top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 455: 11వ అధ్., శ్లో 41 / Bhagavad-Gita - 455: Chap. 11, Ver. 41


🌹. శ్రీమద్భగవద్గీత - 455 / Bhagavad-Gita - 455 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 41 🌴


41. సఖేతి మత్వా ప్రసభం యదుక్తమ్ హే కృష్ణ హే యాదవ హే సఖేతి |

అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ||


🌷. తాత్పర్యం : నీ మహిమము తెలియక నిన్ను మిత్రునిగా భావించి “ఓ కృష్ణా”, “ఓ యాదవా”, “ ఓ మిత్రమా” అని తొందరపాటుగా సంబోధించితిని. ప్రేమతోగాని లేదా మూర్ఖత్వముతోగాని నేనొరించిన దానినంతటిని కరుణతో క్షమింపుము.


🌷. భాష్యము : శ్రీకృష్ణుడు విశ్వరూపముతో తన యెదుట వ్యక్తమైనప్పటికిని అతనితో గల స్నేహసంబంధమును అర్జునుడు స్మృతి యందుంచుకొనెను. తత్కారణముగా అతడు క్షమార్పణ వేడుచు, స్నేహభావము వలన ఉత్పన్నమైనట్టి పలు సామాన్య వ్యవహారములకు తనను మన్నింపుమని శ్రీకృష్ణుని అర్థించుచున్నాడు. ప్రియమిత్రునిగా భావించి శ్రీకృష్ణుడు తనకు తెలియపరచినను, శ్రీకృష్ణుడు ఆ విధమైన విశ్వరూపధారణము చేయగలడని తాను పూర్వము తెలియనట్లుగా అర్జునుడు అంగీకరించుచున్నాడు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 455 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 41 🌴


41. sakheti matvā prasabhaṁ yad uktaṁ he kṛṣṇa he yādava he sakheti

ajānatā mahimānaṁ tavedaṁ mayā pramādāt praṇayena vāpi


🌷 Translation : Thinking of You as my friend, I have rashly addressed You “O Kṛṣṇa,” “O Yādava,” “O my friend,” not knowing Your glories. Please forgive whatever I may have done in madness or in love.


🌹 Purport : Although Kṛṣṇa is manifested before Arjuna in His universal form, Arjuna remembers his friendly relationship with Kṛṣṇa and is therefore asking pardon and requesting Kṛṣṇa to excuse him for the many informal gestures which arise out of friendship. He is admitting that formerly he did not know that Kṛṣṇa could assume such a universal form, although Kṛṣṇa explained it as his intimate friend.


🌹 🌹 🌹 🌹 🌹




2 views0 comments

Comentários


bottom of page