🍀🌹 19, AUGUST 2024 MONDAY ALL MESSAGES సోమవారం, భాను వాసర సందేశాలు🌹🍀
🌹రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు 🌹
1) 🌹 అష్టావక్ర గీత 1-3. సాక్షి చైతన్యం: ముక్తి యొక్క సత్య స్వరూపం - సత్ చిత్ ఆనందం. నీవు దాని స్వరూపమే.🌹
🌹 AshtaVakra Gita 1-3. Witness Consciousness: The True Nature of Liberation - Sat-Chit-Ananda. You are the embodiment of It. 🌹
🌹 अष्टावक्र गीता क 1-3. साक्षी चेतना: मुक्ति का सच्चा स्वरूप - सत-चित-आनंद। तुम उसी के रूप हो।🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 566 / Bhagavad-Gita - 566 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 15 / Chapter 15 - Purushothama Yoga - 15 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 966 / Vishnu Sahasranama Contemplation - 966 🌹
🌻 966. జన్మమృత్యుజరాతిగః, जन्ममृत्युजरातिगः, Janmamrtyujarātigaḥ 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 4 🌹
🌻 555. 'కలికల్మష నాశినీ'- 4 / 555. 'Kalikalmasha Nasini' - 4 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹🍀. హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, రక్షా బంధనము శుభాకాంక్షలు అందరికి, Hayagriva Jayanti, Rakhi Pournami, Raksha Bandhan Good Wishes to All 🍀🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 అష్టావక్ర గీత 1-3. సాక్షి చైతన్యం: ముక్తి యొక్క సత్య స్వరూపం - సత్ చిత్ ఆనందం. నీవు దాని స్వరూపమే.🌹*
*✍️ ప్రసాద్ భరద్వాజ*
*అష్టావక్ర గీతలో మొదటి అధ్యాయంలో, మూడవ శ్లోకం సాక్షి చైతన్యం మరియు భౌతిక ప్రపంచం మధ్య తేడాను హైలైట్ చేస్తుంది. ఈ శ్లోకం వాస్తవ స్వరూపం కనిపించే భూమి, నీరు, అగ్ని, గాలి, లేదా ఆకాశం కాదని, కానీ సాక్షి చైతన్యం అని వివరిస్తుంది, ఇది సత్-చిత్-ఆనంద (అస్తిత్వం, చైతన్యం, ఆనందం) యొక్క స్వరూపం. ఈ సత్యాన్ని గ్రహించడం, మనస్సు-శరీర సంక్లిష్టత మరియు భౌతిక ప్రపంచం సృష్టించే మాయను అధిగమించి, మోక్షాన్ని అందిస్తుంది.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 AshtaVakra Gita 1-3. Witness Consciousness: The True Nature of Liberation - Sat-Chit-Ananda. You are the embodiment of It. 🌹*
*✍️ Prasad Bharadwaj*
*In Chapter 1 of the Ashtavakra Gita, the third verse emphasizes the distinction between the witness consciousness and the physical world. The verse explains that the true self is not the visible earth, water, fire, air, or sky but the witnessing consciousness, which is the embodiment of Sat-Chit-Ananda (Existence, Consciousness, Bliss). Realizing this truth leads to liberation, transcending the illusions created by the mind-body complex and the material world.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 अष्टावक्र गीता क 1-3. साक्षी चेतना: मुक्ति का सच्चा स्वरूप - सत-चित-आनंद। तुम उसी के रूप हो।🌹*
*✍️ प्रसाद भारद्वाज*
*अष्टावक्र गीता के पहले अध्याय में, तीसरा श्लोक साक्षी चेतना और भौतिक जगत के बीच अंतर को स्पष्ट करता है। यह श्लोक समझाता है कि सच्चा स्व visible पृथ्वी, जल, अग्नि, वायु या आकाश नहीं है, बल्कि साक्षी चेतना है, जो सत-चित-आनंद (अस्तित्व, चेतना, आनंद) का स्वरूप है। इस सत्य को समझने से मुक्ति मिलती है, जो मन-शरीर के जटिल संरचना और भौतिक जगत द्वारा निर्मित भ्रांतियों को पार कर जाती है।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 566 / Bhagavad-Gita - 566 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 15 🌴*
*15. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త: స్మృతిర్ జ్ఞానమపోహనం చ |*
*వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్ వేదవిదేవ చాహమ్ ||*
