top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 26 SEPTEMBER 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 26 SEPTEMBER 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀

1) 🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 4వ భాగం - మానవ జన్మ సార్థకత మరియు ఆత్మ సాక్షాత్కారం, దైవిక కృపతోనే సాధ్యం. 🌹

2) 🌹 Soul Journey Secrets - Part 4: The fulfillment of human life and self-realization is only possible through divine grace. 🌹

3) 🌹 आत्म यात्रा के रहस्य - भाग 4 - मानव जीवन की सार्थकता और आत्म साक्षात्कार, केवल ईश्वरीय कृपा से ही संभव है। 🌹

4) 🌹. శ్రీమద్భగవద్గీత - 590 / Bhagavad-Gita - 590 🌹

🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 19 / Chapter 16 - The Divine and Demoniac Natures - 19 🌴

5) *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 986 / Vishnu Sahasranama Contemplation - 986 🌹*

🌻 986. స్వయఞ్జాతః, स्वयञ्जातः, Svayañjātaḥ 🌻

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 563 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 563 - 2 🌹

🌻 563. 'ముఖ్యా’ - 2 / 563. 'Mukhyā' - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 4వ భాగం - మానవ జన్మ సార్థకత మరియు ఆత్మ సాక్షాత్కారం, దైవిక కృపతోనే సాధ్యం. 🌹*

*ప్రసాద్ భరద్వాజ*


*ఈ వీడియోలో మానవ జీవితంలో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక శక్తుల ప్రాముఖ్యతను వివరించ బడుతుంది. ఈ మూడు శక్తులు పరస్పర సమన్వయంతో మన జీవితాన్ని అర్ధవంతంగా మార్చేందుకు దైవ అనుగ్రహం ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి. మానవ శరీరం, భగవంతుడి ప్రసాదంగా, ఆత్మ సాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక ప్రగతికి ఎలా ఉపకరిస్తుందో కూడా తెలుసుకోండి. మన సంకల్పం దైవ సంకల్పానికి అనుగుణంగా ఉండడం వల్ల ఆనందం మరియు సార్థకతను ఎలా పొందవచ్చో ఈ వీడియోలో వివరించ బడింది.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 Soul Journey Secrets - Part 4: The fulfillment of human life and self-realization is only possible through divine grace. 🌹*

*Prasad Bharadwaj*


*In this enlightening video, we explore the importance of spiritual, mental, and physical energies in human life. Through divine grace, these energies work together to give our lives purpose and meaning. Discover how the human body, a gift from the Divine, serves as a tool for spiritual growth and self-realization. Learn how aligning your actions with divine will can bring inner joy and fulfillment.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 आत्म यात्रा के रहस्य - भाग 4 - मानव जीवन की सार्थकता और आत्म साक्षात्कार, केवल ईश्वरीय कृपा से ही संभव है। 🌹*

*प्रसाद भारद्वाज*


*इस वीडियो में आत्मा, मानसिक और शारीरिक ऊर्जा के महत्व को समझाया गया है, जो जीवन को अर्थपूर्ण बनाते हैं। जानिए कैसे दिव्य कृपा के साथ इन तीनों शक्तियों का संतुलन हमें आत्म-साक्षात्कार और आध्यात्मिक प्रगति की ओर ले जाता है। मानव शरीर, ईश्वर का उपहार है, जो आत्मा की उन्नति और आध्यात्मिक यात्रा में सहायता करता है। जब हमारी इच्छाएं ईश्वर की इच्छा के अनुरूप होती हैं, तो हम सच्ची आनंद और जीवन की पूर्णता प्राप्त कर सकते हैं।*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 590 / Bhagavad-Gita - 590 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 19 🌴*


*19. తానహం ద్విషత: క్రూరాన్ సంసారేషు నరాధమాన్ |*

*క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ||*


*🌷. తాత్పర్యం : అసూయగలవారును, క్రూరులును అగు నరాదములను వివిధ ఆసురజన్మలనెడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను.*


