వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణలు Circumambulations around Lord Venkateswara
- Prasad Bharadwaj
- 5 hours ago
- 1 min read

🌹 ఇక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామికి, 7 వారాలు ఏడేసి సార్లు చొప్పున ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Devotees believe that performing circumambulations around Lord Venkateswara, who is in the form of sandalwood paste here, seven times a day for seven weeks will fulfill their wishes. 🌹
Prasad Bharadwaj
అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి.. ఆత్రేయపురం మండలంలో అదో కుగ్రామం. జనాభా కూడా 4000 మాత్రమే. అయితే ఆ ఊరి పేరు నేడు ఖండాంతరాలు దాటిపోతు వెలిగిపోతుంది.
ఎందుకంటే అక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారు వెలిచి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఉన్నారు. భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని చూపిస్తూ ప్రతిరోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించు కునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గోదావరి తీరప్రాంత నడుమ వాడపల్లి వెంకన్న భక్తులకు కటాక్షంగా మారాడు.. కోరిన కోరికలు తీర్చే చందన స్వరూపుడు వెంకన్నకు భక్తుల తాకిడి అమాంతం పెరుగుతోంది.
ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఎర్రచందనపు చెక్కతో చేతిలో గదను ధరించి ప్రత్యేకంగా ఉంటారు. రెండు దశాబ్దాల క్రితం ఏడాదికి ఒక్కసారే వాడపల్లి తీర్థం పేరున చుట్టుపక్కల గ్రామాల భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుండేవారు. నేడు స్వామి వారి మహిమాన్వితుడుగా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఒక్క శనివారమే 50 వేల నుంచి 70 వేల వరకు భక్తులు వస్తుండగా మిగతా రోజుల్లో 20వేలకు తగ్గకుండా స్వామివారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు… ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతున్నాయని భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.
🌹🌹🌹🌹🌹



Comments