top of page

కాలభైరవ అష్టమి జయంతి / బుధాష్టమి శుభాకాంక్షలు Greetings on Kala Bhairava Ashtami Jayanti / Bhudhashtami

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 2 days ago
  • 2 min read
ree


🌹 కాలభైరవ అష్టమి జయంతి / బుధాష్టమి శుభాకాంక్షలు అందరికి

Kala Bhairava Ashtami Jayanti / Bhudhashtami Greetings to All 🌹


🍀 కాలభైరవ జయంతి విశిష్టత 🍀

ప్రసాద్ భరద్వాజ


🍀 Special features of Kalabhairava Jayanti 🍀

Prasad Bharadwaja


కాలభైరవుని జయంతిని కార్తీక మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. భైరవ భక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున శివుడు కాల భైరవుడి రూపంలో అవతరించి అధర్మం, అహంకారాన్ని నాశనం చేశాడు. దీనిని భైరవ అష్టమి, కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు. కాలభైరవ దేవాలయాల్లో పూజలు చేస్తారు.


కాలభైరవుని జయంతిని కార్తీక మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. భైరవ భక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున శివుడు కాల భైరవుడి రూపంలో అవతరించి అధర్మం, అహంకారాన్ని నాశనం చేశాడు. దీనిని భైరవ అష్టమి, కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున, కాలభైరవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. భైరవ చాలీసా, రాత్రి మేల్కొలుపు నిర్వహిస్తారు.


కాలభైరవుణ్ణి ఆరాధించడం వల్ల భయం, వ్యాధి, అకాల మరణం, వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. కాల భైరవుడిని ఆరాధిస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవితంలో విజయాన్ని పొందుతాడు. కాలభైరవుడుని ఆరాధిస్తే రాహువు, కేతువు, శని గ్రహాల లోపాలను శాంతింపజేస్తుంది. ఈ రోజున భక్తులు ఆవ నూనెతో దీపం వెలిగించి, నల్ల ధాన్యాలు మరియు నల్ల నువ్వులను సమర్పిస్తారు.


కాలభైరవ జయంతి పూజా విధానం:


ఆలయం లేదా ఇంటి పూజ గదిలో కాలభైరవుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆవ నూనెతో దీపారాధన చేయాలి.

భైరవ చాలీసా లేదా "ఓం భైరవాయ నమః" మంత్రాన్ని 108 సార్లు జపించండి. భైరవుడుకి నల్ల నువ్వులు, మినపప్పు, నూనె, కొబ్బరికాయని సమర్పించండి. రాత్రిపూట మేల్కొని భైరవ మంత్రాలను పఠించవచ్చు.


ఓం భైరవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో భయం, ప్రతికూలత, అడ్డంకులను తొలగిస్తుంది.


బుధుని అధిష్టాన దైవం "శ్రీ మహా విష్ణువు".


బుధుని అనుగ్రహం కొరకు స్మరించవలసిన మంత్రాలు.

1. ఓం బుధాయ నమః ||

2. ఓం విష్ణవే నమః ||


బుధుని అనుగ్రహం కొరకు బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించండి.  శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించండి.


బుధ గ్రహ బలం కొరకు, బుధవారం ఆకు పచ్చ రంగు దుస్తులు ధరించండి.  బుధవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే,  అన్ని రకాల విశేషమైన ప్రయోజనాలు కలుగుతుంది.

🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page