top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 29, AUGUST 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 29, AUGUST 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀


1) 🌹 శివ సూత్రములు - 1-7వ సూత్రం - మెలకువ, స్వప్న, గాఢమైన నిద్రలలో కూడా నాల్గవ స్థితి తుర్య యొక్క ఆనందం ఉంది. 🌹


2) 🌹 Shiva Sutras - 1-7. The Bliss of the Fourth State, Turiya, Exists Even in Waking, Dream, and Deep Sleep. 🌹


3) 🌹 शिव सूत्र - 1-7. सूत्र - तुरीय की आनंदमयी स्थिति जाग्रत, स्वप्न, और गहरी नींद में भी विद्यमान होती है। 🌹


4) 🌹. శ్రీమద్భగవద్గీత - 572 / Bhagavad-Gita - 572 🌹


🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 1 / Chapter 16 - The Divine and Demoniac Natures - 1 🌴


5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 969 / Vishnu Sahasranama Contemplation - 969 🌹


🌻 969. సవితా, सविता, Savitā 🌻


6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 556 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 556 - 3 🌹


🌻 556. ‘కాత్యాయనీ’ - 3 / 556. 'Katyayani' - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 శివ సూత్రములు - 1-7వ సూత్రం - మెలకువ, స్వప్న, గాఢమైన నిద్రలలో కూడా నాల్గవ స్థితి తుర్య యొక్క ఆనందం ఉంది. 🌹*


*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*



*ఈ వీడియోలో, శివ సూత్రం యొక్క మొదటి అధ్యాయంలోని 7వ సూత్రం : జాగృత స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః గురించి వివరణ పొందుపరచబడింది. మెలకువ, స్వప్న, గాఢ నిద్ర వంటి భిన్న స్థితులలో కూడా తుర్య అనే నాల్గవ స్థితి యొక్క ఆనందం ఉంటుందని, మరియు ఈ తుర్య స్థితి యొక్క పరమ పవిత్రతను అనుభవించవచ్చని ఈ సూత్రం చెబుతుంది. ఇది చైతన్యం యొక్క మూడు ప్రాథమిక దశలతో పాటు, తుర్య స్థితి యొక్క సార్వత్రికతను వివరిస్తుంది.*


🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 Shiva Sutras - 1-7. The Bliss of the Fourth State, Turiya, Exists Even in Waking, Dream, and Deep Sleep. 🌹*


*Prasad Bharadwaj*



*In this video, an explanation is given of the 7th Sutra from the first chapter of Shiva Sutras: "Jagrat Swapna Sushupta Bhede Turyabhoga Sambhavah." This sutra states that even in different states such as waking, dreaming, and deep sleep, the bliss of the fourth state, known as Turiya, can be experienced. It elaborates on the universality of the Turiya state alongside the three primary stages of consciousness.*


🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 शिव सूत्र - 1-7. सूत्र - तुरीय की आनंदमयी स्थिति जाग्रत, स्वप्न, और गहरी नींद में भी विद्यमान होती है। 🌹*


*✍️ प्रसाद भारद्वाज*



*इस वीडियो में, शिव सूत्र के पहले अध्याय के 7वें सूत्र "जाग्रत स्वप्न सुषुप्त भेदे तुरीयाभोग संभवः" का वर्णन प्रस्तुत किया गया है। यह सूत्र बताता है कि जाग्रत, स्वप्न और गहरी नींद जैसी विभिन्न अवस्थाओं में भी तुरीय नामक चौथी स्थिति का आनंद अनुभव किया जा सकता है। यह सूत्र चेतना की तीन प्राथमिक अवस्थाओं के साथ-साथ तुरीय स्थिति की सार्वभौमिकता की भी व्याख्या करता है।*


🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 572 / Bhagavad-Gita - 572 🌹*


*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 1 🌴*


*1. శ్రీ భగవానువాచ*


*అభయం సత్త్వసంశుద్దిర్ జ్ఞానయోగవ్యవస్థితి: |*


*దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ||*


*🌷. తాత్పర్యం : శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ భరతవంశీయుడా! భయరాహిత్యము, స్వీయస్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మికజ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము,*


