శ్రీ దత్తాత్రేయ స్వామి విశిష్టత - దత్త జయంతి - కోరల పౌర్ణమి విశిష్టత - విధానము Dattatreya Jayanthi - Korala Purnima Significance
- Prasad Bharadwaj
- Dec 4, 2025
- 1 min read
🌹 శ్రీ దత్తాత్రేయ స్వామి విశిష్టత - దత్త జయంతి - దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం - కోరల పౌర్ణమి విశిష్టత - విధానము DATTATREYA JAYANTHI - KORALA PURNIMA SIGNIFICANCE 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పక వీక్షించండి
🍀 మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు కనుక ఈ పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటాము. నేడు దత్తుని విశిష్టత తెలుసుకోవడం, ఆయనను స్మరించడం సాధకులకు ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింప జేయుటయే దత్తమూర్తి అవతార కార్యక్రమము. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః 🍀
ప్రసాద్ భరధ్వాజ
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹



Comments