రథ సప్తమి పూజా విధానం Ratha Saptami Puja Procedure
- Prasad Bharadwaj
- 5 hours ago
- 2 min read

🌹 రథ సప్తమి పూజా విధానం - సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజా విధానం 🌹
ప్రసాద్ భరద్వాజ
వేకువజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి..ఏడు లేదా 11 జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తలపై పెట్టుకుని సూర్యోదయం సమయానికి ముందుగానే స్నానం పూర్తి చేయాలి.
పూజ కోసం అవసరం అయిన సామగ్రి మొత్తం సిద్ధం చేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని పూజ ప్రారంభించాలి, తూర్పు దిశగా కూర్చునే అవకాశం లేకపోతే ఉత్తర ముఖంగా కూర్చుని పూజ చేయవచ్చు.
"ఓం మమోపాత్త సకల దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుద్ధ సప్తమ్యాం రథసప్తమి వ్రతం కరిష్యే" అని పూజ ప్రారంభించాలి.
ముందుగా పసుపు వినాయకుడిని చేసి షోడసోపచార పూజ చేయాలి - దీపం, ధూపం, నైవేద్యం, ఉద్యాపన తర్వాత సూర్య భగవానుడి పూజ ప్రారంభించాలి.
సూర్యుడి ఫొటోను లేదా ప్రతిమను గంధం, కుంకుమ, పూలతో అలంకరించాలి ( ఎర్రటి పూలతో పూజ చేస్తే మంచిది)
ధ్యాన మంత్రం: "ఓం భాస్కరాయ దివాకరాయ ఆదిత్యాయ మార్తాండాయ సహస్రకిరణాయ సూర్యాయ నమః"
సూర్యభగవానుడికి కూడా షోడసోపచార పూజ... పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, ప్రదక్షిణ, హారతి సమర్పించాలి.
గోధుమపిండితో ప్రమిదలు చేసి దీపం వెలిగించండి
పూజలో భాగంగా రథం తయారు చేసి సూర్యుడి ముందుంచాలి
ఆవుపాలతో పారమన్నానం చేసి నివేదించాలి
హారతి ఇచ్చి, ప్రదక్షిణ చేసి నమస్కరించాలి.
గొడుగు, చెప్పులు, గోధుమలు దానం చేయడం శ్రేష్ఠం
రథసప్తమి ఆదివారం రావడం మరింత విశేషం..ఈ రోజు పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచిరిస్తే విశేష ఫలితం ఉంటుంది.
పూజలో భాగంగా... ఆదిత్య హృదయం, సూర్య అష్టోత్తరం, సూర్యాష్టకం పఠించాలి.
సూర్యాస్తమయం సమయంలోనూ దీపం వెలిగించి సూర్యుడిని ఆరాధించి ఉపవాసం విరమించాలి.
రథ సప్తమి పూజ ఇంట్లోనే ఇలా సులువుగా ఆచరించవచ్చు. భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం కోసం ఆదిత్యుడిని పూజిస్తారు.
మీరు షోడసోపచార పూజ ఆచరించలేం అనుకుంటే..
దీపం వెలిగించి ముందుగా గణపతి ప్రార్థన చేసి దూపం, నైవేద్యం సమర్పించి.. అనంతరం సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం, సూర్యాష్ఠకం చదువుకోవచ్చు లేదంటూ వింటూ పూలు - అక్షతలతో సూర్యుడికి పూజ చేయవచ్చు. పరమాన్నం నైవేద్యంగా సమర్పించండి.
ఆదిత్యుడి అథాంగపూజ చేసుకోండి
ఓం ఆదిత్యాయ నమః – పాదౌ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – జంఘే పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – జానునీ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – ఊరుం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – గుహ్యం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – కటిం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – నాభిం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – ఉదరం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – హృదయం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – హస్తౌ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – భుజౌ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – కంఠం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – ముఖం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – నేత్రాణి పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – లలాటం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – శిరః పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – మౌళీం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – అథాంగ పూజయామి.
చివరిగా
ఓ భాస్కరా ! దివాకరా ! ఆదిత్యా ! మార్తాండా ! గ్రహాధిపాఅపారనిధే ! జగద్రక్షకా ! భూతభవనా ! భూతేశా ! భాస్కరా ! ఆర్తత్రాణ పరాయణా హరా ! అంచిత్యా విశ్వసంచారా ! హేవిష్ణో ! ఆదిభూతేశా ! ఆదిమధ్యాస్త భాస్కరా ! ఓ జగత్ప్రతే ! నేను ఆచరించే పూజలో లోపం ఉన్నా... నా భక్తిలో ఎలాంటి లోపం లేదు...నేను చేసిన పూజకు నీ సంపూర్ణ కటాక్షాన్ని అందించు తండ్రీ అని పూలు సమర్పించి నమస్కరించండి.
పూజ చేసే విధానం కన్నా భక్తి ప్రధానం...
🌹 🌹 🌹 🌹 🌹



Comments