🌹. శ్రీమద్భగవద్గీత - 451 / Bhagavad-Gita - 451 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 37 🌴
37. కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్ గరీయ సే బ్రహ్మణోప్యాథికర్త్రే |
అనన్త దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ ||
🌷. తాత్పర్యం : ఓ మహాత్మా! బ్రహ్మదేవుని కంటేను ఘనమైనవాడా! నీవే ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు నమస్సులు అర్పింపరు? ఓ అనంతా! దేవదేవా! జగన్నివాసా! నీవు అక్షయమగు మూలమువు, సర్వకారణకారణుడవు, ఈ భౌతికసృష్టికి అతీతుడవు.
🌷. భాష్యము : శ్రీకృష్ణుడు సర్వులచే ఆరాధనీయుడని ఈ ప్రణామములను అర్పించుట ద్వారా అర్జునుడు సూచించుచున్నాడు. అతడే సర్వవ్యాపి మరియు సర్వాత్మలకు ఆత్మయై యున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని “మహాత్మా” అని సంభోదించినాడు. అనగా ఆ భగవానుడు మహోదాత్తుడు మరియు అప్రమేయుడని భావము. అలాగుననే అతని శక్తి మరియు ప్రభావముచే ఆవరింపబడనిది ఏదియును జగత్తు నందు లేదని “అనంత” అను పదము సూచించుచున్నది. దేవతల నందరిని నియమించుచు అతడు వారికన్నను అధికుడై యున్నాడనుటయే “దేవేశ” అను పదపు భావము. సమస్త విశ్వమునకు ఆధారమతడే. అతని కన్నను అధికులెవ్వరును లేనందున సిద్ధులు మరియు శక్తిమంతులైన దేవతలందరు శ్రీకృష్ణభగవానునికి నమస్సులు గూర్చుట యుక్తముగా నున్నదని అర్జునుడు భావించెను. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని సృష్టించినందున, అతడు బ్రహ్మ కన్నను ఘనుడని అర్జునుడు ప్రత్యేకముగ పేర్కొనబడినాడు.
శ్రీకృష్ణుని ప్రధాన విస్తృతియైన గర్భోదకశాయి విష్ణువు నాభికమలమున బ్రహ్మదేవుని జన్మము కలిగెను. కనుక బ్రహ్మ, బ్రహ్మ నుండి ఉద్భవించిన శివుడు మరియు ఇతర సర్వదేవతలు శ్రీకృష్ణభగవానునకు గౌరవపూర్వక వందనములను అర్పించవలసియున్నది. ఆ రీతిగనే బ్రహ్మరుద్రాది దేవతలు శ్రీకృష్ణభగవానునకు నమస్సులు గూర్తురని శ్రీమద్భాగవతమున తెలుపబడినది. ఈ భౌతికసృష్టి నశ్వరమైనను శ్రీకృష్ణభగవానుడు దానికి అతీతుడై యున్నందున “అక్షరం” అను పదము మిగుల ప్రాధాన్యమును సంతరించుకొన్నది. అతడు సర్వకారణకారణుడు. తత్కారణమున అతడు భౌతికప్రకృతి యందలి బద్ధజీవులందరి కన్నను మరియు స్వయము భౌతికసృష్టి కన్నను అత్యంత ఉన్నతుడై యున్నాడు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు పరమపురుషుడై యున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 451 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 37 🌴
37. kasmāc ca te na nameran mahātman garīyase brahmaṇo ’py ādi-kartre
ananta deveśa jagan-nivāsa tvam akṣaraṁ sad-asat tat paraṁ yat
🌷 Translation : O great one, greater even than Brahmā, You are the original creator. Why then should they not offer their respectful obeisances unto You? O limitless one, God of gods, refuge of the universe! You are the invincible source, the cause of all causes, transcendental to this material manifestation.
🌹 Purport : By this offering of obeisances, Arjuna indicates that Kṛṣṇa is worshipable by everyone. He is all-pervading, and He is the Soul of every soul. Arjuna is addressing Kṛṣṇa as mahātmā, which means that He is most magnanimous and unlimited. Ananta indicates that there is nothing which is not covered by the influence and energy of the Supreme Lord, and deveśa means that He is the controller of all demigods and is above them all. He is the shelter of the whole universe. Arjuna also thought that it was fitting that all the perfect living entities and powerful demigods offer their respectful obeisances unto Him, because no one is greater than Him. Arjuna especially mentions that Kṛṣṇa is greater than Brahmā because Brahmā is created by Him.
Brahmā is born out of the lotus stem grown from the navel abdomen of Garbhodaka-śāyī Viṣṇu, who is Kṛṣṇa’s plenary expansion; therefore Brahmā and Lord Śiva, who is born of Brahmā, and all other demigods must offer their respectful obeisances. It is stated in Śrīmad-Bhāgavatam that the Lord is respected by Lord Śiva and Brahmā and similar other demigods. The word akṣaram is very significant because this material creation is subject to destruction but the Lord is above this material creation. He is the cause of all causes, and being so, He is superior to all the conditioned souls within this material nature as well as the material cosmic manifestation itself. He is therefore the all-great Supreme.
🌹 🌹 🌹 🌹 🌹
Comments