top of page

శ్రీ పంచవక్త్ర మహాకైలాస మూర్తి ధ్యానం — ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం / Meditation on Sri Panchavaktra Mahakailasa Murti

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 13 hours ago
  • 2 min read
ree

🌹 🔱 శ్రీ పంచవక్త్ర మహాకైలాస మూర్తి ధ్యానం సంపూర్ణ శివానుగ్రహం — ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం 🔱 🌹

శుభ సోమవారం అందరికి

ప్రసాద్‌ భరధ్వాజ


🌹 🔱 Meditation on Sri Panchavaktra Mahakailasa Murti for complete divine grace of Lord Shiva — for prosperity, happiness and peace 🔱 🌹

Happy Monday to all

Prasad Bharadwaj



ధ్యాన శ్లోకము


ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరి నిభం చారుచంద్రావతంసం

రత్నాకల్పోజ్జ్వలాంగం పరశుమృగ వరాభీతి హస్తం ప్రసన్నం।

పద్మాసీనం సమంతాత్ స్తుత మమరగణైః వ్యాఘ్రచర్మాంబరం

విశ్వాద్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం॥


స్ఫటికమువంటి నిర్మలమైన వర్ణం కలిగినవాడు, ఐదు ముఖాలతో — ప్రతి ముఖంలో మూడు నేత్రాలతో (మొత్తం 15 కళ్లతో), పది చేతులతో, చంద్రకళతో అలంకరించ బడిన కిరీటం ధరించి, రత్నభూషణాలతో మెరిసుతూ, అభయ వరద ముద్రలతో భక్తులను కాపాడుతూ, త్రిశూలం, పరశువు, ఖడ్గం, వజ్రం, అగ్ని, సర్పం, గంట, అంకుశం వంటి ఆయుధాలను ధరించి, సింహాసనంపై ప్రశాంతంగా ఆసీనుడై, దేవతలచే స్తుతింపబడే ఆ మహాసదాశివుని నేను సదా ధ్యానిస్తున్నాను.


🍀 పంచవక్త్ర మహాకైలాస మూర్తి — ఐదు ముఖాల అర్థం 🍀

దిక్కు - ముఖం - కృత్యం - అర్థం


ఊర్ధ్వం - ఈశానము - అనుగ్రహం మోక్షం, - కరుణ

తూర్పు - తత్పురుషం - తిరోధానం -మాయ, దాచుట

దక్షిణం - అఘోరం -సంహారం -లయం

పడమర - సద్యోజాతము - సృష్టి - సృష్టి శక్తి

ఉత్తరం - వామదేవుడు - స్థితి - రక్షణ, పోషణ


🌻 పంచవక్త్ర మహాకైలాస మూర్తి లక్షణాలు 🌻


పంచవక్త్రం — శివుని ఐదు కృత్యాలను ప్రతిబింబిస్తాయి.

త్రినేత్రములు — జ్ఞానం, కాల నియంత్రణ

దశభుజాలు — పది దిక్కులు, పది శక్తులు

స్ఫటిక వర్ణం — శుద్ధ జ్ఞాన స్వరూపం

సింహాసనం — స్థిరత్వం, అధికారం


చంద్రావతంసం — మనస్సుపై సంపూర్ణ నియంత్రణ, శాంత స్వభావం

వ్యాఘ్రచర్మాంబరం — వాసనలపై విజయం, వైరాగ్య బలం

పద్మాసనం — సమత్వం, ధ్యాన నిశ్చలత్వం

అభయ ముద్ర — భయ విమోచనం, ఆశ్రయ ప్రదానం

వరద ముద్ర — భక్తులకు కృపా ప్రసాదం

దేవగణ స్తుతి — పరమతత్త్వానికి లోకారాధన

విశ్వబీజం — సృష్టి, స్థితి, లయలకు మూలకారణం


పంచవక్త్ర మహాకైలాస మూర్తి అనేది రూపానికి పరిమితం కాని పరబ్రహ్మ తత్త్వం — భయం తొలగించే కరుణ, అజ్ఞానాన్ని దహించే జ్ఞానం, మోక్షానికి మార్గదర్శకుడు.


🙌 ధ్యాన ఫలితం 🙌


ఈ మహాకైలాస మూర్తిని నిత్యం ధ్యానం చేస్తే— సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం, సుఖం మరియు శాంతి పెరుగుతాయి. పాపాలు నశిస్తాయి. మనస్సు ప్రశాంతం అవుతుంది. అంతరంగ శక్తి అభివృద్ధి చెందుతుంది.

🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page