*🌷. భాష్యము : జీవుని ఒక ప్రత్యేక దేహమునందు ప్రవేశింపజేయుట యనునది శ్రీకృష్ణభగవానుని విశేష అధికారమని ఈ శ్లోకమున అతిస్పష్టముగ తెలుపబడినది. దానవప్రవృత్తి గలవాడు భగవానుని అధికారమును ఆంగీకరింపక తనకు తోచిన రీతిలో వర్తించినను, అతని తదుపరి జన్మము మాత్రము ఆ భగవానుని నిర్ణయముపైననే ఆధారపడి యుండును. అది ఎన్నడును అతనిపై ఆధారపడి యుండదు. మరణము పిదప జీవుడు తల్లి గర్భములో ప్రవేశపెట్ట బడుననియు, అచ్చట అతడు తగిన దేహమును భగవానుని దివ్య శక్తి యొక్క పర్యవేక్షణమున పొందుననియు శ్రీమద్భాగవతపు మూడవస్కంధమున తెలుపబడినది.*


*కనుకనే భౌతికజగమున జంతువులు, కీటకములు, మనుష్యాది పలుజీవ జాతులను మనము గాంచుచున్నాము. అవన్నియు శ్రీకృష్ణభగవానుని శక్తిచేతనే రూపొందినవి గాని యాదృచ్చికముగా కాదు. ఇక ఆసుర స్వభావుల విషయమున వారు సదా అసుర యోనులందే ఉంచబడుదరనియు, తత్కారణముగా వారు ద్వేషులుగాను మరియు నరాధములుగాను కొనసాగుదురనియు ఇచ్చట తెలుపబడినది. అట్టి అసురస్వభావులు సదా కామపూర్ణులును, హింసాపూర్ణులును, ద్వేషులును, శుచిరహితులును అయియుందురు. అరణ్యములందు నివసించు పలురకములైన వేటగాళ్ళు అట్టి అసురజాతికి చెందినవారుగా పరిగణింప బడుదురు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 590 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 19 🌴*


*19. tān ahaṁ dviṣataḥ krūrān saṁsāreṣu narādhamān*

*kṣipāmy ajasram aśubhān āsurīṣv eva yoniṣu*


*🌷 Translation : Those who are envious and mischievous, who are the lowest among men, I perpetually cast into the ocean of material existence, into various demoniac species of life.*


*🌹 Purport : In this verse it is clearly indicated that the placing of a particular individual soul in a particular body is the prerogative of the supreme will. The demoniac person may not agree to accept the supremacy of the Lord, and it is a fact that he may act according to his own whims, but his next birth will depend upon the decision of the Supreme Personality of Godhead and not on himself. In the Śrīmad-Bhāgavatam, Third Canto, it is stated that an individual soul, after his death, is put into the womb of a mother where he gets a particular type of body under the supervision of superior power.*


*Therefore in the material existence we find so many species of life – animals, insects, men, and so on. All are arranged by the superior power. They are not accidental. As for the demoniac, it is clearly said here that they are perpetually put into the wombs of demons, and thus they continue to be envious, the lowest of mankind. Such demoniac species of men are held to be always full of lust, always violent and hateful and always unclean. The many kinds of hunters in the jungle are considered to belong to the demoniac species of life.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 986 / Vishnu Sahasranama Contemplation - 986 🌹*


*🌻 986. స్వయఞ్జాతః, स्वयञ्जातः, Svayañjātaḥ 🌻*


*ఓం స్వయంజాతాయ నమః | ॐ स्वयंजाताय नमः | OM Svayaṃjātāya namaḥ*


*నిమిత్తకారణమపి పరమాత్మా సనాతనః ।*

*స ఏవేతి దర్శయితుం స్వయఞ్జాత ఇతీర్యతే ॥*


*మరి యేదియు తనకు కారణము లేక తనకు ఇతరము ఏదియు ఉపాదాన కారణము కాని, నిమిత్త కారణము కాని లేక తానే జనించినవాడు వలె అనుభవమున గోచరడగుచు ఉన్నాడు అని అర్థము.*