*🌷. తాత్పర్యం : సర్వుల హృదయములందు నేను నిలిచియున్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్తవేదముల ద్వారా తెలియదగినవాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగినవాడను నేనే.*
*🌷. భాష్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మరూపమున ఎల్లరి హృదయములందు నిలిచియుండును. అట్టి హృదయస్థ పరమాత్మ నుండియే జీవుని సర్వకర్మలు ఆరంభమగుచున్నవి. గతజన్మ విషయమునంతటిని జీవుడు మరచినను పరమాత్మ రూపమున సమస్త కర్మకు సాక్షిగా నుండు భగవానుని నిర్దేశము ననుసరించియే అతడు వర్తించవలసివచ్చును.*
*కనుక అతడు పూర్వకర్మానుసారముగా తన కర్మలను ఆరంభించును. కర్మనొనరించుటకు కావలసిన జ్ఞానము. స్మృతి అతనికి ఒసగబడును. గతజన్మమును గూర్చిన మరుపు కూడా అతనికి కలుగుచున్నది. ఈ విధముగా భగవానుడు సర్వవ్యాపియేగాక, ప్రతివారి హృదయమునందు కూడా నిలిచి వివిధ కర్మఫలముల నొసగుచుండును. అట్టి శ్రీకృష్ణభగవానుడు నిరాకారబ్రహ్మము మరియు పరమాత్మ రూపములందే గాక వేదరూపమునందును పూజనీయుడు. జనులు తమ జీవితమును ధర్మబద్ధముగా మరియు భక్తికి అనుగుణముగా మలచుకొని భగవద్ధామమును చేరు రీతిలో వేదములు తగిన నిర్దేశము నొసగుచున్నవి.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 566 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 15 🌴*
*15. sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo mattaḥ smṛtir jñānam apohanaṁ ca*
*vedaiś ca sarvair aham eva vedyo vedānta-kṛd veda-vid eva cāham*
*🌷 Translation : I am seated in everyone’s heart, and from Me come remembrance, knowledge and forgetfulness. By all the Vedas, I am to be known. Indeed, I am the compiler of Vedānta, and I am the knower of the Vedas.*
*🌹 Purport : The Supreme Lord is situated as Paramātmā in everyone’s heart, and it is from Him that all activities are initiated. The living entity forgets everything of his past life, but he has to act according to the direction of the Supreme Lord, who is witness to all his work. Therefore he begins his work according to his past deeds. Required knowledge is supplied to him, and remembrance is given to him, and he forgets, also, about his past life. Thus, the Lord is not only all-pervading;*
*He is also localized in every individual heart. He awards the different fruitive results. He is worshipable not only as the impersonal Brahman, the Supreme Personality of Godhead and the localized Paramātmā, but as the form of the incarnation of the Vedas as well. The Vedas give the right direction to people so that they can properly mold their lives and come back to Godhead, back to home. The Vedas offer knowledge of the Supreme Personality of Godhead, Kṛṣṇa, and Kṛṣṇa in His incarnation as Vyāsadeva is the compiler of the Vedānta-sūtra. The commentation on the Vedānta-sūtra by Vyāsadeva in the Śrīmad-Bhāgavatam gives the real understanding of Vedānta-sūtra. The Supreme Lord is so full that for the deliverance of the conditioned soul He is the supplier and digester of foodstuff, the witness of his activity, and the giver of knowledge in the form of the Vedas and as the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, the teacher of the Bhagavad-gītā. He is worshipable by the conditioned soul. Thus God is all-good; God is all-merciful.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 966 / Vishnu Sahasranama Contemplation - 966 🌹*
*🌻 966. జన్మమృత్యుజరాతిగః, जन्ममृत्युजरातिगः, Janmamrtyujarātigaḥ 🌻*
*ఓం జన్మమృత్యు జరాతిగాయ నమః | ॐ जन्ममृत्युजरातिगाय नमः | OM Janmamrtyu jarātigāya namaḥ*
*నసన్తి జన్మాది వికారాషట్ ఇతిహేతుతః ।*
*నజాయతేమ్రియతే వా విపశ్చిదితి మన్త్రతః ॥*
*జన్మమృత్యుజరాతిగః ఇత్యచ్యుతః సుకీర్తితః ॥*
*జననమును, మరణమును, వార్ధక్యమును అతిక్రమించి పోవుచు అమృతత్వమును చేరియున్నది జన్మమృత్యుజరాతిగః. పుట్టుక, ఉనికి, వృద్ధి, మార్పు, క్షయము, నాశము అను ఆరును ఉనికి కల పదార్థములకు ఉండు వికారములు. ఆత్మ మాత్రము ఉనికి కలదే అయి యుండియు ఈ ఆరు వికారములకును పాత్రము కాదు కనుక జన్మమృత్యుజరాతిగః.*
:: కఠోపనిషత్ ప్రథమాధ్యాయే ద్వితీయా వల్లి ::
న జాయతే మ్రియతేవా విపశ్చిత్ నాయఙ్కుతశ్చి న్న బభూవ కశ్చిత్ ।
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥ 18 ॥
*ఉనికిని ఎరింగిన ఈ ఆత్మ తత్త్వము జన్మించదు, మరణించదు, దేనినుండియు అది ఉద్భవించలేదు. దాని నుండి ఏదియు ఉద్భవించలేదు. జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైన అది తన దేహము హత్య గావించబడినపుడు తాను చంపబడుటలేదు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 966 🌹*
*🌻 966. Janmamrtyujarātigaḥ 🌻*
*OM Janmamrtyujarātigāya namaḥ*
नसन्ति जन्मादि विकाराषट् इतिहेतुतः ।
नजायतेम्रियते वा विपश्चिदिति मन्त्रतः ॥
जन्ममृत्युजरातिगः इत्यच्युतः सुकीर्तितः ॥
*Nasanti janmādi vikārāṣaṭ itihetutaḥ,*
*Najāyatemriyate vā vipaściditi mantrataḥ.*
*Janmamrtyujarātigaḥ ityacyutaḥ sukīrtitaḥ.*
*He who transcends the six modifications indicated by the words 'is born,' 'exists,' 'grows,' 'changes,' 'decays' and 'dies' is He who goes beyond birth, death and the intervening states of existence is Janmamrtyujarātigaḥ.*
:: कठोपनिषत् प्रथमाध्याये द्वितीया वल्लि ::
न जायते म्रियतेवा विपश्चित् नायङ्कुतश्चि न्न बभूव कश्चित् ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥ १८ ॥
Kaṭhopaniṣat Chapter 1, Canto 2
Na jāyate mriyatevā vipaścit nāyaṅkutaści nna babhūva kaścit,
Ajo nityaḥ śāśvato’yaṃ purāṇo na hanyate hanyamāne śarīre. 18.
*The intelligent Self is neither born nor does It die. It did not originate from anything, nor did anything originate from It. It is birthless, eternal, undecaying and ancient. It is not injured even when the body is killed.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥
Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhrt prāṇajīvanaḥ,Tattvaṃ tattvavidekātmā janmamrtyujarātigaḥ ॥ 103 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*
*🌻 555. 'కలికల్మష నాశినీ'- 4 🌻*
*అజ్ఞానపు పోకడలు ఎవరికి అంతు పట్టగలవు? "మమ మాయా దురత్యయా” అని కృష్ణుడు చిరునవ్వుతో పలికినాడు. నా మాయ నెవ్వరునూ దాట లేరు అనుచూ నవ్వెడి శ్రీకృష్ణుని ముఖమునుండే మాయ ప్రసరించును. అట్లే శ్రీలలిత చిరునవ్వు కూడను. ఆమె అనుగ్రహము వలననే ఆ మాయను దాట వచ్చును. కనుక నామెను ప్రార్థించుట జీవుల కవసరమై నిలచినది. కలి యుగమందు అజ్ఞానము మహత్తరమగు బలము కలిగి యుండును. తత్కారణముగ కల్మషము లధికములై యుండును. కాలము, దేశము కల్మషములతో నిండియుండగ అట్టి దుర్దశ నుండి బయల్పడుటకు అవకాశము చాల తక్కువగ నుండును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*
*katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻*
*🌻 555. 'Kalikalmasha Nasini' - 4 🌻*
*Who can understand the trends of ignorance? 'Mama Maya Duratya' said Krishna with a smile. When Sri Krishna says with a smile "Nobody can overcome my illusion" his face itself radiates illusion. That's how Srilalitha's smile is too. It is because of her grace that we can cross that illusion. Therefore, praying to her is essential for living beings. Ignorance has great power in Kali Yuga. Hence the defects or sins are high. When the time and the country are full of defects, there is very little chance to get out of such a bad situation.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Комментарии