top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 234 : 21. Work Done as a Duty Alone can Purify / నిత్య ప్రజ్ఞా సందేశములు - 234 : 21. కర్తవ్యంగా చేసిన పని మాత్రమే శుద్ధి చేయగలదు




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 234 / DAILY WISDOM - 234 🌹


🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 21. కర్తవ్యంగా చేసిన పని మాత్రమే శుద్ధి చేయగలదు 🌻


మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు, మీరు మీలో ఒక ప్రశ్న వేసుకోవాలి: “ఆ పనిలో నిమగ్నమవ్వడానికి కారణం ఏమిటి? ఆ పని వెనుక ఏదో విపరీతమైన లేదా నిగూఢమైన ఉద్దేశం ఉన్నందుకా? లేక కేవలం స్వయం శుద్ధి కోసమే చేశారా? మీరు చేసిన ప్రతి పనిని మీరు ఒక ఉద్యోగంగా చేశారా లేదా మీ కర్తవ్యంగా చేశారా అనే విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తించాలి. ఒక కర్తవ్యం మీకు ప్రారంభంలోనే భౌతిక ప్రయోజనాన్ని తీసుకురాకపోవచ్చు, కానీ అది మీకు అదృశ్య ప్రయోజనాన్ని తెస్తుంది. అందుకే ప్రతిచోటా కర్తవ్యాన్ని ఎంతో ఆరాధిస్తారు మరియు మీ కర్తవ్యాన్ని మీరు తప్పక నిర్వర్తించండి అంటారు. వేతనంతో కూడిన ఉద్యోగం మాత్రమే కర్తవ్యం కంటే ముఖ్యమైతే, కర్తవ్యం యొక్క గొప్పదనాన్ని అంత చెప్పరు.


కర్తవ్యం చేయాలి అని అందరూ అంటారు; కానీ, ఈ కర్తవ్యం అంటే ఏమిటి? కర్తవ్యంగా చేసిన పని మాత్రమే శుద్ధి చేయగలదు; ఏ ఇతర పని స్వయం శుద్ధి కాదు. కర్తవ్యం మాత్రమే కర్మ యోగంగా పరిగణించబడుతుంది. కాబట్టి, వ్యక్తిత్వాన్ని శాసించి మరియు దానిని శుద్ధి చేసే ఈ కర్తవ్యం అంటే అసలు ఏంటి? క్లుప్తంగా దీనిని నిస్వార్థ చర్య అని చెప్పవచ్చు. ఇది వాస్తవికత లో చాల చిన్న భాగమైన మీ వ్యక్తిత్వానికి కాకుండా ఇంకా విస్తరించిన ఉన్నత తలాల వాస్తవికతకు పనిచేయడం.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 234 🌹


🍀 📖 from Lessons on the Upanishads 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 21. Work Done as a Duty Alone can Purify 🌻


When you do a work, you must put a question to yourself: “What is the reason behind engaging in that work? Is it because there is some extraneous or ulterior motive behind that work? Or is it done for mere self-purification? You must distinguish between work done as a job and work done as a duty. A duty may not apparently bring you a material benefit at the very outset, but it will bring you an invisible benefit. That is why duty is adored so much everywhere and people say you must do your duty. If duty is not so very important, but a remunerative job is the only thing that is important, then insistence on duty would be out of point.


Everybody says duty must be done; but, what is duty? Work done as a duty alone can purify; no other work can purify the self. It is not any kind of labour that can be regarded as karma yoga. So, what is this duty that we are talking of which is going to chasten the personality of the individual, and purify it? Briefly it can be called unselfish action. It is a work that you do for the benefit that may accrue to a larger dimension of reality, and not merely to the localised entity called your own individual self.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page