Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 2025
- Prasad Bharadwaj
- 3 days ago
- 2 min read

🌹 సర్వవ్యాపి అయిన వాసుదేవుడికి నమస్కరిస్తూ.. మీకు ముక్తిని, శాంతిని, జ్ఞానాన్ని, దైవిక రక్షణను ప్రసాదించాలని కోరుకుంటూ.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 Offering salutations to the all-pervading Vasudeva... wishing that He bestows upon you liberation, peace, knowledge, and divine protection... Happy Vaikuntha Ekadashi to all 🌹
Prasad Bharadwaj
🍀 ముక్కోటి ఏకాదశి - ఉత్తర ద్వారాన వైకుంఠనాథుడు. వైకుంఠ ఏకాదశి విశిష్టత. 🍀
🍀 Mukkoti Ekadashi - Lord Vaikunthanatha at the Northern Gate. The significance of Vaikuntha Ekadashi. 🍀
🌻 వైకుంఠం అంటే కుంఠములు లేని ప్రదేశం అని అర్థం. అంటే ఆందోళనలు, ఆత్రుతలు, ఆరాటాలు లేని ప్రదేశం అన్నమాట. అదే విష్ణుధామం. పరంధామం. 🌻
🙏 విష్ణు ప్రార్ధన 🙏
సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యమ్ ఋత సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నా
ధ్వాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితమ్
లోకనాధం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిమ్
పాతాంబరం నీలవర్ణం శ్రీ వత్సపద భూషితమ్
గోవిందం గోకులానందం బ్రహ్మేద్వైరభి పూజితమ్
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి - భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడట.
అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని, ఈ కారణంగానే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారని పెద్దలు చెబుతారు. ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించు కోవడం వలన మోక్షం లభిస్తుందని విశ్వాసం..
ఉత్తరాయన ప్రారంభదినం కావడం మూలాన ఇది అత్యంత విశిష్ఠమైనది. ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించింది. అప్పటి నుంచి మూసి ఉన్న స్వర్గ ద్వారాలు ఈ ధనుర్మాసారంభం నుంచి తెరుచుకుంటాయని పురాణ వచనం. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై ఉత్తరద్వారాన దర్శనమిస్తాడట. ఆ దివ్యసుందర రూపుని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివినుంచి భువికి దిగి వస్తారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు.
మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశినాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రి నుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఇవాళ ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం.
భౌతిక జగత్తుకు అతీతంగా ఉండే వైకుంఠ ధామం నుంచి శ్రీమహావిష్ణువు లోకంలోకి దిగి వస్తే, ఆ రూపాన్ని అవతారం అంటారు. ధర్మ సంస్థాపనార్థం, భక్తజన రక్షణార్థం ఆ దేవదేవుడు దిగి వస్తాడు..
🌿 అంతరార్థం 🌿
వైకుంఠ ఏకాదశి రోజున మనం గుడిలో 'ఉత్తర ద్వారం' నుండి వెళ్తాము. దీనికి ఒక అంతరార్థం ఉంది - ఉత్తరం అంటే ఏమిటి?: 'ఉత్' అంటే ఎత్తు, 'తర' అంటే మరీ ఎత్తు. మన శరీరంలో అన్నిటికంటే ఎత్తైన భాగం తల (శిరస్సు). ద్వారం అంటే ఏమిటి?: మన తల లోపల (బ్రహ్మరంధ్రం వద్ద) ఒక అదృశ్య ద్వారం ఉంది. సాధారణంగా గుడి తలుపులకు రెండు రెక్కలు ఉన్నట్టే, అక్కడ కూడా ఒక ద్వారం ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది.
గుడిలో ఉత్తర ద్వారం గుండా వెళ్లి దేవుడిని ఎలా చూస్తామో, అలాగే యోగసాధన ద్వారా మన శరీరంలోని 'ఉత్తర ద్వారం' (బ్రహ్మరంధ్రం) తెరుచుకున్నప్పుడు, మన లోపలే ఉన్న పరమాత్మను దర్శించుకోవచ్చు. ఈ గొప్ప విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి యొక్క అసలు ఉద్దేశం.
🙏 వైకుంఠ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువును వివిధ శ్లోకాలతో పూజిస్తే ఎంతో శుభప్రదం ! 🙏
దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యతః కరే
చక్రమూర్ధ్వకరే వామం గదా తస్యాన్యతః కరే
దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం
క్షీరాబ్ధిశయనం ధ్యాయేత్ నారాయణం ప్రభుమ్
ఓం శ్రీ తులసీ ధాత్రీ సమేత లక్ష్మీ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః ధ్యాయామి
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹



Comments