🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 235 / DAILY WISDOM - 235 🌹
🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 22. ఒకరి ఆవశ్యకత అందరికి కూడా ముఖ్యమైనది 🌻
మీరు ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు, ఈ సేవ ఎందుకు చేయబడుతుందో మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. సాధారణంగా అసలు కారణం తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే ఇది మీ లోతుల్లో ఉంటుంది. మీరు ప్రజల సేవ రూపంలో ఏదైనా పని చేసినప్పుడు మీకు సామాజిక కారణాలు, రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు మరియు కుటుంబపరమైన కారణాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక ఆధారితమైన సేవ అనేది సామాజిక కార్యం లేదా రాజకీయ కార్యకలాపం కాదు. దీనికి కుటుంబ పోషణతో కూడా సంబంధం లేదు. ఇది నిజానికి మీ స్వయానికి చేసే సేవ. అది ఎలా అవుతుంది? మీరు ఒక ప్రశ్న వేయవచ్చు: ప్రజల సేవ ఏ విధంగా మీ స్వయం పట్ల సేవ అవుతుంది?
కొద్ది సేపటి క్రితం నేను మాట్లాడిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. మీలో ఉన్నదే అందరిలోనూ ఉంది. కాబట్టి మీరు బయట చూసే వ్యక్తులు, ఈ మూడు లేదా నాలుగు పరిధుల ప్రపంచం కూడా, మీ స్వంత స్వచ్ఛమైన స్వయం యొక్క ఒక విస్తృత కోణం. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైన విషయం. చాలా జాగ్రత్తగా మరియు శ్రద్ధగా వినాలి. మీరు ఇతరులకు చేసే సేవ-కుక్కకు కూడా, మనుషులకే కాదు, చెట్టుకు జీవనోపాధి కోసం ఎరువును వేయడంతో సహా, ఏదైనా జీవిని సంరక్షించడం వంటివి- ఏ విధమైన నిగూఢమైన ఉద్దేశ్యంతో చేయకూడదు. ఆ జీవి మీకు వెలుపల ఉంది అనే భావంతో ముందే చేయకూడదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 235 🌹
🍀 📖 from Lessons on the Upanishads 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 22. One's Essential Being is also the Essential Being of Everybody Else 🌻
When you serve people, you are to always bear in mind the reason why this service is done at all. Mostly, the reason is buried underneath. You have social reasons, political reasons, economic reasons and family considerations when you do any work in the form of service of people. But service which is spiritually oriented is not a social work or a political activity, nor is it connected even with family maintenance. It is actually a service done to your own self. How is that so? You may put a question: In what way is the service of people, for instance, a service to you own self?
Remember the few words that I spoke a little while ago, that one's essential being is also the essential being of everybody else. So the people that you see outside, even the world of space-time, is a wider dimension of the selfhood which is your own pure subjectivity. This is a subject that is a little difficult to understand, and is to be listened to with great caution and care. The service that you render to others—even to a dog, let alone human beings, even feeding manure to a tree for its sustenance or taking care of anything whatsoever—is not to be done with any kind of ulterior motive, much less even the consideration that it is something outside you.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários