top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 183 : 1. Children are Like an Orb / నిత్య ప్రజ్ఞా సందేశములు - 183 : 1. పిల్లలు ఒక గోళ



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 183 / DAILY WISDOM - 183 🌹


🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 1. పిల్లలు ఒక గోళం వంటివారు 🌻


ఆధ్యాత్మిక మార్గంలో సత్యాన్వేషణ అనేది మహాభారతంలో కావ్య రూపంగా చెప్పబడింది. కృష్ణ ద్వైపాయన వ్యాసుని అద్భుత కలం ద్వారా విశ్వమంతా చిత్రించబడింది. మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ప్రతిదీ పాలు మరియు తేనెలా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆ పిల్లలకు అందరూ స్నేహితులే. పొరుగున ఉన్న శత్రు సమూహాలకు చెందిన పిల్లలు వారికి స్నేహితులే. తల్లిదండ్రులకు తేడా తెలిసినా పిల్లలకు తెలియదు. ఒక కుటుంబానికి చెందిన పిల్లలు మరో కుటుంబానికి చెందిన పిల్లలతో ఆడుకోవచ్చు, అయితే రెండు కుటుంబాలు తీవ్ర ప్రత్యర్థులు కావచ్చు.


పిల్లలకు ఈ విషయం తెలియకపోవచ్చు. అలాగే ఆత్మ యొక్క ప్రారంభ, అపరిపక్వ స్థితిలో ఇలాగే ఉంటుంది. తనలో ఇసుమంతైనా ఆధ్యాత్మికత లేనందువల్ల, అలాగే చుట్టూ ఉండే ప్రాపంచిక సుఖాల ముసుగులో పడి, ఈ ప్రపంచంలో పొందనిది అంటూ ఏమీ లేదు అనే భ్రమలో ఉంటుంది. భావోద్వేగాలు మరియు అవగాహనలు, మరియు తిరుగుబాట్లు అన్నీ కలిపి ఒక గోళముగా కలిసి ఉంటాయి. అంటే కొంచెం బంగారం, కొంచెం ఇనుము వంటివి కలిసి ఒకదాని నుండి మరొకటి వేరు చేయలేని పదార్థంగా ఉండవచ్చు. అలాగే పిల్లలలో, వారి సంస్కారాలు, వాసనలు, మానసిక స్థితులు వంటివి, అన్నీ కలిపి అంత సులభంగా విడిగా గుర్తించ బడలేనంతగా కలిసిపోయి ఒక మిశ్రమ పదార్థంగా ఉంటాయి.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹






🌹 DAILY WISDOM - 183 🌹


🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀


📝 Swami Krishnananda


📚. Prasad Bharadwaj


🌻 1. Children are Like an Orb 🌻


The search for truth by seekers on the spiritual path is a veritable epic, which is the subject of the poetic vision in the Mahabharata. The whole universe is portrayed by the masterly pen of Krishna Dvaipayana Vyasa. Everything looks like milk and honey in this world when we are babies, children—we are all friends. Children belonging even to inimical groups in the neighbourhood do not realise that they belong to such factions of society. Even if the parents know the difference, the children do not. The children of one family may play with the children of another family, while the two families may be bitter opponents.


The babies may not know this. Likewise is the condition of the soul in its incipient, immature, credulous waking. The spiritual bankruptcy and the material comforts combined together makes one feel that there is the glorious light of the sun shining everywhere during the day and the full moonlight at night, and there is nothing wanting in this world. The emotions and the periods of understanding and revolutions are all in the form of an orb, where there may be a little bit of gold, a little bit of iron—the one cannot be distinguished from the other. Children, in their psychological make-up, are like an orb—their components are not easily distinguishable.


Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page