🍀🌹 19 SEPTEMBER 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 2వ భాగం - ఆధ్యాత్మిక ప్రగతికి నమ్రత మరియు మౌనం అత్యంత కీలకం. సంపూర్ణ ఆత్మ సాక్షాత్కార మార్గంలో అహంకారాన్ని నివారించండి. 🌹
2) 🌹 Soul Journey Secrets - Part 2 - Humility and silence are vital to spiritual progress. Avoid ego on the path of absolute self-Realization. 🌹
3) 🌹 आत्मा की यात्रा के रहस्य - भाग 2 - आध्यात्मिक प्रगति के लिए नम्रता और मौन अत्यंत महत्वपूर्ण हैं। पूर्ण आत्म साक्षात्कार के मार्ग में अहंकार से बचें। 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 585 / Bhagavad-Gita - 585 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 14 / Chapter 16 - The Divine and Demoniac Natures - 14 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 982 / Vishnu Sahasranama Contemplation - 982 🌹
🌻 982. యజ్ఞగుహ్యమ్, यज्ञगुह्यम्, Yajñaguhyam 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 561 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 561 - 2 🌹
🌻 561. 'మృగాక్షీ' - 2 / 561. 'Mrugashi' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 2వ భాగం - ఆధ్యాత్మిక ప్రగతికి నమ్రత మరియు మౌనం అత్యంత కీలకం. సంపూర్ణ ఆత్మ సాక్షాత్కార మార్గంలో అహంకారాన్ని నివారించండి. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*ఈ వీడియోలో ప్రసాద్ భరద్వాజ ఆధ్యాత్మిక మార్గంలో నమ్రత మరియు మౌనం ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. తాత్కాలిక ఆధ్యాత్మిక అనుభవాలను సంపూర్ణ ఆత్మసాక్షాత్కారంగా పొరబడడం ఎలా అహంకారానికి దారి తీస్తుందో, అది ప్రగతిని ఎలా నిలిపి వేస్తుందో అర్థం చేసుకుంటారు. ఉదయం మరియు మధ్యాహ్నం అనే ఉపమానం ద్వారా, ఆధ్యాత్మిక పెరుగుదలలో నిరంతరం జాగ్రత్తగా ఉండడం, నమ్రత మరియు అంతర్గత మౌనాన్ని పాటించడం ఎంత ముఖ్యమో ఈ వీడియో వెల్లడిస్తుంది. అహంకారపు అడ్డంకులను నివారించి, నిరంతర ఆత్మ వికాసం కోసం ఇది ప్రతి ఆత్మ సాధకుడు చూడవలసిన వీడియో.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Soul Journey Secrets - Part 2 - Humility and silence are vital to spiritual progress. Avoid ego on the path of absolute self-Realization. 🌹*
*Prasad Bhardwaj*
*In this video, Prasad Bhardwaj explores the importance of humility and silence on the spiritual path. He explains how mistaking temporary spiritual experiences for full self-realization can lead to ego and halt progress. Through the metaphor of dawn and noon, the video emphasizes the need for constant vigilance, humility, and inner silence to ensure continued spiritual growth and avoid the pitfalls of pride. A must-watch for anyone on a journey toward self-realization.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 आत्मा की यात्रा के रहस्य - भाग 2 - आध्यात्मिक प्रगति के लिए नम्रता और मौन अत्यंत महत्वपूर्ण हैं। पूर्ण आत्म साक्षात्कार के मार्ग में अहंकार से बचें। 🌹*
*प्रसाद भारद्वाज*
*इस वीडियो में प्रसाद भारद्वाज आध्यात्मिक मार्ग पर नम्रता और मौन के महत्व को समझा रहे हैं। वह बताते हैं कि अस्थायी आध्यात्मिक अनुभवों को पूर्ण आत्म-साक्षात्कार समझने की भूल कैसे अहंकार की ओर ले जाती है और उस प्रगति को रोक देती है। सुबह और दोपहर के रूपक के माध्यम से, वीडियो यह स्पष्ट करता है कि निरंतर सतर्कता, नम्रता और आंतरिक मौन को बनाए रखना आध्यात्मिक प्रगति के लिए कितना महत्वपूर्ण है। अहंकार की बाधाओं से बचकर, निरंतर आत्म विकास के लिए यह वीडियो हर आत्म-साधक के लिए आवश्यक है।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 585 / Bhagavad-Gita - 585 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 14 🌴*
*14. అసౌ మయా హత: శత్రుర్హనిష్యే చాపరానపి |*
*ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ||*
*🌷. తాత్పర్యం : అతడు నా శత్రువు. అతనిని నేను వధించితిని. ఇతర శత్రువులు కూడా వధింప బడుదురు. నేనే సర్వమునకు ప్రభువును. నేనే భోక్తను. పూర్ణుడను, శక్తిమంతుడను మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని.*
