🍀🌹 17 SEPTEMBER 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀
1) 🌹 శివ సూత్రాలు - 1వ భాగం - సంభవోపాయ - 10వ సూత్రం: అవివేకో మాయా సుషుప్తమ్ - గాఢనిద్ర అంటే మాయ, ఇది అజ్ఞాన స్థితి. 🌹
2) 🌹 Siva Sutras - Part 1 - Sambhavopaya - 10th Sutra : Aviveko Maya Susuptam - Deep Sleep is Maya, The State of Ignorance. 🌹
3) 🌹 शिव सूत्र - भाग 1 - संभवोपाय - 10वां सूत्र: अविवेको माया सुषुप्तम - माया गहरी नींद है, जो अज्ञान की अवस्था होती है। 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 584 / Bhagavad-Gita - 584 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 13 / Chapter 16 - The Divine and Demoniac Natures - 13 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 981 / Vishnu Sahasranama Contemplation - 981 🌹
🌻 981. యజ్ఞాన్తకృత్, यज्ञान्तकृत्, Yajñāntakrt 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 561 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 561 - 1 🌹
🌻 561. 'మృగాక్షీ' - 1 / 561. 'Mrugashi' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శివ సూత్రాలు - 1వ భాగం - సంభవోపాయ - 10వ సూత్రం: అవివేకో మాయా సుషుప్తమ్ - గాఢనిద్ర అంటే మాయ, ఇది అజ్ఞాన స్థితి. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*శివ సూత్రాలలో 10వ సూత్రం - అవివేకో మాయా సుషుప్తమ్ - అజ్ఞానం లేదా అవివేకాన్ని మాయా ప్రభావంలో ఉన్న గాఢ నిద్ర సుషుప్తితో పోలుస్తుంది. గాఢ నిద్ర మన అవగాహనను ఎలా దూరం చేస్తుందో, అలాగే మాయ మన సత్య స్వరూపాన్ని, శివ తత్త్వాన్ని కప్పి వేయడం వలన మన అవగాహన అవివేకంలో, అజ్ఞానంలో చిక్కుకుపోతుంది. కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ స్థితులను అధిగమించి, సాధారణ చైతన్యాన్ని దాటి ఉన్నత స్థితులను అనుభవించి, చివరకు శివ చైతన్యంలో లీనమవచ్చు. ఈ సూత్రం ప్రతి వ్యక్తిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని గుర్తుచేస్తుంది, మాయా మోహాలను దాటి ముక్తి పొందడానికి ప్రేరణను ఇస్తుంది.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Siva Sutras - Part 1 - Sambhavopaya - 10th Sutra : Aviveko Maya Susuptam - Deep Sleep is Maya, The State of Ignorance. 🌹*
*Prasad Bharadwaj*
*The 10th Sutra of the Siva Sutras—Aviveko Maya Susuptam—explains that ignorance, or lack of discernment (aviveka), is like a deep sleep (susupti), controlled by the illusion of Maya. Just as deep sleep obscures awareness, ignorance veils our true nature as Shiva, keeping us trapped in illusion. However, through spiritual practice and self-realization, one can transcend these states, moving beyond ordinary consciousness to experience higher realities and ultimately merge with the infinite consciousness of Shiva. This sutra thus serves as a profound reminder of the spiritual potential within every individual, urging us to rise above the illusions of the material world and attain liberation.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 शिव सूत्र - भाग 1 - संभवोपाय - 10वां सूत्र: अविवेको माया सुषुप्तम - माया गहरी नींद है, जो अज्ञान की अवस्था होती है। 🌹*
*प्रसाद भारद्वाज*
*शिव सूत्रों के 10वें सूत्र—अविवेको माया सुषुप्तम्—में बताया गया है कि अज्ञान या विवेक की कमी (अविवेक) गहरी नींद (सुषुप्ति) के समान होती है, जो माया के भ्रम के अधीन होती है। जिस प्रकार गहरी नींद जागरूकता को ढक देती है, उसी प्रकार अज्ञान हमारी वास्तविक प्रकृति, जो शिव है, को छिपा देता है और हमें भ्रम में फंसा रखता है। लेकिन आत्म-साक्षात्कार और आध्यात्मिक साधना के माध्यम से, व्यक्ति इन अवस्थाओं को पार कर सकता है, सामान्य चेतना से परे जाकर उच्च वास्तविकताओं का अनुभव कर सकता है और अंततः शिव की अनंत चेतना में विलीन हो सकता है। यह सूत्र हर व्यक्ति के भीतर मौजूद आध्यात्मिक क्षमता की एक गहरी याद दिलाता है, जो हमें भौतिक संसार के भ्रमों से ऊपर उठकर मुक्ति प्राप्त करने के लिए प्रेरित करता है।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 584 / Bhagavad-Gita - 584 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 13 🌴*
*13. ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్ |*
*ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ||*
*🌷. తాత్పర్యం : ఆసురీస్వభావుడగు మనుజుడు ఇట్లు తలచును : “ఈనాడు నా వద్ద ఇంత ధనమున్నది. నా ప్రణాళికలచే నేను మరింత ధనమును పొందుదురు. ఇదియంతయు నాది. భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధినొందగలదు.*
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 584 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 13 🌴*
*13. idam adya mayā labdham imaṁ prāpsye manoratham*
