top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 190 : 8. Om is the Cosmic Vibration / నిత్య ప్రజ్ఞా సందేశములు - 190 : 8. ఓం అనేది విశ్వ ప్రకంపన



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 190 / DAILY WISDOM - 190 🌹


🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 8. ఓం అనేది విశ్వ ప్రకంపన 🌻


ఓం శబ్దం అనడం కంటే ఒక కంపనం అనడమే సమంజసం. శబ్ధానికి మరియు కంపనానికి మధ్య వ్యత్యాసం ఉంది. శక్తికి శబ్దానికి కూడా వ్యత్యాసం ఉన్నట్లే, శబ్దానికి కంపనానికి మధ్య వ్యత్యాసం ఉంది. శక్తి శబ్దంలా వ్యక్తం అవగలదు. అలాగని రంగులా, రుచిలా, వాసనలా, ఇలా ఎలాగైనా వ్యక్తం అవగలదు. ఎలాగైతే విద్యుచ్ఛక్తి కదలికలా, వేడిలా, కాంతిలా వ్యక్తమవుతోందో, అలాగే మీరు చూసి విని, గ్రహించే ఈ భౌతిక శరీరాలు, పదార్థాలు, విశ్వంలోని సృజనాత్మతకు, సృష్టించే క్రియాశీలకమైన శక్తి యొక్క భౌతిక వ్యక్త రూపాలు. ఇదే భగవంతుని సంకల్ప శక్తి.


ఓం అనేది ఈ విశ్వ శక్తికి చిహ్నం. ఒక బిందువు నుండి అది అంతరిక్షం మరియు సమయాలలో ఈ విశ్వం యొక్క పరిమాణంలోకి విస్తరిస్తుంది. అది కేవలం రూపం లేని, ఊహించలేని, అతీంద్రియ శక్తి లేదా కంపనం నుండి, అది కళ్ళకు కనిపించేదిగా, ప్రత్యక్షమైనదిగా, తెలివైనదిగా, ఆలోచించ దగినదిగా మరియు సహేతుకమైనదిగా ఈ స్థూల విశ్వం మరియు మన స్వంత శరీరాలలో వ్యక్తం అవుతుంది. కాబట్టి ఓం అనే మంత్రం కేవలం పదం మాత్రమే కాదు, దాని కారణాలలో వ్యక్తిత్వాన్ని కరిగించడంలో మనస్సు యొక్క ప్రయత్నం కూడా.


కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 190 🌹


🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 8. Om is the Cosmic Vibration 🌻


Om is more a vibration than a sound. There is a difference between sound and vibration, just as energy is not the same as sound, because while energy can manifest itself as sound, it can also manifest itself as something else, such as colour, taste, smell, etc. Just as electric energy can manifest itself as locomotion, as heat, as light, etc., the various configurations in the form of bodies or things in this world are expressions locally of this universal vibration which is the cosmic impulse to create, the creativity or the will of God that is identified with a cosmic energy.


Om is the symbol of this cosmic force. From a single point it expands itself into the dimension of this universe in space and time, and from being merely an impersonal, unthinkable, supernatural power, energy or vibration, it becomes visible, tangible, sensible, thinkable and reasonable when it manifests itself as this gross universe and our own bodies. So the chant of Om is not merely a word, but also an effort of the mind in the dissolution of the personality in the causes thereof.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹





Comments


bottom of page