top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 187 : 5. Life is a Mystery, and it is not Mathematics / నిత్య ప్రజ్ఞా సందేశములు - 187 : 5. జీవితం ఒక రహస్యం, అది గణితం కాదు



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 187 / DAILY WISDOM - 187 🌹


🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 5. జీవితం ఒక రహస్యం, అది గణితం కాదు 🌻


ఉత్తరకాశీలో మీరు మీ కడుపు నింపుకోలేరు. ఆకలిగొన్న కడుపుతో తిరిగి రిషికేష్ రావాలి. మీరు హమ్మయ్య, ఉత్తరకాశీకి వీడ్కోలు' అని అనుకుంటారు. మీరు తిరిగి వచ్చేస్తారు. ఇంతకు ముందు చాలా మంది ప్రయత్నించారు; వారు అక్కడ నివసించ లేక పోయారు, ఎందుకంటే మానవ స్వభావం చాలా క్లిష్టమైన నిర్మాణం. మీరు దానిని ఒక పావురంలా పంజరంలో ఉంచలేరు. ఇది అంత తేలిగ్గా అర్థం కాని అస్థిరమైన, అసాధ్యమైన జీవి. అంత సులభంగా నిర్వహించబడదు. మీరు ఉత్తరకాశీలో ఉండలేరు. అలాగని హాలీవుడ్‌లోనూ ఉండలేరు. మనలో ఉన్న అద్భుతమైన వైరుధ్యం కారణంగా ఏ ప్రదేశానికి వెళ్ళినా, అది విఫలమవుతుంది. ఈ వైరుధ్యం మన ఉనికి అంత అద్భుతంగానూ ఉంటుంది, ఎందుకంటే ఇది విశ్వం యొక్క రహస్యాన్ని సూక్ష్మ స్థాయిలో కలిగి ఉంటుంది.


కాబట్టి దీనిని గణిత లేదా శాస్త్రీయ పద్ధతిలో లేదా పూర్తిగా తర్కంతో బోధించలేరు. ఇది ఒక రహస్యం. జీవితం ఒక రహస్యం, అది గణితం కాదు. ఇది సమీకరణం కాదు. గణితంలో లాగా రెండు అంకెలు కూడితే ఇది వస్తుంది లాంటి సిద్ధాంతాలు ఆధ్యాత్మిక మార్గంలో చెల్లవు. ఇది చాలా కష్టమైన పని. ఇది శాస్త్రం కంటే ఇది ఒక కళ అని మనం అనవచ్చు. సరే, అసలు విషయానికి వస్తే, ఆధ్యాత్మిక సాధకుడికి ఎదురయ్యే ఈ కష్టం, అతను మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, పాండవుల కష్టాలను పోలి ఉంటుంది.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 187 🌹


🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 5. Life is a Mystery, and it is not Mathematics 🌻


In Uttarkashi you cannot get your stomach filled. You have to come back to Rishikesh with a hungry stomach. You say, “Thank God, goodbye to Uttarkashi.” You come back. People have tried; they cannot live there, because human nature is a very complex structure. You cannot simply tabulate it into pigeon holes. It is an un under standable, impossible organism, and cannot be easily handled. You cannot stay either in Uttarkashi or in Hollywood. Either place would be a failure due to the miraculous dissidence that is within us, as miraculous as we ourselves are, because it has an element of the mystery of the cosmos.


And so one cannot teach it in a mathematical or scientific manner, or purely in the light of logic. It is a mystery. Life is a mystery, and it is not mathematics. It is not an equation. We cannot say that this plus that is equal to that—that is not possible in spiritual sadhana. It is a very difficult task. It is an art rather than a science, we may say. Well, coming to the point, this difficulty that the spiritual seeker faces, as he advances on the path, is similar to the difficulties of the Pandavas.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page