*idam astīdam api me bhaviṣyati punar dhanam*
*🌷 Translation : The demoniac person thinks: “So much wealth do I have today, and I will gain more according to my schemes. So much is mine now, and it will increase in the future, more and more.*
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 981 / Vishnu Sahasranama Contemplation - 981 🌹*
*🌻 981. యజ్ఞాన్తకృత్, यज्ञान्तकृत्, Yajñāntakrt 🌻*
*ఓం యజ్ఞాన్తకృతే నమః | ॐ यज्ञान्तकृते नमः | OM Yajñāntakrte namaḥ*
యజ్ఞస్యాన్తం ఫలప్రాప్తం కుర్వన్ యజ్ఞాన్తకృద్ధరిః ।
వైష్ణవర్క్ఛ్య ఫలప్రాప్తిం కుర్వన్ యజ్ఞాన్తకృద్ధరిః ॥
యజ్ఞం కృత్వా స యజ్ఞ సమాప్తిం విష్ణుః కరోతి సః ।
వేతి యజ్ఞాన్తకృద్విష్ణుః ప్రోచ్యతే విబుధోత్తమైః ॥
*యజ్ఞమును యథావిధిగా అంతము అనగా పరిసమాప్తమునొందినచో, దానివలన కలుగునది ఫలమే కావున, యజ్ఞాంతము అనగా యజ్ఞ ఫలము అని ఇట శ్రీ భాష్యకారులచే అర్థము చెప్పబడినది. కనుక యజ్ఞమునకు సంబంధించిన అంతమును అనగా ఫలప్రాప్తిని కలిగించువాడు శ్రీ విష్ణువు. యజ్ఞములనాచరించుటచే కలుగు ఫలమును యజమానునకు ప్రాప్తమగునట్లు చేయు యజ్ఞఫలదాత శ్రీ విష్ణువే!*
*లేదా వైష్ణవ ఋక్ సంశమనము అనగా ఉచ్ఛారణము చేసి పూర్ణాహుతిని ఆచరించుటతో యజ్ఞమును ఏ కొరత లేని పూర్ణముగా చేసి యజ్ఞసమాప్తి చేయు యజమానుడును 'యజ్ఞాంతకృత్' అనబడుచున్నాడు. అట్టి ఆ యజమానుడును పరమాత్మునితో అభిన్నుడే!*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 981🌹*
*🌻981. Yajñāntakrt🌻*
*OM Yajñāntakrte namaḥ*
यज्ञस्यान्तं फलप्राप्तं कुर्वन् यज्ञान्तकृद्धरिः ।
वैष्णवर्क्छ्य फलप्राप्तिं कुर्वन् यज्ञान्तकृद्धरिः ॥
यज्ञं कृत्वा स यज्ञ समाप्तिं विष्णुः करोति सः ।
वेति यज्ञान्तकृद्विष्णुः प्रोच्यते विबुधोत्तमैः ॥
Yajñasyāntaṃ phalaprāptaṃ kurvan yajñāntakrddhariḥ,
Vaiṣṇavarkchya phalaprāptiṃ kurvan yajñāntakrddhariḥ.
Yajñaṃ krtvā sa yajña samāptiṃ viṣṇuḥ karoti saḥ,
Veti yajñāntakrdviṣṇuḥ procyate vibudhottamaiḥ.
*The anta or conclusion of a Yajña leads to fruition in the form of its result. Thus Yajña anta means the final step of realizing fruits at the end of a Yajña; this elucidation is provided by Śrī Bhāṣyakāras. Since Lord Viṣṇu gives the fruit of vedic sacrifices at the end of their complete performance, He is called Yajñāntakrt.*
*Or by uttering the vaiṣṇava Rk sound in the final oblation, the yajamāna i.e., performer of the vedic sacrifice, concludes the Yajña. The yajamāna, thus, is non different from paramātma Himself.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥
Yajñabhrdyajñakrdyajñī yajñabhugyajñasādhanaḥ,Yajñāntakrdyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 561 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 561 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*
*🌻 561. 'మృగాక్షీ' - 1 🌻*
*జింక కన్నుల వంటి కన్నులు కలది శ్రీమాత అని అర్ధము. జింక సాధుజంతువు. జింక చూపులు బిత్తరగ నుండును. అటు నిటు కదులుచు నుండును. అమాయకముగ నుండును. అవి నిత్య చంచలములు. శ్రీమాత కన్నులు కూడ ఈ గుణములు కలిగి యున్నట్లుగ వర్ణింపబడినవి. మాయకు ఆవల యుండును గనుక శ్రీమాత అమాయక. జగన్మాత గావున గోవు వలె సాధువు. చైతన్య స్వరూపుడు గనుక నిత్యమూ కదలిక గలిగి యుండును. శివుడు స్థాణువు, అచంచలుడు. శ్రీమాత చంచల. కదలిక. సృష్టి అంతయూ ఆమె కదలికయే. కదలిక లేనిచో సృష్టియే లేదు. శ్రీ సూక్తమున 'అనపగామినీం' అని వర్ణించిరి. అనగా నిత్యమూ కదలుచున్ననూ, కదలుచున్నట్లు గోచరించదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 561 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*
*mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻*
*🌻 561. 'Mrugashi' - 1 🌻*
*The meaning of this text is that the divine Mother, Shri Mata, is described as having eyes like those of a deer. A deer is a gentle creature, and its gaze is wide-eyed and innocent, constantly moving and filled with curiosity. Shri Mata’s eyes are said to possess these qualities. Since she exists beyond illusion, she is innocent. As the Mother of the Universe, she is gentle like a cow, full of compassion. Being the embodiment of consciousness, she is always in motion. In contrast, Shiva is still and immovable, while Shri Mata is ever-moving, representing the energy of creation. Creation itself is her movement. Without this motion, there would be no creation. In the Shri Suktam, she is described as "Anapagaminim," which means that although she is always moving, it is not easily perceived.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comments