🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 172 / DAILY WISDOM - 172 🌹
🍀 📖 జ్ఞానం యొక్క కాంతి పుస్తకం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 20. ఒక బిందువుకి మరో బిందువుకి సంబంధం ఉందా? 🌻
మనం సంబంధాల గురించి చాలా ఆసువుగా మాట్లాడుకుంటున్నాం. అంటే నేను ఈ బల్లను తాకినప్పుడు నా వేలు ఆ బల్ల తో ఒక సంబంధం కలిగి ఉన్నట్లు. అప్పుడు అసలు ఈ స్పర్శ అంటే ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. అసలు నా వేలు నిజంగా ఆ బల్లతో ఒక సంబంధాన్ని కలిగి ఉందా? గొలుసులో ఒక లంకె ఇంకొక లంకెను తాకుతుందా? తాకుతుందనే అందరూ అనుకుంటారు. కానీ ఈ తాకడం అంటే ఏంటి? ఒక లంకె ఇంకొక లంకెలోకి చొచ్చుకుపోతుందా? లేదా రెండూ లంకెలూ విడివిడిగా బయటే ఉంటాయా? అవి నిజానికి బయటే ఉంటాయి.
ఈ రకమైన సంబంధంలో, విషయాలు ఒకదానికొకటి వెలుపలే ఉంటాయి. బహుశా ప్రపంచంలోని పెద్ద మొత్తంలో సంబంధాలు ఇలాగే ఉంటాయి. బిడ్డ తల్లికి సంబంధించినది కావచ్చు, కానీ అది తల్లిలోకి ప్రవేశించదు, లేదా తల్లి బిడ్డలోకి ప్రవేశించదు. అవి ఒకదానికొకటి వెలుపల ఉంటాయి. ఒకదానికొకటి ప్రత్యేకమైనవి, బిడ్డ తల్లికి దగ్గరగా ఉన్నప్పటికీ, అది తనలో విడదీయరాని భాగమని ఆమె భావిస్తుంది. అయినప్పటికీ, ఒక దానికి వెలుపల మరొకటి ఉంది. ప్రపంచంలోని చాలా సంబంధాలు ఇలాగే ఉంటాయి. అందుకే, విషయాలు ఒకదానికొకటి సంబంధించినవిగా అనిపించినప్పటికీ, కొన్నిసార్లు అవి ఒకదానికొకటి దూరంగా వెళ్తాయి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 172 🌹
🍀 📖 In the Light of Wisdom 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 20. Is there a Relation of One Link with Another Link? 🌻
We have been just glibly talking about relation. In this sense, when I touch this desk, my finger is supposed to be in relation with this desk. The question then becomes, what does ‘touch’ mean? Is my finger really in relation with this desk? Is a link in a chain really touching another link? We may say, “Yes, it is touching,” but what is this ‘touch’? Does one link enter into touch with another link? Is there a relation of one link with another link? In a chain, does one link enter into another link, or does it lie outside another link? It does not enter—it remains outside.
In a relation of this kind, which is perhaps the larger amount of relations in the world, the connected items lie outside each other. The child may be related to the mother, but it does not enter into the mother, or the mother does not enter into the child. They are outside each other and exclusive, even though the child may be so near the mother that she feels it as an inseparable part of herself. Yet, one is outside the other. This sort of exclusive relationship is the so-called relationship of most things in this world. That is why, though things seem to be related to one another, sometimes they depart from one another.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments