🌹. శ్రీమద్భగవద్గీత - 450 / Bhagavad-Gita - 450 🌹
✍️. శ్రీ ప్రభుపాద , 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 36 🌴
36. అర్జన ఉవాచ
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి సర్వే సమస్యన్తి చ సిద్ధసఙ్ఘా: ||
🌷. తాత్పర్యం : అర్జునుడు పలికెను : ఓ హృశీకేశా! నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించి, ప్రతియొక్కరు నీ యెడ అనురక్తులగుచున్నారు. సిద్ధసమూహములు నీకు గౌరవపుర్వకముగా అంజలి ఘటించుచున్నను రాక్షసులు భీతిచెందినవారై పలుదిక్కుల పలాయనమగుచున్నారు. ఇది యంతయు యుక్తముగనే ఉన్నది.
🌷. భాష్యము : కురుక్షేత్ర సంగ్రామ ఫలితమును కృష్ణుని ద్వారా వినినంతనే అర్జునుడు ఉత్తేజితుడయ్యెను. కనుకనే పరమభక్తునిగా మరియు స్నేహితునిగా అతడు శ్రీకృష్ణుడు చేసినది సర్వము యుక్తముగా నున్నదని పలుకుచున్నాడు. శ్రీకృష్ణుడే భక్తులకు పోషకుడు మరియు పూజా ధ్యేయమనియు, అతడే సర్వానర్థములను నశింపజేయువాడనియు అర్జునుడు నిర్ధారించుచున్నాడు. ఆ భగవానుని కార్యములు సర్వులకు సమానముగా హితమునే గూర్చును. కురుక్షేత్రరణము జరుగు సమయమున అచ్చట శ్రీకృష్ణుడు నిలిచియున్న కారణముగా అంతరిక్షము నుండి దేవతలు, సిద్ధులు, ఊర్థ్వలోకవాసులు దానిని వీక్షించుచున్నారని అర్జునుడు ఎరుగగలిగెను.
అర్జునుడు శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమును దర్శించినపుడు దేవతలు ఆ రూపమును గాంచి ముదము నొందగా, దానవులు మరియు నాస్తికులైనవారు ఆ భగవానుని కీర్తనము సహింపలేకపోయిరి. భగవానుని వినాశకర రూపము యెడల గల తమ సహజభీతితో వారు అచ్చట నుండి పలాయనమైరి. తన భక్తుల యెడ మరియు నాస్తికుల యెడ శ్రీకృష్ణభగవానుడు వ్యవహరించు విధానమును అర్జునుడు కీర్తించుచున్నాడు. శ్రీకృష్ణడేది చేసినను అది సర్వులకు హితముగనే గూర్చునని యెరిగియున్నందున భక్తుడైనవాడు అన్నివేళలా ఆ భగవానుని కీర్తించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 450 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 36 🌴
36. arjuna uvāca
sthāne hṛṣīkeśa tava prakīrtyā jagat prahṛṣyaty anurajyate ca
rakṣāṁsi bhītāni diśo dravanti sarve namasyanti ca siddha-saṅghāḥ
🌷 Translation : Arjuna said: O master of the senses, the world becomes joyful upon hearing Your name, and thus everyone becomes attached to You. Although the perfected beings offer You their respectful homage, the demons are afraid, and they flee here and there. All this is rightly done.
🌹 Purport : Arjuna, after hearing from Kṛṣṇa about the outcome of the Battle of Kurukṣetra, became enlightened, and as a great devotee and friend of the Supreme Personality of Godhead he said that everything done by Kṛṣṇa is quite fit. Arjuna confirmed that Kṛṣṇa is the maintainer and the object of worship for the devotees and the destroyer of the undesirables. His actions are equally good for all.
Arjuna understood herein that when the Battle of Kurukṣetra was being concluded, in outer space there were present many demigods, siddhas, and the intelligentsia of the higher planets, and they were observing the fight because Kṛṣṇa was present there. When Arjuna saw the universal form of the Lord, the demigods took pleasure in it, but others, who were demons and atheists, could not stand it when the Lord was praised. Out of their natural fear of the devastating form of the Supreme Personality of Godhead, they fled. Kṛṣṇa’s treatment of the devotees and the atheists is praised by Arjuna. In all cases a devotee glorifies the Lord because he knows that whatever He does is good for all.
🌹 🌹 🌹 🌹 🌹
Bình luận