top of page

పుష్య పౌర్ణమి (జనవరి 3, 26): ఈ ఐదు ప్రదేశాలలో దీపాలు వెలిగిస్తే కష్టాలు తొలగిపోయి, నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి! Pushya Pournami (Jan 3, 26): Lighting lamps in these five places will solve troubles

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 5 days ago
  • 2 min read

🌹 పుష్య పౌర్ణమి ( జనవరి 3): ఈ ఐదు ప్రదేశాల్లో దీపారాధన.. కష్టాలు మటుమాయం.. పెండింగ్ పనులు ఇట్టే పూర్తవుతాయి..! 🌹


ప్రసాద్ భరద్వాజ



🌹 Pushya Pournami (January 3): Lighting lamps in these five places will make your troubles disappear and pending tasks will be completed instantly! 🌹


Prasad Bharadwaj



పుష్య మాసం పౌర్ణమి రోజున ( జనవరి 3) హిందు పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ..


సుఖ సంతోషాలు కూడా మీ సొంతం అవుతాయి. పుష్య మాసం పూర్ణిమ నాడు ఏయే ప్రదేశాలలో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..


పుష్యమాసం శనిభగవానుడికి శనీశ్వరుడికి చాలా ఇష్టం. పౌర్ణమి తిథి శని వారం.. పుష్య మాసం లో వచ్చిదంటే పురాణాల ప్రకారం ఆరోజుకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ ఏడాది ( 2026) జనవరి 3 వ తేది శనివారం పుష్య పౌర్ణమి తిథి వచ్చింది. ఆ రోజున శని భగవానుడి పూజించి నల్లనువ్వులు దానంతో పాటు శ్రీ మహా విష్ణువు, లక్ష్మిని పూజించడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో ఆనందం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


1. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర: పుష్యమాసం పౌర్ణమి తిథి రోజున ( జనవరి3) ఇంట్లో దేవుడి దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన ఇప్పటి వరకు కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్​ ఎనర్జీ తొలగి.. లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.


2. తులసి మొక్క దగ్గర : హిందువులు.. తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. పుష్యమాసం పూర్ణిమ రోజున తులసి మొక్క దగ్గర ఉదయం ( సూర్యోదయానికి ముందు) .. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఆవునెయ్యితో దీపారాధ చేయాలి. ఆ తరువాత లక్ష్మీ దేవి అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ చేయాలి. మహాలక్ష్మి అమ్మవారికి పండ్లు.. పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక కష్టాలు తొలగి.. పెండింగ్​పనులు త్వరగా పూర్తవుతాయి.


3. రావి చెట్టు దగ్గర దీపం: ఈ చెట్టులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు నివసిస్తారు. పుష్యమాసం సూర్యభగవానుడి చాలా ఇష్టమైన నెల. అందుకే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున ( 2026 జనవరి 3) ఇక్కడ రెండు కుందుల్లో దీపారాధన చేయాలి. ఒకదానిలో ఆవునెయ్యి దీపారాధన.. మరొక దానిలో నువ్వుల నూనె దీపారాధన చేయాలి. తరువాత అగర్​ బత్తీలు వెలిగించి.. బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన త్రిమూర్తుల ఆశీస్సులు కలగడమే కాకుండా... పూర్వీకులు కూడా సంతోషించి.. పితృదోషాలు తొలగిపోతాయి.


4. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర: పుష్యమాసం.. పౌర్ణమి తిథి రోజున (2026 జనవరి 3) ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన ఇంట్లోకి నెటివ్​ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంటి గుమ్మాన్ని పసుపు, కుంకుమతో అలంకరించాలి. గుమ్మానికి పైన పూలదండ కడితే మరీ మంచిది. ఇలా చేయడం వలన అన్ని రకాల సమస్యలకు పరిష్కారం కలుగుతుంది.


5. శని భగవానుడి దగ్గర : శని భగవానుడి దగ్గర నువ్వులనూనె దీపారాధన చేయాలి. పుష్యమాసం శనీశ్వరుడికి ఇష్టమైన నెల. పౌర్ణమి తిథి రోజున శనీశ్వరుడి తైలాభిషేకం చేసి.. నువ్వులతో అర్చించాలి. ధూపం.. దీపం.. తరువాత శనీశ్వరునికి బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డు సమర్పించాలి. పేదలకు వస్త్రదానం చేయాలి. ఇలా చేయడం వలన శనిభగవానుడు సంతోషించి.. కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని పండితులు చెబుతున్నారు.



ఇంకా ఏమేమి చేయాలంటే..



లక్ష్మీదేవిని పసుపు రంగు పువ్వులతో పూజించడం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు.


పుష్యమాసం పౌర్ణమి రోజున పవిత్రమైన నదిలో పవిత్ర స్నానం చేసి... దీపదానం చేయడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి ... కోరిన కోరికలు నెరవేరడం.


ఆహారం, డబ్బు, బట్టలు దానం దానం చేయడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.. వ్యాపారంలో లాభం.


ఓం సోమాయ నమః... 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి చంద్రునికి అర్ఘ్యం ఇస్తే మంచి జరుగుతుంది.


తెల్లటి వస్తువులను దానం చేయడం ఉత్తమం. బియ్యం, పాలు, చక్కెర, తెల్లటి వస్త్రాలు, వెండి వస్తువులు వంటివి పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం జాతకంలో చంద్రదోషం తొలగిపోయి.. మేలు జరుగుతుంది.


పవిత్ర నదుల్లో స్నానం.. మోక్షానికి మార్గం


ఏది ఎలా చేసినా భక్తి పూర్వకంగా శ్రద్దతో చేయాలి


🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page