🌹 ఏకాదశి తిథి జయంతి - ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు.
ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరుపెట్టాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి కూడా విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒక స్వరూపమే. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు.
ఈరోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ వచనం. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు పరిహారమవుతాయి. ముర అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారు తమలోని మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు.
🌹🌹🌹🌹🌹
Comments