top of page

జీవుల కర్మఫలప్రధాత - శనీశ్వరుడు / The Bestower of the Fruits of Karma - Lord Shani

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 3 days ago
  • 3 min read
ree

🌹 జీవుల కర్మఫలప్రధాత - శనీశ్వరుడు 🌹

The Bestower of the Fruits of Karma - Lord Shani


కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. దీనిని అందజేసేది శనీశ్వరుడు

According to the theory of karma, a person must inevitably experience the consequences of their actions. Good deeds yield good results, and bad deeds yield bad results. This is administered by Lord Shani.



భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు


ఒడిదొడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు.


సూర్యభగవానుడు, ఛాయా సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ అంటారు.


నవ గ్రహాల్లో కీలకమైన శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది. అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు.


అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. అయితే, శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.


స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటివారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడి.. ‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అని అన్నాడు.


ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు. 'నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’ అని చెప్పిన శని.. పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానని అన్నాడు.శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థంకాక, మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.


మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసిన శివుడు ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు. దీనికి శని 'ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు. శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు.. ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరఢవిల్లుతావని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.


శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం,

ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరం


అర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనీశ్వరా! నీకు నమస్కారము.


ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒకవారాన్ని, ఒక హోరాకాలన్ని ,కొన్ని ప్రీతికర వస్తువులని పెద్దలు నిర్దేశించారు. ఆయా సమయాలలో ఆయాగ్రహాలకి పూజ చేసినా దానం ఇచ్చినా జపంచేసినా ఆయా గ్రహాలా పీడ పరిహరించ తగ్గుతుంది.

అలాగే శని గ్రహానికి కూడా కొన్ని చెప్పబడ్డాయి.


శనికి త్రయోదశి తిథి, శనిహోరాకాలం, తిలాతైలాదుల దానం, ఇలాంటివి చెప్పబడ్డాయి.


శనిపీడాఫలాలు


డబ్బు దుబారా, అపనింద, నపుంసకత్వం, మాటవిలువ తగ్గటం,జీర్ణ సంబంధరోగాలు, వెన్నినొప్పు, పొట్టరావడం, కొవ్వుబద్దకం, అలసట, అతినిద్ర, పైవారిఒత్తిడి, నీచస్త్రీపురుషులతో సాంగత్యం, వ్యసనాల అలవాటుపడటం, ఉద్యోగం పోవటం, ఉద్యోగం దొరకకపోవటం, అందం తగ్గటం, వంటివి ముఖ్య ఫలాలు.

ఈసారి విశేషంగా ఒకే నెలలో రెండుసార్లు శనిత్రయోదశి వచ్చింది.


శనివారం రోజు పుణ్యకాలం,


ప్రతీ శనివారం శని హోరాకాలలలో చేస్తేమంచిది. ఉదయం 6-7మధ్యకాలం, మధ్యాహ్నం 1-2 మధ్యకాలం, రాత్రి 8-9 మధ్యకాలంమంచిది. ఐతే శనిత్రయోదశి నాడు రోజంతా పుణ్యకాలమే.


శనిత్రయోదశి నాడు మనం చేయదగ్గవి


నూనె ఒంటికి అంటుకొని, తలస్నానంచేయడం, ప్రాణాయమం చేయడం, శనికోసం చెప్పిన మంత్రాలు, శ్లోకాలు చదవటం. ఉపవాసం.


శనికి చేయదగ్గ పూజలు


శనికి తైలాభిశేకం, శనికిరుద్రాభిశేకం, నవగ్రహాలలో శనికి అష్టోత్తరనామాలు చదువుతూ పూలతో పూజించడం. శని ప్రదక్షిణలు చేయడం.


చదవదగ్గవి


శని అష్టోత్తర శతనామాలు, దశరథకృత శనిస్తోత్రం, విష్ణు సహస్రనామస్తోత్రం, శివపురాణం నలున్ని శని పీడించిన కథ మంచివి.

శనికి ప్రీతిగా ఇవ్వదగ్గదానాలు

నువ్వులు, నువ్వుల ఉండలు, అన్నిరకాల నూనెలు నీలంరంగు పంచెలు (శని ఆలయ అర్చకులు కు) ఇనుప వస్తువులు, పనివారికి, యాచకులకి - పాతబట్టలు దానంచేయాలి. నేరేడు పండ్లు, సిమెంట్‌ ఇనుము వంటివి, తగినవారికి తగినరీతిలో శక్తి వంచన లేకుండా చేయడం మంచిది.


శనికి సంబంధించి శాంతి చేసుకోవలసినవారు


మామూలుగా సింహం ధనుస్సు, కుంభ, మీనా, మేష రాశులవారు చేసుకోవాలి. విశేషంగా జాతకంలో శని పాప సంబంధంగా ఉన్నవారు, పాప స్థానాలలో ఉండేవారు, శనిదశ నడుస్తున్నవారు, చేయాలి.

🌹 🌹 🌹 🌹 🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page