top of page
Writer's picturePrasad Bharadwaj

దైవమే శరణ్యం / God is Refuge



🌹 దైవమే శరణ్యం / God is Refuge 🌹


ప్రసాద్‌ భరధ్వాజ


భగవంతుని సృష్టిలో ఆలోచించే శక్తి, విచక్షణా జ్ఞానం, నవ్వగలిగే అదృష్టం మనిషికే ఉన్నాయి. మనిషిగా పుట్టడమే ఒక వరం. కనుమూసి తెరిచేలోగా ముగిసే ఈ అపురూపమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సత్కర్మలతో ఉదాత్తమైన ఆలోచనతో మనుగడ సాగించడం మంచిది. అయితే తనని సృష్టించిన విధాతను విస్మరించి విడనాడి తాను విశ్వవిజేతనని, అంతా తన గొప్పేనని విర్రవీగడం మనిషకి తగదు.


విజ్ఞానపరంగా మనిషి ఎంత ఎదిగినా, ఒదిగి ఉంటేనే మంచిది. ఎన్ని మహత్తర విజయాలు సాధించినా మనిషి మర్యుడే! మృత్యువు తప్పదని తెలిసిని ఎగిసిపడుతున్న మనిషి అమరుడైతే ఎలా ఉంటుంది? మనిషి తను చేస్తున్న ప్రతి పని తన ఘనతే అనుకుంటాడు. కానీ భగవంత్సంకల్పం లేనిదే ఏదీ జరగదనే సత్యాన్ని గ్రహించాలి. మానవశక్తి వెనుక ఓ అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తే దైవం. ఆ దైవాన్ని స్మరించడం మనిషి కర్తవ్య. అదే ఆయన పట్ల మనం చూపే విశ్వాసం. మనిషి జగత్తునే శాసించగల స్థాయికి ఎదిగాడంటే అది భగవంతుని కరుణాకటాక్షమే గదా!


మనిషి జీవితం అశాశ్వతమని, తాను విధి చేతిలో కీలుబొమ్మననే నిజాన్ని మరచి భ్రమలో బతుకుతూ తనకి జన్మనొసగిన దైవాన్ని కాదని ఆ పరాత్పరుని ఉనికినే ప్రశ్నిస్తూ అహంకార దర్పంతో మిడిసిపడటం గర్హనీయం. ఈ జీవితం నీటి బుడగ అని గ్రహించి కర్తవ్యాన్ని నర్విహిస్తూ లభ్యమైన అరుదైన మానవ జన్మను సార్ధకం చేసుకోవడం వివేకవంతుల లక్షణం. అయితే ఈ జన్మలో అంతర్యాన్ని అంతరార్ధాన్ని అవగతం చేసుకున్న వారు జీవితాసారాన్ని అవగాహన చేసుకున్న జ్ఞానులు జన్మరాహిత్యాన్నే కోరుకుంటారు.


🌹🌹🌹🌹🌹





🌹 God is Refuge 🌹


✍️ Prasad Bharadwaj


In God's creation, man has the power to think, discernment and the ability to laugh. Being born as a human being is a blessing. Make the most of this incredible life that ends in the blink of an eye. It is better to survive with good deeds and noble thinking. But it is not proper for a man to ignore the manner in which he was created and boast that he is the conqueror of the universe and that everything is his greatness.


Scientifically, no matter how much a man grows up, it is good. No matter how many great achievements, a man is noble! What if a man who is flying knowing that death is inevitable is immortal? A man thinks that everything he does is his own merit. But one must realize the truth that nothing happens without God's will. There is an invisible force behind human power. That power is divine. It is man's duty to remember that God. That is the faith we show in Him. It is God's mercy that man can rise to rule the world!


Man's life is impermanent, forgetting the fact that he is a puppet in the hands of fate and living in illusion, questioning the existence of that god who gave birth to him and not the existence of that paratha, it is heartening to blink with the mirror of pride. Realizing that this life is a bubble of water, fulfilling one's duty and making use of the rare human birth available is the characteristic of the wise. But those who have understood the inner meaning of this birth, the wise who have understood the essence of life, seek birthlessness.


Comments


bottom of page