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 585 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 14 🌴*
*14. asau mayā hataḥ śatrur haniṣye cāparān api*
*īśvaro ’ham ahaṁ bhogī siddho ’haṁ balavān sukhī*
*🌷 Translation : He is my enemy, and I have killed him, and my other enemies will also be killed. I am the lord of everything. I am the enjoyer. I am perfect, powerful and happy. I am the richest man, surrounded by aristocratic relatives.*
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 982 / Vishnu Sahasranama Contemplation - 982 🌹*
*🌻 982. యజ్ఞగుహ్యమ్, यज्ञगुह्यम्, Yajñaguhyam 🌻*
*ఓం యజ్ఞగుహ్యాయ నమః | ॐ यज्ञगुह्याय नमः | OM Yajñaguhyāya namaḥ*
*ఫలాభిసన్ధిరహితో యజ్ఞః శ్రీ విష్ణురేవ వా ।*
*జ్ఞానయజ్ఞో హి యజ్ఞానాం గుహ్యం బ్రహ్మాచ్యుతం హరిః ॥*
*తదభేదోపచారార్థం యజ్ఞగుహ్యమితీర్యతే ॥*
*యజ్ఞములన్నిటిలో గుహ్యము అనగా రహస్యము, ఉత్కృష్టము అయినది జ్ఞాన యజ్ఞము. అది జ్ఞానయజ్ఞముకాని, ఫలాభిసంధిరహిత యజ్ఞము కాని అగును. అట్టి యజ్ఞగుహ్యమునకు పరమాత్మునితో అభేదమును ఆరోపించుటచే పరమాత్ముడే 'యజ్ఞగుహ్యమ్' అనబడుచున్నాడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 982 🌹*
*🌻 982. Yajñaguhyam 🌻*
*OM Yajñaguhyāya namaḥ*
फलाभिसन्धिरहितो यज्ञः श्री विष्णुरेव वा ।
ज्ञानयज्ञो हि यज्ञानां गुह्यं ब्रह्माच्युतं हरिः ॥
तदभेदोपचारार्थं यज्ञगुह्यमितीर्यते ॥
*Phalābhisandhirahito yajñaḥ śrī viṣṇureva vā,*
*Jñānayajño hi yajñānāṃ guhyaṃ brahmācyutaṃ hariḥ.*
*Tadabhedopacārārthaṃ yajñaguhyamitīryate.*
*The secret of sacrifices is jñānayajña or the sacrifice performed without attachment to result. Brahman is considered as non different from it and is said to be Yajñaguhyam, thus.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥
Yajñabhrdyajñakrdyajñī yajñabhugyajñasādhanaḥ,Yajñāntakrdyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 561 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 561 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*
*🌻 561. 'మృగాక్షీ' - 2 🌻*
*భూమి తిరుగుచున్నట్లు గోచరించు చున్నదా? కాని మహా వేగముతో తిరుగుచున్నది. మొక్క పెరుగుచున్నట్లు గోచరించు చున్నదా? కాని పెరుగుచునే యుండును. కాలము జరుగుచున్నట్లు గోచరించు చున్నదా? గాని కదలుచునే యుండును. ఆమె నాగిని. నిత్యమూ కదలుచూ, కదలనట్లుండును. ఇట్లు శ్రీమాత కన్నులు జింక కన్నులవలె సరిపోల్చుటలో గంభీరమగు భావము గోచరించును. మృగము అనగా కదలునది అని అర్థము కలదు. సమస్తమునూ కదలించుచు, దానిని వీక్షించుచు, పర్యవేక్షించుచు, రక్షించుచూ నుండుట శ్రీమాత కన్నుల విశేషము. కన్నులతోనే సమస్త సృష్టి గావించి పోషించు చుండును. కదలిక యందును, కదలికకు ఆవలను కూడ యుండునది శ్రీమాత.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 561 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*
*mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻*
*🌻 561. 'Mrugashi' - 2 🌻*
*Does the Earth seem to be moving? Though it does not seem so, it spins at a great speed. Do plants appear to be growing? Yet, they are constantly growing. Does time appear to be passing? Though it is invisible, time is always moving forward. She is like a serpent, continuously in motion, yet appearing still. This comparison of Shri Mata’s eyes to those of a deer holds profound meaning. The word "mṛuga" (deer) also means "that which moves." Her eyes signify that she is the one who moves everything, observes everything, oversees and protects everything. Through her eyes alone, she sustains and nurtures the entire creation. Shri Mata exists both in movement and beyond it.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comments