top of page

పూర్వజన్మ పాపపుణ్యాలు - Past Life Sins

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • May 26
  • 3 min read

🌹 పూర్వజన్మ పాపపుణ్యాలు 🌹


మాస్టర్, లోకంలో ఉన్నవాళ్ళని, లేనివాళ్ళని చూస్తున్నాం. స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్న వాళ్లని, కూటికి కూడా నోచుకోని వాళ్ళని చూస్తున్నాం. ఈ తరతమ భేదాలకు వారు పూర్వజన్మలో ఆచరించిన పాపపుణ్యాలే కారణమని మనవాళ్ళు అంటూ వుంటారు. ఈ నమ్మకం నిజమేనా? ఆర్థికమైన అసమానతలకు పూర్వజన్మ పాపపుణ్యాలే కారణమా?


ఆర్థికములైన ఎక్కువ తక్కువలు జన్మ కారణాలుగా వుండటానికి ధనంతో అతడు వ్యవహరించిన వైఖరి యొక్క సంస్కారమే కారణంగాని, పాపపుణ్యాలు కావు. పాప పుణ్యాలు సంస్కారాలుగా, వచ్చే జన్మలో కలిగించేది దుఃఖాన్ని, సుఖాన్ని మాత్రమే గాని నిర్ధనత్వాన్ని, సంపదని కాదు. ధనానికి, సుఖానికి సంబంధం ఎలా లేదో, నిర్ధనత్వానికి, దుఃఖానికి కూడ అలాగే సంబంధం లేదు. లక్షలు ఉండి, దిగుళ్ళతో ఏడ్చేవాళ్ళు, భార్యాభర్తలు మాట్లాడుకోనివాళ్ళు, తండ్రీ కొడుకులు ద్వేషించు కునేవాళ్ళు వున్నారు. ఏ రోజు తిండికి ఆ రోజు పనిచేసి సంపాదించి ధైర్యంతో, సంతోషంతో, నిత్యతృప్తితో బ్రతికేవాళ్ళు ఉన్నారు. గంజితాగి గడిపిన పూటకూడా సీతారాములు లాగ జీవించే దంపతులున్నారు. గోచీ పెట్టుకొని ఆకులలములు భోంచేస్తూ దేనినీ లెక్కచేయకుండా జీవించేవాళ్ళూ వున్నారు. కనుక సుఖ దుఃఖాలకి, ఆస్తి అంతస్తులకి సంబంధం లేదు. పూర్వ జన్మలలో పుణ్యకర్మలు సుఖాన్నిస్తాయి గాని ఆస్తి నివ్వవు. అలాగే పాప కర్మలు దుఃఖాన్నిస్తాయి గాని నిర్ధనత్వాన్ని కలిగించవు. ఇంకొకడికి పెట్టకుండా సుఖాలనుభవించే ధనికుడు తినడానికి నోచుకోని అజీర్ణ వ్యాధులతో పుడతాడు గాని, నిర్ధనుడుగా పుట్టనక్కరలేదు. నిరంతర దానాలు చేసినవాడికి భోజనాది సౌకర్యాలు అప్రయత్నంగా సమకూరుతాయిగాని ధనికుడు కానక్కరలేదు. ఇక సంపద, నిర్ధనత్వము దేనివల్ల కలుగుతాయి? అనే ప్రశ్నకి నేర్పరితనంవల్ల మాత్రమే కలుగుతాయి అని సమాధానం. ఆ నేర్పరితనం సత్కర్మ సంస్కారంతో కూడినదైతే సంపద నార్జించే సామర్థ్యం వస్తుంది. దుష్కర్మ సంస్కారంతో కూడినదైతే అన్యాయంగా సంపద నార్జించే సామర్థ్యం వస్తుంది. అలాగే జూదము, పానము, వ్యభిచారము మొదలైన మార్గాలలో దుర్వ్యయము చేసినవాడికి కలిగే సంస్కారం ఈ జన్మలో దారిద్ర్యాన్ని కలిగిస్తుంది. కనుకనే నిత్యదరిద్రుడికి నిరంతర ధన సహాయం చేసినా దగ్ధం చేసుకుంటాడే గాని అనుభవించలేడు. అప్పులు యిచ్చి వడ్డీల కాశించి తిరిగి రాబట్టు కోకుండా చనిపోయినవాడు ఆ సంస్కారంవల్ల కలిగిన గర్భాత్రంతో అప్పులు చేస్తూ జీవిస్తాడు. వాడి అప్పులు తీర్చినా మళ్ళీ చేస్తూనే వుంటాడు. అప్పులు తీసుకుని అశక్తతతో కాక, దుర్బుద్ధితో ఎగ్గొట్టినవాడు ఆ సంస్కారంలో వడ్డీల కాశించి అప్పులిచ్చి దెబ్బ తింటాడు. ఈ ఆస్తిపాస్తుల లోకాలకి, సుఖానుభవానికి ఏ విధమైన సంబంధమూ లేదు. డబ్బు విషయంలో నిస్సహాయులను భయ పెట్టి లౌక్యంతో జీవించినవాడు ధనాన్ని విశేషంగా కూడబెట్టే నేర్పరితనంతో పుట్టి ఆ కూడబెట్టిన దాన్ని గూర్చి జీవితమంతా భయంతో గడగడలాడుతూ జీవిస్తాడు. - మాస్టర్ ఇ.కె


🌹 🌹 🌹 🌹 🌹






🌹 Past Life Sins 🌹


Master, we see those who are in the world and those who are not. We see those who enjoy the pleasures of heaven and those who have never seen a day. Our descendants say that the reason for these differences in generations is the sin they practiced in their previous lives. Is this belief true? Are the sin of previous lives the reason for economic inequalities?


The reason for the financial excesses and the lack of sin is the culture of the attitude one has towards money, not sin. Sins and virtues, as samskaras, cause only sorrow and happiness in the next life, but not poverty and wealth. Just as there is a relationship between wealth and happiness, there is also a relationship between poverty and sorrow. There are those who have millions and cry with sorrow, those who do not talk to their husbands and wives, and those who hate their fathers and sons. There are those who work hard for their daily bread and earn it and live with courage, happiness, and eternal contentment. There are couples who live like Sitaram even after spending their days drinking porridge. There are also those who live without considering anything, eating leaves and eating gochi. Therefore, happiness and sorrow have no connection with the level of wealth. In previous lives, good deeds bring happiness but do not bring wealth. Similarly, bad deeds bring sorrow but do not cause poverty. A rich person who enjoys happiness without giving it to others is born with indigestion and does not have to be born poor. A person who gives constant charity gets food and other necessities effortlessly but does not have to become rich. The answer to the question of what causes wealth and poverty? is that it is caused only by skill. If that skill is accompanied by the culture of good deeds, it gives the ability to acquire wealth. If it is accompanied by the culture of bad deeds, it gives the ability to acquire wealth unjustly. Similarly, the culture of one who wastes money in ways such as gambling, drinking, prostitution, etc. causes poverty in this life. That is why even if one constantly helps a perpetually poor person, he will burn it but will not enjoy it. A person who has given loans and collected interest and died without getting them back, lives on in debt with the burden of that culture. Even if his debts are paid off, he will continue to do so. A person who has taken loans and avoided them not out of weakness but out of bad will suffer in that culture by collecting interest and lending them. This world of possessions has no connection with the experience of happiness. A person who lives a life of luxury by scaring the helpless with money is born with the ability to accumulate wealth and lives his whole life in fear of what he has accumulated. - Master E.K


🌹 🌹 🌹 🌹 🌹



Comentarios


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page