*తాను స్వయంజాతుడగుచు జగత్ ఉపాదాన కారణముగా ఉన్నాడు. ఆత్మయోనిః అనుటచేతను జగత్తు యొక్క ఉత్పత్తికి పూర్వము ఉన్న ఏకైక చేతన తత్త్వము ఆతడొక్కడేయని 'ఆత్మా నా ఇద్ మేక ఏవాగ్ర ఆసీత్‌' ఇత్యాది శ్రుతులు చెప్పుచుండుటచేతను జగన్నిమిత్త కారణము కూడ ఆతడేయని చెప్పుటయైనది. ఇట్లు హరియే జగదుత్పత్తిలో నిమిత్తోపాదాన కారణములు రెండునగుననుట 'ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతాను పరోధాత్‌' (బ్రహ్మ సూత్రము 1.4.23) - అనుచోట చెప్పబడినది.*


*అదెట్లనిన ఛాందోగ్యోపనిషత్ ఇత్యాదులయందు "ఏ ఒకదానిని గూర్చి వినినచో విశేషాకార గ్రహణముచే విననిదెల్ల వినినదే అగునో" ఇత్యాది ప్రతిజ్ఞయు, "మృత్పిండమునొకదానిని అనుభవమున ఎరిగినచో మృణ్మయమగు ప్రతియొకదానిని అనుభవమున ఎరిగినట్లే అగుచున్నది" అను ఈ మొదలగు దృష్టాంతమును "పరస్పర పీడనమునందక సామంజస్యమున కుదుర వలయుననినచో పరమాత్మ తాను జగత్సృష్టి సేయ సంకల్పించెను" అను శ్రుతులనుబట్టి ఆతడు జగదుద్పత్తిలో నిమిత్త కారణమగుటతోపాటు ఉపాదాన కారణముకూడ అగునని చెప్పవలయును.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 986🌹*


*🌻986. Svayañjātaḥ🌻*


*OM Svayaṃjātāya namaḥ*


निमित्तकारणमपि परमात्मा सनातनः ।

स एवेति दर्शयितुं स्वयञ्जात इतीर्यते ॥


*Nimittakāraṇamapi paramātmā sanātanaḥ,*

*Sa eveti darśayituṃ svayañjāta itīryate.*


*As explained in the description of 'Ātmayoniḥ' He is the material cause. To show that He is also the efficient cause i.e., nimitta kāraṇa, it is said Svayaṃ jātaḥ.*


*That Hari is both the material and the efficient cause - is established by the 'प्रकृतिश्च प्रतिज्ञादृष्टान्तानु परोधात्‌ / Prakr‌tiśca pratijñādr‌ṣṭāṃtānu parodhāt' (Brahma sūtra 1.4.23) - 'Brahman must be the twofold cause so as not to contradict the proposition and the illustration.'*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 563 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 563 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*

*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*


*🌻 563. 'ముఖ్యా’ - 2 🌻*


*శ్రీమాత ఆరాధన ముఖ్యము. శ్రీకారము చుట్టియే ఏ పనులైననూ ప్రారంభించ వలెను. నిదుర నుండి లేచిన వెంటనే శ్రీమాతను స్మరించి అరచేతి యందు శ్రీంకారమును లిఖించుట సదాచారము. తల్లికి నమస్కరించియే ఏ పనియైననూ చేయవలెను. ఇట్లు శ్రీమాత అత్యంత ముఖ్యమైనదిగా భావించ వలెను. ముఖము శరీరమున కెట్లో సృష్టికి శ్రీమాత అట్లే.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 563 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*

*mrugashi mohini mudhya mrudani mitrarupini  ॥114 ॥ 🌻*


*🌻 563. 'Mukhyā' - 2 🌻*


*The adoration of Śrī Māta is essential. Every task should begin with the remembrance of Śrī Māta. It is a good practice to recall Śrī Māta and write "Śrīṃ" on the palm of your hand immediately after waking up from sleep. One should offer salutations to the Mother before starting any task. Thus, Śrī Māta should be regarded as the most important. Just as the face is vital to the body, Śrī Māta is crucial to creation.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹


Comments


bottom of page