top of page
Writer's picturePrasad Bharadwaj

నిత్య ప్రజ్ఞా సందేశములు - 167 : 15. తెరలు తెరలుగా ఉన్న . . . / DAILY WISDOM - 167 : 15. Layers and L


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 167 / DAILY WISDOM - 167 🌹


🍀 📖 జ్ఞానం యొక్క కాంతి పుస్తకం నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 15. తెరలు తెరలుగా ఉన్న స్వీయ పొరలు నిజమైన ఆత్మను కప్పివేస్తున్నాయి 🌻


కొన్నిసార్లు మనం ఒక సంఘానికి చెందినవారమై ఉంటాము. దానితో మనల్ని మనం గుర్తించుకుంటాము. మనం అలా దాని గురించి పదే పదే మాట్లాడడం వల్ల మనం ఆ సంఘంలో భాగం అనే ఆలోచనని సైతం అంత తేలిగ్గా వదిలి పెట్టలేము. 'నేను హిందువుని, మహారాష్ట్రీయుడిని, నేను ఇది, నేను అది.' ఇవి మన సామూహిక స్వయాలు. అలాగే మనకు కుటుంబ స్వయాలు కూడా ఉన్నాయి. మనకు ఇంటిపేర్లు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఈ ఇంటిపేరు జతచేయబడుతుంది. ఇది ఒక కుటుంబ వారసత్వం. అలాగే “నేను న్యాయమూర్తిని, ఉపాధ్యాయుడిని, వ్యాపారవేత్తను, ప్రొఫెసర్‌ని” అనే వ్యక్తిగత స్వయాలు కూడా ఉన్నాయి.


ఇవి కూడా స్వయాలే. కానీ ఇవి మనం సృష్టించుకున్నవి. అవి సత్యం కానివి. సామాజికంగా కూడా మనం ఇలాంటి అసత్య స్వయాలను సృష్టించుకున్నాము. లోపలి సమస్యలు సరిపోవన్నట్లుగా బయట నుంచి వీటన్నింటిని జోడించి అదనపు సమస్యలు సృష్టించుకున్నాము. లోపలికి కూడా ఇలా చాలా పొరలు ఉన్నాయి కానీ నేను ఈ లోపలి పొరలను గురించి తరువాత చెబుతాను. ఇలా అనేకమైన స్వయం యొక్క పొరలు నిజమైన స్వయాన్ని కప్పివేస్తున్నాయి. మేఘాల పొరలు సూర్యుడిని చీకటిగా మార్చినట్లుగా, తప్పుడు స్వీయ పొరలు మన నిజస్వరూపాలను చీకటి, గందరగోళం తద్వారా దుఃఖాన్ని కలిగిస్తాయి.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 167 🌹


🍀 📖 In the Light of Wisdom 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 15. Layers and Layers of Self are Covering the True Self 🌻


Sometimes we belong to a community and we begin to associate ourselves with that. We talk about it again and again, and we cannot so easily extricate ourselves from the idea that we ourselves are a part of that community. “I am a Hindu, a Maharashtrian, I am this, I am that.” These are the communal selves, but then we have the family selves. We have got family names which are called ‘surnames’, and to each person a surname is attached. It is a family heritage. Then come the personal associations of “I am a judge, a teacher, a businessman, a professor”.


These are also selves we have created, but they are false selves. Socially also we have created these false selves. As if the inner problems are not sufficient, we have created additional problems by adding all these from outside. Inwardly there are also many layers, and I shall touch upon these inner layers a little later on. Layers and layers of self are covering the true self. Like layers of clouds can make the sun dark, layers of the false self have made our true selves a mass of darkness, confusion and therefore unhappiness.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page