*🌷. భాష్యము : కడచిన పంచదశాధ్యాయపు ఆరంభమున ఈ భౌతికజగత్తు యొక్క సంసారవృక్షము (ఆశ్వత్తవృక్షము) వర్ణింపబడినది. ఆ వృక్షము యొక్క అదనపు వ్రేళ్ళు శుభాశుభములుగా తెలియబడు జీవుల కర్మలతో పోల్చబడినవి. దైవీస్వభావము కలిగిన దేవతల గూర్చియు, అసురస్వభావము కలిగిన దానవుల గూర్చియు నవమాధ్యాయమున కూడా వర్ణింపబడినది.*


*ఇక ఇప్పుడు వేదముల ననుసరించి సత్త్వగుణకర్మలు ముక్తిపథమున పురోగమించుటకు దోహదములుగా భావించబడి “దైవీప్రకృతి” యని (స్వభావరీత్యా దివ్యములు) తెలియబడుచున్నది. అట్టి దివ్యస్వభావమున నిలిచినవారు ముక్తిమార్గమున నిశ్చయముగా పురోగతి సాధింపగలరు. కాని రజస్తమో గుణములందు వర్తించువారికి ఇందుకు భిన్నముగా ముక్తినొందు నవకాశమే లభింపదు. వారు మానవులుగా మర్త్యలోకమునందు నిలుచుటయో లేదా జంతుజాలమున జన్మించుటయో లేదా ఇంకను నీచమైన జన్మలను పొందుటయో జరుగును. ఈ షోడశాధ్యాయమున శ్రీకృష్ణభగవానుడు దైవీప్రకృతిని, దాని గుణములను, అలాగుననే ఆసురీప్రకృతిని, దాని గుణములను వర్ణించుచున్నాడు. ఈ దైవాసురగుణముల లాభనష్టములను సైతము భగవానుడు వివరింపనున్నాడు.*


🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 572 🌹*


*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 1 🌴*


*1. śrī-bhagavān uvāca :*


*abhayaṁ sattva-saṁśuddhir jñāna-yoga-vyavasthitiḥ*


*dānaṁ damaś ca yajñaś ca svādhyāyas tapa ārjavam*


*🌷 Translation : The Supreme Personality of Godhead said: Fearlessness; purification of one’s existence; cultivation of spiritual knowledge; charity; self-control; performance of sacrifice; study of the Vedas; austerity; simplicity;*


*🌹 Purport : In the beginning of the Fifteenth Chapter, the banyan tree of this material world was explained. The extra roots coming out of it were compared to the activities of the living entities, some auspicious, some inauspicious. In the Ninth Chapter, also, the devas, or godly, and the asuras, the ungodly, or demons, were explained. Now, according to Vedic rites, activities in the mode of goodness are considered auspicious for progress on the path of liberation, and such activities are known as daivī prakṛti, transcendental by nature.*


*Those who are situated in the transcendental nature make progress on the path of liberation. For those who are acting in the modes of passion and ignorance, on the other hand, there is no possibility of liberation. Either they will have to remain in this material world as human beings, or they will descend among the species of animals or even lower life forms. In this Sixteenth Chapter the Lord explains both the transcendental nature and its attendant qualities and the demoniac nature and its qualities. He also explains the advantages and disadvantages of these qualities.*


🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 969 / Vishnu Sahasranama Contemplation - 969 🌹*


*🌻 969. సవితా, सविता, Savitā 🌻*


*ఓం సవిత్రే నమః | ॐ सवित्रे नमः | OM Savitre namaḥ*


*సర్వలోకస్య జనకః సవితేత్యుచ్యతే హరిః*


*తండ్రిగా సర్వలోకమును జనింపజేయు సర్వలోకైక జనకుడుగాన ఆ హరి సవితా అని చెప్పబడును.*


:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే సప్తోత్తరశతతమస్సర్గః (ఆదిత్య హృదయ స్తోత్రమ్) ::


ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।


సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥


*ఇతడు అదితి పుత్రుడు (ఆదిత్యః) జగత్సృష్టికి కారకుడు (సవితా) జనులు తమ తమ విధులను నిర్వర్తించుటకు ప్రేరణను ఇచ్చువాడు (సూర్యః) లోకోపకారము కొరకు ఆకాశమున సంచరించుచుండెడివాడు (ఖగః) వర్షముల ద్వారమున జగత్తును పోషించెడివాడు (పూషా) తన కిరణములచే లోకములను ప్రకాశింపజేయువాడు (గభస్తిమాన్‍) బంగారు వన్నెతో తేజరిల్లుచుండువాడు (సువర్ణసదృశః) అద్భుతముగా ప్రకాశించుచుండువాడు (భానుః) బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు (హిరణ్యరేతాః) చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను కావించువాడు (దివాకరః).*


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 969 🌹*


*🌻969. Savitā🌻*


*OM Savitre namaḥ*


*सर्वलोकस्य जनकः सवितेत्युच्यते हरिः / Sarvalokasya janakaḥ savitetyucyate Hariḥ*


*Since Lord Hari is the progenitor of all worlds, He is called Savitā.*


:: श्रीमद्रामायणे युद्धकाण्डे सप्तोत्तरशततमस्सर्गः (आदित्य हृदय स्तोत्रम्) ::


आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् ।


सुवर्णसदृशो भानुः हिरण्यरेता दिवाकरः ॥ १० ॥


Śrīmad Rāmāyaṇa Book 6, Chapter 107 (Āditya Hr‌daya Stotra)


Ādityaḥ savitā sūryaḥ khagaḥ pūṣā gabhastimān,


Suvarṇasadr‌śo bhānuḥ hiraṇyaretā divākaraḥ. 10.


*An off-spring of Aditi (आदित्यः/Ādityaḥ), the Progenitor of all (सविता/Savitā), Surya the sun-god and the Provocator of acts in people (सूर्यः/Sūryaḥ), the Courser in the sky (खगः/Khagaḥ), the Nourisher of all with rain (पूषा/Pūṣā), the One who illuminates the worlds (गभस्तिमान्/Gabhastimān), the Possessor of golden rays (सुवर्णसदृशः/Suvarṇasadr‌śaḥ), the Brilliant (भानुः/Bhānuḥ), having golden seed whose energy constitutes the seed of the universe  (हिरण्यरेताः/Hiraṇyaretāḥ) and the Maker of the day (दिवाकरः/Divākaraḥ).*


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka


भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥


భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥


Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥


Continues....


🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 556 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 556 - 3 🌹*


*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*


*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*


*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*


*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*


*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*


*🌻 556. ‘కాత్యాయనీ’ - 3 🌻*


*దేహేంద్రియముల యందాసక్తి కలవారు దేహమున బద్ధులై కటి ప్రదేశము పట్టును కోల్పోవుదురు. మితిమీరిన కోరికల వలన ఇంద్రియార్థముల యందు మానవ ప్రజ్ఞ బంధింపబడి బలమును కోల్పోవును. దేహమందు బంధింపబడును. సన్నని సౌకుమార్యమగు నడుము గల కాత్యాయనీ దేవిని నిత్యమారాధించుట వలన దేహము కొంత వశమగు అవకాశమున్నది. భూమి యందు శ్రీమాత తేజస్సు కాత్యాయనియే. భూమి బంధము నుండి విడిపించునది కూడ ఆమెయే. కాత్యాయనీ దేవి ఓడ్యాణపీఠమందు మిక్కిలి అభిమానము కలిగి యుండునని తెలియవలెను.*


*సశేషం...*


🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 556 - 3 🌹*


*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*


*✍️ Prasad Bharadwaj*


*🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini*


*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*


*🌻 556. 'Katyayani' - 3 🌻*


*Those who are attached to the body and senses become bound to the body and lose control over their waist area. Due to excessive desires, human wisdom gets entangled in sensory pleasures, leading to a loss of strength and becoming trapped within the body. By regularly worshiping Katyayani Devi, who has a delicate and slender waist, there is a possibility of gaining some control over the body. On Earth, Sri Mata’s radiance is manifest as Katyayani. She is also the one who liberates from the bondage of the Earth. It is important to know that Katyayani Devi is especially revered at the Odyana Peetham or waist area where a bejeweled belt is worn.*


*Continues...*


🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹


Comentários


bottom of page