🌹. శ్రీమద్భగవద్గీత - 449 / Bhagavad-Gita - 449 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 35 🌴
35. సంజయ ఉవాచ
ఏతచ్చ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన: కిరీటీ |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీత: ప్రణమ్య ||
🌷. తాత్పర్యం : ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను; ఓ రాజా! దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరల మరల వందనముల నొసగెను. భీతిని కూడినవాడై అతడు డగ్గుత్తికతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.
🌷. భాష్యము : పూర్వమే తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుని విశ్వరూపముచే సృష్టింపబడిన పరిస్థితి కారణముగా అర్జునుడు సంభ్రమమునకు గురియయ్యెను. తత్కారణముగా అతడు కృష్ణునకు గౌరవపూర్వక వందనములను మరల మరల అర్పించుట మొదలిడెను. అతడు స్నేహితునివలె గాక, అద్భుతరసభావితుడైన భక్తునిగా గద్గదస్వరముతో ప్రార్థింపదొడగెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 449 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 35 🌴
35. sañjaya uvāca
etac chrutvā vacanaṁ keśavasya kṛtāñjalir vepamānaḥ kirīṭī
namaskṛtvā bhūya evāha kṛṣṇaṁ sa-gadgadaṁ bhīta-bhītaḥ praṇamya
🌷 Translation : Sañjaya said to Dhṛtarāṣṭra: O King, after hearing these words from the Supreme Personality of Godhead, the trembling Arjuna offered obeisances with folded hands again and again. He fearfully spoke to Lord Kṛṣṇa in a faltering voice, as follows.
🌹 Purport : As we have already explained, because of the situation created by the universal form of the Supreme Personality of Godhead, Arjuna became bewildered in wonder; thus he began to offer his respectful obeisances to Kṛṣṇa again and again, and with faltering voice he began to pray, not as a friend, but as a devotee in wonder.
🌹 🌹 🌹 🌹 🌹
Comments