మన శరీరంలోని బయో-క్లాక్‌లు Bio-clocks in our body
- Prasad Bharadwaj
- Mar 16
- 2 min read

🌹 ఆచరిస్తే అద్భుతాలు జరుగుతాయి - బయోక్లాక్! BIO-క్లాక్ 🌹
మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే, 4.00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము.
కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైం కి లేస్తాము. ఇదే ‘బయో-గడియారం!
చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు.
50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని నమ్మి చాలామంది తమ సొంత బయోక్లాక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌ను తప్పుగా సెటప్ చేస్తాము.
చైనాలో చాలా మంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారు.
వారి బయోక్లాక్ అలా ఏర్పాటు చేయబడింది.
కాబట్టి మిత్రులారా ఈ "8" సూత్రాలు తప్పకుండా పాటించాలి! అందులో…
1). మనము బయో-గడియారాన్ని సర్దుబాటు చేసి, రోజూ క్రమం తప్పకుండా ‘ధ్యానం’ చేస్తే…. తద్వారా మనం కనీసం120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు!
2.) 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.
3.)సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు.
4.) మనం తీసుకునే భోజనం కల్తీ, కలుషితం, అనుకుని తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి! జరిగి తీరుతుంది.
5.) చురుకుగా ఉండండి. నడవండి. వీలైతే జాగింగ్ కూడా తప్పకుండా చేయండి.
6.) వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి! (ఇది నిజం కూడ).
7.) ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి!
(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి! మనసులో కాకుండా పైకి నవ్వండి)
(అదేదో సినిమాలో మనసులోనే నవ్వుకుంటుంది, మనసులోనే డాన్స్ కూడా చేస్తుందట! - అలాకాదు!)
8). ప్రతిదానికీ కారణం మన మనస్సు. మన ఆలోచన. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ old age అనే మాటను అనకండి. ధర్మరాజుకు యువరాజా పట్టాభిషేకం జరిగింది 105 సంవత్సరాల వయసులో!
బయో క్లాక్ ని మీ తక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేయవద్దు...!
ALL THE BEST..
ద్వి శతమానం భవతి!
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
Comments