top of page

ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత తెలుసుకోండి! ఉత్పన్న ఏకాదశి, ఏకాదశి తిథి జయంతి శుభాకాంక్షలు Greetings on Utpanna Ekadashi and Ekadashi Tithi Jayanti.

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 2 hours ago
  • 2 min read
ree

🌹 ఉత్పన్న ఏకాదశి పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి! ఉత్పన్న ఏకాదశి, ఏకాదశి తిథి జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Learn about the Utpanna Ekadashi worship procedure and its significance! Greetings to everyone on the Utpanna Ekadashi, Ekadashi Tithi Jayanti 🌹

Prasad Bharadwaj



కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు.


ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరుపెట్టాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి కూడా విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒక స్వరూపమే. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు.


ఈరోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ వచనం. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు పరిహారమవుతాయి. ముర అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారు తమలోని మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు.


🌻 ఉత్పన్న ఏకాదశి 2025 🌻


ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న వచ్చింది. ఏకాదశి తిథి నవంబర్ 14 రాత్రి 12:49కి ప్రారంభమై, నవంబర్ 15 తెల్లవారుజామున 2:37కి ముగుస్తుంది.ఈ లెక్కన నవంబర్ 15న జరుపుకోవాలి. ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించాలి. పురాణాలలో ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. అయితే, ఈ ఏడాది వచ్చే ఈ ఉత్పన్న ఏకాదశి మరింత ప్రాముఖ్యతను కలిగింది.


ఈ ఏకాదశి నాడు పూర్వాషాఢ నక్షత్రం, విష్కంభ యోగం, అభిజిత్ ముహూర్తం కలయిక ఉండడం, పైగా ఈసారి శనివారం రావడం మరో విశేషం. శనివారం నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేసి, తులసి దళాలు, తీయటి ఆహార పదార్థాలు సమర్పిస్తే మంచిది.


🪔 నువ్వుల నూనెతో దీపారాధన 🪔


శనివారం రావడం వలన శని దేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి, కోరికలన్నీ తీరుతాయి.


🍀 ఉత్పన్న ఏకాదశి పూజా విధానం 🍀


ఉత్పన్న ఏకాదశి పూజా విధానం గురించి చూస్తే.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని, విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోని పెట్టి దీపారాధన చేయండి.

ఆ తర్వాత గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి, ఐదు రకాల పండ్లు నైవేద్యంగా పెట్టండి.

దీంతో పాటుగా తులసి మొక్క ముందు దీపారాధన చేయండి.


ఉపవాసం ఉండడం వలన సకల సంపదలు కలుగుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సకల పాపాలు తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. లక్ష్మీదేవి, విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు.


ఈ ఏకాదశి నాడు దానధర్మాలు చేస్తే మరింత ఎక్కువ పుణ్యం వస్తుంది. జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.

🌹🌹🌹🌹🌹






Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page