06.10.24 ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత మరియు రాజరాజేశ్వరి) రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు.
త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.
అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో
ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.
స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడు తుంది.
సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.
పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడు తుంది.
కదంబవృక్షములు (కమిడి చెట్లు)వనముందు నివసించునదీ , ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది , పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ , దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ , తొలకరిమబ్బు వలే నల్లనైనదీ , మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరి.
పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ !
పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ , విల్లు , పాశాంకుసాలను ధరించిన రూపంలో , కుడివైపున సరస్వతి దేవి , ఎడమవైపున లక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా , లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది.
దారిద్రయ దుఖాలను తొలగించి , సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది.
ఈమే శ్రీ విద్యా స్వరూపిణి. సృష్టి , స్తితి , సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
శ్రీచక్ర ఆరధన. కుంకుమ అర్చన , లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి.
శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.
ఇఛ్ఛా శక్తి : వామాదేవి , బ్రహ్మ యొక్క దేవేరి
జ్ఞాన శక్తి : జ్యేష్ఠాదేవి , విష్ణువు యొక్క దేవేరి
క్రియా శక్తి : రౌద్రి , శివుడు యొక్క దేవేరి
ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే
లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి , స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు.
మోక్ష దాయకాలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదవేదాంగపారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి , కామక్షి దేవిని పూజించాడు. అనేక సంవత్సరములు తపస్సు చేసాడు.
అప్పుడు శ్రీ మహా విష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఎమి కొరిక అని అడగగా , మహర్షి ఆయ్నకు నమస్కరించి "పామరులైన ఈ మానవులు అందరికి మోక్షాన్ని పొందతానికి సులభమైన మార్గము ఎదైన ఉంటే , దానిని తెలియచెయ్యవల్సిందిగా ,లోక కల్యాణార్ధం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు.
దానికి హయగ్రీవుడు "మానవులకు భుక్తిని , ముక్తిని , దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి , లలితా పరాశక్తి మాత్రమే" అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగ తెలియచేసాడు.
అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను , పరమకీరతకుదను వధించే ఘట్టంలో దేవతలు అందరు అమ్మని ప్రార్థన చెయ్యగా , వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభుతిగా అమ్మ ఆవిర్భవించింది.
భండాసురుదిని వధించటం కోసమే , సమస్త లోకాలను , దేవజాతులను , ప్రకృతిని , ప్రాణకొటిని, వస్తుజాలాన్ని , మరల సృష్టించటం , సమ్రక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము , ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి వలే ప్రకాసించింది.
అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి ! అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుదిని వధించే కార్యం లో , అద్భుతమైన ఆస్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు "కరాంగూళి నఖోత్పన్న నారయణ దశాకృతి " అనే నామం ఏర్పడింది.
అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం , లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
06.10.24 శ్రీశైలంలో కూష్మాండా దుర్గా అలంకరణ
💙💙💙💙💙💙💙💙💙💙💙💙
కూష్మాండా దుర్గా , నవదుర్గల్లో నాలుగో అవతారం. నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. "కు" అంటే చిన్న , "ఊష్మ" అంటే శక్తి , "అండా" అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్ధం.
ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం , ఐశ్వర్యం , శక్తీ లభిస్తాయని భక్తుల విశ్వాసం.
రూపం
కుష్మాండా దుర్గా దేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం , ఖడ్గం, గద,పాశం, ధనువు బాణాలు , ఒక తేనె భాండం , ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి - సింహం.
విశ్వ ఆవిర్భావం
ఈ విశ్వం లేనప్పుడు , అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి, తన చిరు నవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగును ఇచ్చింది కుష్మాండా దుర్గాదేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవీ పురాణం.
త్రిమూర్తులు , త్రిమాతల సృష్టి
మహాకాళీ
కుష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి పది తలలు , పది చేతులు , పది కాళ్ళు , 30 కళ్ళు , 30 చేతి వేళ్ళు , 30 కాలి వేళ్ళు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో , నాలుకలు బయట పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు , తన 10 నాలుకలను కొరుకు తున్నట్టుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం , త్రిశూలం , చక్రం , బాణం , డాలు , తెంచిన రాక్షసుని తల , పుర్రె , నత్త గుల్ల , ధనువు , కర్ర ధరించి ఉంటుంది కాళీ. కూష్మాండా దేవి ఈమెకు మహాకాళీ అని పేరు పెట్టింది.
మహాలక్ష్మి
కుష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భ వించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు , కవచం , కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి , త్రిశూలం , చక్రం , గద , పిడుగు , బాణం , ఖడ్గం , కమలం , జపమాల , నత్తగుల్ల , ఘంట , ఉచ్చు , బల్లెం , కొరడా , ధనువు , డాలు , మధుకలశం , నీటిపాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి , గట్టిగా గర్జించిందిట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండా దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది.
మహాసరస్వతి
కుష్మాండాదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి , తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. తెల్లటి బట్టలు కట్టుకుని , తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం , చక్రం , చిన్న ఢమరుకం , నత్తగుల్ల , ఘంట , విల్లు , నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది. కుష్మాండాదేవి ఆమెను మహా సరస్వతి అని పిలిచింది.
శక్తి
కుష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే , ఆమె నుండి ఒక స్త్రీ , పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు , 15 కళ్ళు , 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి , జింక , బాణం , ధనువు , త్రిశూలం , పిడుగు , కపాలం , ఢమరుకం , జపమాల , కమండలం ఉన్నాయి. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి , నాలుగు చేతుల్లో పాశం , జపమాల పుస్తకం , కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. ఇలా కలసి పుట్టిన శివుడు , శక్తి(సరస్వతీదేవి)లు అన్నాచెల్లెళ్ళు అని అంటారు.
బ్రహ్మ , లక్ష్మీ
కుష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ , ఒక పురుషుడు వచ్చారు. నాలుగు ముఖాలతో , నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామరపువ్వు , పుస్తకం , జపమాల , కలశం పట్టుకుని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా , లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామరమొగ్గలు , కింద రెండు చేతులూ అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది అమె. కుష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.
ధ్యాన శ్లోకం
"సురాసంపూర్ణ కలశం రుధిరప్లుత మేవ చ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభమస్తు మే"
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
06.10.24 బతుకమ్మ పండుగలో 'అట్ల బతుకమ్మ'
🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴
బతుకమ్మ పండుగలో అయిదో రోజు జరుపుకునే వేడుకను 'అట్ల బతుకమ్మ' అంటారు. ఈరోజు తంగేడు , గునుగు , చామంతి , మందార , గుమ్మడి పూలను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను తయారుచేసి ఆరాధిస్తారు. ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడతారు. ఆడపడచులంతా సాయంత్రం బతుకమ్మ ఆడి , పాడి నీటిలో వదిలి ఆ తర్వాత చేసిన ప్రసాదాన్ని అందరూ కలిసి తీసుకుంటారు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
תגובות