్ది దూరంలో ఒక కొలను ఉంది. ఆకలిగా ఉంది, ఆహారం తీసుకుందామని అక్కడికి వెళ్ళి కాళ్ళు, చేతులు, మొహమూ చన్నీళ్ళతో కడుక్కొని ఒక చెట్టుక్రింద కూర్చొని పొట్లం విప్పింది. ఉన్నట్లుండి చెట్లమీద ఉన్న కోతులు దూకి వచ్చి ఆ ఆహారం పొట్లం లాక్కుపోయినవి. వాటి దాడికి భయభ్రాంతురాలైంది. నోట మాటరాలేదు. ఏడుపు వచ్చింది. అయినా ధైర్యం తెచ్చుకొని గుహలోకి వెళ్ళింది. లోపల ఒక పెద్ద పీట, ఒక యోగదండము, కమండలము ఇంకా కొన్ని పాత వస్తువులు కనిపించినవి. గురువుగారు ఒకప్పుడు తపస్సు చేసినచోటు ఇదన్నమాట!*


*కష్టపడి వచ్చినందుకు ఫలితం లభించింది అన్న సంతృప్తి కలిగింది. కొంతసేపు ధ్యానం చేసి చీకటి పడకముందే వసతికి చేరుకోవచ్చులే అని ఆమె మంత్ర జపం మొదలుపెట్టింది. ఒకవైపు పెద్ద బండను ఆనుకొని కండ్లుమూసుకొన్న ఆమె అలసటవల్ల నిద్రలోకి వెళ్ళిందో లేక భావసమాధిలోకి వెళ్ళిందో కండ్లు తెరిచేసరికి సాయంకాల మవుతున్నది. వెలుతురుండగా శ్రీశైలగ్రామంలోకి ప్రవేశించగలనా అని అనుమానం కలిగింది. అయినా ధైర్యం తెచ్చుకొని నడవటం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద పాములు అడ్డంగా వెళుతున్నవి. ఒకటి రెండు పడగవిప్పి చూస్తున్నవి. నడుస్తున్నది. నలుగురు నడిచే దోవ కాక పోవటంవల్ల వచ్చిన దోవ కనుక్కోలేకపోయింది. దారి తప్పింది. ఎటుపోవాలో తెలియదు. ఎటు పోతున్నదో తెలియదు. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నవి. ఎంత దూరం నడిచినా గమ్యం ఎలాచేరుకోవాలో తెలియలేదు. భయం ఎక్కువైంది. ఏడుపువస్తున్నది. చెట్లమధ్య గాడాంధకారం అలముకొన్నది. గురువుగారికి చెపితే అనుమతించరని చెప్పకుండా వచ్చినందుకు తగిన శాస్తి జరిగిందని తనకు తాను నిందించుకొంది.

తప్పు చేశాను స్వామీ! కాపాడు - ఆర్తురాలిని - దీనురాలిని - దిక్కులేని దానిలాగ ఇక్కడ చావకుండా రక్షించు అని ప్రార్ధించటం మొదలు పెట్టింది.*


*"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప యితః పరంబెరుగ మన్నింప దగున్" ప్రేమతో రావో సద్గురు యోగి రాజ! కరుణన్ రక్షింపు సిద్ధేశ్వరా!*


*ఎంత వేడుకొన్నా ఎవరూ ఆదుకోటానికి రాలేదు. "స్వామికి నా పిలుపు వినిపించిందో లేదో! లేక విన్నా రక్షించాలని కరుణ కలుగ లేదో!" ఆమెకు దః ఖం పొరలుకొని వస్తున్నది. అశ్రువులు రాలుతున్నవి. ఆవేదన పొంగుతున్నది. ఇంతలో ఎవరో చెయ్యిపట్టుకొని నడిపిస్తున్నట్లు అనిపించింది. ఇంతకు ముందులాగా శ్రమలేదు. గాలిలో తేలిపోతున్నట్లున్నది. సిద్ధగురు కరస్పర్శ తెలుస్తున్నది.*

*శరణం భవశరణం భవ కరుణామృత సింధో గురు శేఖర సిద్ధేశ్వర చరణాశ్రిత బంధో!*

*ఉదయం నాలుగు గంటలు పట్టిన ప్రయాణం పదిహేను నిమిషాలకంటే పట్టలేదు. ఊరికి దగ్గరపడిన తరువాత అక్కడక్కడ త్రోవలో మనుషులు కనిపించారు. తనను వాళ్ళెవరూ పలకరించలేదు. తను వాళ్ళకు కనిపిస్తున్నానా అని అనుమానం కలిగింది. తను ఉన్న ఆశ్రమ ద్వారాలు మూయకముందే చేరుకొంది. దయామయుడైన గురుదేవుని కరుణ అప్పటికి అర్థమైంది. ఆ రోజు రాత్రి స్వప్నంలో దీర్ఘాన్నత దేహంతో బంగారురంగుతో నల్లని గడ్డంతో స్వామి పూర్వరూపం దర్శనమిచ్చింది. ఎన్నో వందల సంవత్సరాల క్రిందనించి ఉన్న దివ్య శరీరమది. ఆ గుహలో తపస్సు చేసినప్పుడున్న ఆకారమది. తను చేసిన సాహసం నిష్ఫలం కాలేదు. ఈనాడు నిత్యప్రసన్నుడు పరమ ప్రశాంతుడు అయిన గురుదేవులు వృద్ధునిగా కనిపిస్తున్నా ఆ స్వామి అసలు శరీరము సువర్ణ సుందర ఋషిమూర్తి. ఆ మహాపురుషున కాయోగిని అంజలి ఘటించింది.*

త్వమేవ మాతాచ పితాత్వమేవ

త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ

త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ

త్వమేవ సర్వం మమదేవ దేవ!

*స్వామివారు అభయమిచ్చి ఆశీర్వదించారు.*

*( సశేషం )*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 555 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 555 - 1 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*

*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*


*🌻 555. 'కలికల్మష నాశినీ'- 1 🌻*


*కలి కల్మషమును నాశనము చేయునది శ్రీమాత అని అర్థము. కల్మష మనగా మలినము, పాపము, అజ్ఞానము, అహంకారము ఇత్యాదివి. సృష్టి ఒక మహత్తరమగు అగ్నికార్యము. కనుక అందు మలినము లేర్పడుచుండును. మలినములు తొలగించుకొననిచో క్రమముగ అజ్ఞాన మేర్పడును. అజ్ఞానము జ్ఞానమును ఎప్పటికప్పుడు ఆవరించు చుండును. ఆవరించు అజ్ఞాన మలినమును జ్ఞానముతో పరిహరింపవలెను. అజ్ఞాన మావరించినపుడు అహంకారము బలపడును. తాను, యితరులు అను భావము కలుగును. దాని నుండి భేదబుద్ధి పుట్టును. స్వార్థము కలుగును. దీనిని అనునిత్యము నిర్మూలించు కొనవలెను.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 555 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*

*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*


*🌻 555. 'Kalikalmasha Nasini' - 1 🌻*


*Srimata destroys the impurities of Kali. Impurity is impurity, sin, ignorance, pride etc. Creation is a great work of fire. So impurities form within it. If impurities are not removed, ignorance will gradually arise. Ignorance keeps covering knowledge. The impurities of ignorance should be removed with knowledge. Ego becomes stronger when ignorance covers one. There is a sense of self and others. From that arises discrimination. Then comes selfishness. It should be eradicated continuously.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹


Comments


bottom of page