🍀🌹 24, AUGUST 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹 అష్టావక్ర గీత - 1.4. నీ ఎరుకలో నిష్ఠతో నిలబడగలిగిన తక్షణమే నీవు ముక్తుడివుగా నిన్ను నీవు గుర్తిస్తావు. 🌹
2) 🌹 Ashtavakra Gita - 1.4. "If you can stand firm in your awareness you will immediately recognize yourself as liberated." 🌹
3) 🌹 अष्टावक्र गीता - 1.4.यदि जागरूकता में निष्ठा के साथ खड़े रह सकते हैं, मुक्त के रूप में पहचान लेंगे।🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 568 / Bhagavad-Gita - 568 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 17 / Chapter 15 - Purushothama Yoga - 17 🌴
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 6 🌹
🌻 555. 'కలికల్మష నాశినీ'- 6 / 555. 'Kalikalmasha Nasini' - 6 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 అష్టావక్ర గీత - 1.4. నీ ఎరుకలో నిష్ఠతో నిలబడగలిగిన తక్షణమే నీవు ముక్తుడివుగా నిన్ను నీవు గుర్తిస్తావు. 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*అష్టావక్ర గీత 1వ అధ్యాయం 4వ శ్లోకంలో, శరీర తాదాత్మ్యము నుండి విడిపోవడం ద్వారా శాంతి, ఆనందం, ముక్తిని పొందవచ్చని వివరిస్తుంది. ధ్యానం ద్వారా స్వరూప స్థితిని చేరడం, జీవన్ముక్తి అవగాహన గురించి ఈ శ్లోకంలో చర్చించ బడింది.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Ashtavakra Gita - 1.4. "If you can stand firm in your awareness you will immediately recognize yourself as liberated." 🌹*
*Prasad Bharadwaj*
*In Ashtavakra Gita, Chapter 1, Verse 4, detachment from body identity and steadfastness in awareness leads to immediate realization of peace, bliss, and liberation. This verse explores the path to jivanmukti (liberation while living), emphasizing the importance of meditation and understanding spiritual truth.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 अष्टावक्र गीता - 1.4.यदि जागरूकता में निष्ठा के साथ खड़े रह सकते हैं, मुक्त के रूप में पहचान लेंगे।🌹*
*- प्रसाद भारद्वाज*
*अष्टावक्र गीता के अध्याय 1, श्लोक 4 में, शरीर की पहचान से अलगाव और जागरूकता में दृढ़ता शांति, आनंद, और मुक्ति की तात्कालिक अनुभूति की ओर ले जाती है। यह श्लोक जीवन्मुक्ति (जीते जी मुक्ति) के मार्ग की खोज करता है, जिसमें ध्यान और आध्यात्मिक सत्य के समझ की महत्ता पर जोर दिया गया है।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 568 / Bhagavad-Gita - 568 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 17 🌴*
*17. ఉత్తమ: పురుషస్త్వస్య: పరమాత్మేత్యుదాహృత: |*
*యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వర: ||*
*🌷. తాత్పర్యం : ఈ ఇరువురు గాక మూడులోకములందును ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అవ్యయ ప్రభువును, పరమాత్ముడును అగు ఉత్తమపురుషుడును కలడు.*
*🌷. భాష్యము : ఈ శ్లోకమునందలి భావము కఠోపనిషత్తు (2.2.13) మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు (6.13) నందు చక్కగా వివరింపబడినది. బంధ, ముక్తస్థితి యందున్న అసంఖ్యాకజీవులపైన పరమాత్మగా హృదయమందు నిలుచు దేవదేవుడు కలడని అందు తెలుపబడినది. “నిత్యో(నిత్యానాం చేతనశ్చేతనానాం” అనునది ఆ ఉపనిషత్తు నందలి వాక్యము.*
*బద్ధ, ముక్తస్థితి యందున్న జీవులలో, వాటిని పోషించుచు కర్మానుసారముగా వారి భోగానుభవమునకు అవకాశమునొసగు దేవదేవుడను శ్రేష్ఠపురుషుడు వేరొకడు కలడని దీని భావము. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడే ప్రతివారి హృదయమునందు పరమాత్మగా విరాజమానుడై యున్నాడు. అతనిని ఎరుగగలిగిన బుద్ధిమంతుడే సంపూర్ణశాంతిని పొందును గాని అన్యులు కారు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 568 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 17 🌴*
*17. uttamaḥ puruṣas tv anyaḥ paramātmety udāhṛtaḥ*
*yo loka-trayam āviśya bibharty avyaya īśvaraḥ*
*🌷 Translation : Besides these two, there is the greatest living personality, the Supreme Soul, the imperishable Lord Himself, who has entered the three worlds and is maintaining them.*
*🌹 Purport : The idea of this verse is very nicely expressed in the Kaṭha Upaniṣad (2.2.13) and Śvetāśvatara Upaniṣad (6.13). It is clearly stated there that above the innumerable living entities, some of whom are conditioned and some of whom are liberated, there is the Supreme Personality, who is Paramātmā. The Upaniṣadic verse runs as follows: nityo nityānāṁ cetanaś cetanānām.*
*The purport is that amongst all the living entities, both conditioned and liberated, there is one supreme living personality, the Supreme Personality of Godhead, who maintains them and gives them all the facility of enjoyment according to different work. That Supreme Personality of Godhead is situated in everyone’s heart as Paramātmā. A wise man who can understand Him is eligible to attain perfect peace, not others.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 6 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*
*🌻 555. 'కలికల్మష నాశినీ'- 6 🌻*
*అనారోగ్యములు విజృంభించి వికృతముగ తాండవము చేయుచున్నవి. స్వార్థము పెచ్చుపెరిగి కాంక్షలు వికారమై గోచరించు చున్నవి. ఇది యంతయూ కలి కల్మషముగ పెద్దలు దర్శింతురు. ఇట్టి కల్మషములను హరించు శక్తి ఏ ఒక్కరికినీ లేదు. కావున కలి కల్మష నాశిని యగు శ్రీమాతయే శరణ్యము. భగవన్నామ సంకీర్తన మొక్కటియే ఈ కల్మషములను పారద్రోల కలదు. ఎలుగెత్తి నామ సంకీర్తన కూడ చేయని దుస్థితి యందు జీవులు పడి యున్నారు. దైవనామ సంకీర్తనము వలన కల్మషము లన్నింటినీ బహిష్కరింప వచ్చును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 6 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*
*katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻*
*🌻 555. 'Kalikalmasha Nasini' - 6 🌻*
*Diseases are rampant and ugly. Selfishness increases and desires become visible ugly. These are all seen by elders as the defects of Kali. No one has the power to destroy these defects. Therefore Kali Kalmasha Nashini, the destroyer of the defects of Kali, Shrimata is the refuge. Continuous chanting of her name alone can remove these impurities. Living beings are in such a predicament that they do not even chant god's name openly. All impurities can be banished by chanting the Divine Name.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comentarios