top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 30 NOVEMBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 30 NOVEMBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀

1) 🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 5వ భాగం - జాగృత వ్యావహారిక స్థితి నుండి ఉన్నత చైతన్య స్థితిని అనుభూతించడమే అసలైన జీవన సాఫల్యత. 🌹

2) 🌹 Secrets of the Soul's Journey - Part 5 - Experiencing Higher Consciousness from the Waking State is the Real Success in Life 🌹

4) 🌹. కార్తిక పురాణం - 29 🌹

🌻. 29వ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము 🌻

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 7 🌹

🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 7 / 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 7 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 5వ భాగం - జాగృత వ్యావహారిక స్థితి నుండి ఉన్నత చైతన్య స్థితిని అనుభూతించడమే అసలైన జీవన సాఫల్యత. 🌹*

*ప్రసాద్ భరద్వాజ*


*ఆత్మ ప్రయాణ రహస్యాలు - 5వ భాగం వీడియోలో ప్రసాద్ భరద్వాజ గారు అసలైన ఆధ్యాత్మిక విజయాన్ని వివరిస్తున్నారు, అంటే సాధారణ జాగ్రత స్థితి నుండి ఉన్నత చైతన్య స్థితిని అనుభూతి చెందడం. ఈ ప్రయాణంలో, భయం, బద్ధకం, ఎడతెగని ఆలోచనలు వంటి అడ్డంకులను అధిగమించడం ముఖ్యమని వివరించారు. మహాభారతంలోని విదురుడు చెప్పిన ఆరు ప్రధాన దోషాలను జయించడం ద్వారా మన సత్యసాధనలో విజయాన్ని సాధించవచ్చు. ఈ వీడియోలో దైవ దర్శనం గురించి, చైతన్యం మరియు మనస్సు మధ్య తేడా వంటి విషయాలపై లోతైన అవగాహనను పొందండి. ఆధ్యాత్మిక ఆవగాహనను పెంపొందించు కోవడానికి ఈ పథాన్ని అనుసరించండి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 Secrets of the Soul's Journey - Part 5 - Experiencing Higher Consciousness from the Waking State is the Real Success in Life 🌹*

*Prasad Bharadwaj*


*In Secrets of the Soul's Journey - Part 5, Prassad Bharadwaj delves into the essence of spiritual success, which lies in transcending the ordinary waking state and experiencing a higher consciousness. This journey is about overcoming obstacles and refining one's inner self through spiritual discipline. Addressing common challenges like fear, laziness, and unending thoughts, Prassad Bharadwaj offers practical insights inspired by Vidura’s teachings in the Mahabharata. Learn to conquer these six major flaws to reach your ultimate spiritual goal. Additionally, this video discusses profound questions on divine vision and the distinction between consciousness and. the mind. Join us in exploring the path to spiritual awakening.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కార్తీక పురాణం - 29 🌹*

*🌻. 29వ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము 🌻*

*ప్రసాద్ భరద్వాజ*


అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.


ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.


మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్ధించి, సహాప౦క్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.


ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.


నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.


ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీ దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీ కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశ ఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.


ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి5 ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింప కూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.


ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.


ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రి౦శోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 577 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam  - 577 - 7 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*

*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*


*🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 7 🌻*


*'అ' నుండి 'క్ష' వరకు సృష్టి నిర్మాణము చేయు శ్రీమాత ఆ మొత్తము రూపముగ తానే యుండును. ఆమెయే అక్షరమాల. స్కందుని పుట్టించుటచే ఆమె మాతృక అయినది. శివ తత్వమును అవతరింప జేయుటతో శ్రీమాత మాతృక అయినదని తెలుపుదురు. అంతేకాక ఈ మాతృకా వర్ణముల సమూహమే శ్రీమాత శ్రీచక్ర రూపమని కూడ తెలుపుదురు. శ్రీ చక్ర మందలి బీజాక్షరములు, ఇతర అక్షరములు సృష్టి ప్రజ్ఞలుగ శ్రీమాత యేర్పడి యున్నది. సంస్కృతమున గల యాబది యొక్క అక్షరములు సృష్టి నిర్మాణ ప్రజ్ఞలు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 577 - 7 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*

*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*


*🌻 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 7 🌻*


*Śrī Māta, who creates the universe from "A" to "Kṣa," embodies this totality herself. She is the garland of letters, Akṣaramāla. She is called Mātr‌kā because she gave birth to Skanda. It is also said that Śrī Māta became Mātr‌kā by manifesting Śiva Tattva. Furthermore, it is explained that the collective Mātr‌kā letters themselves take the form of Śrī Māta's Śrī Chakra. The Bīja Akṣaras and other letters in the Śrī Chakra mandala represent the creative knowledge of Śrī Māta. The fifty Sanskrit letters are the manifestations of the creative wisdom behind creation.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹

Like, Subscribe and Share 👀

Comments


bottom of page