top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 456: 11వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 456: Chap. 11, Ver. 42


🌹. శ్రీమద్భగవద్గీత - 456 / Bhagavad-Gita - 456 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 42 🌴


42. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు |

ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ||


🌷. తాత్పర్యం : మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు ఒంటరిగా కొన్నిమార్లు మరియు పలుమిత్రుల సమక్షమున మరికొన్నిమార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరపరచితిని. ఓ అచ్యుతా! ఆ అపరాధములన్నింటికిని నన్ను క్షమింపుము.


🌷. భాష్యము : భగవానుని విభూతులను గుర్తెరుగాక “ ఓ మిత్రమా”, “ఓ కృష్ణా”, “ఓ యాదవా” అనెడి సంబోధనములచే తానెన్నిమార్లు అతనిని అగౌరవపరచెనో అర్జునుడు ఎరుగడు. అయినను కరుణాంతరంగుడైన శ్రీకృష్ణుడు అట్టి దివ్యవిభూతి సంపన్నుడైనను అర్జునునితో మిత్రుని రూపమున వ్యవహరించెను. భక్తుడు మరియు భగవానుని నడుమగల దివ్యప్రేమయుత సంబంధమిదియే. శ్రీకృష్ణుడు మరియు జీవుల నడుమగల సంబంధము నిత్యమైనది, మరుపునకు రానిదని అర్జునుని ప్రవృత్తి ద్వారా మనము గాంచవచ్చును. విశ్వరూప వైభవమును గాంచినప్పటికిని అర్జునుడు తనకు శ్రీకృష్ణునితో గల సన్నిహిత స్నేహసంభందమును మరువజాలడు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 456 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 42 🌴


42. yac cāvahāsārtham asat-kṛto ’si vihāra-śayyāsana-bhojaneṣu

eko ’tha vāpy acyuta tat-samakṣaṁ tat kṣāmaye tvām aham aprameyam


🌷 Translation : I have dishonored You many times, jesting as we relaxed, lay on the same bed, or sat or ate together, sometimes alone and sometimes in front of many friends. O infallible one, please excuse me for all those offenses.


🌹 Purport : Arjuna did not know how many times he may have dishonored Kṛṣṇa by addressing Him “O my friend,” “O Kṛṣṇa,” “O Yādava,” etc., without acknowledging His opulence. But Kṛṣṇa is so kind and merciful that in spite of such opulence He played with Arjuna as a friend. Such is the transcendental loving reciprocation between the devotee and the Lord. The relationship between the living entity and Kṛṣṇa is fixed eternally; it cannot be forgotten, as we can see from the behavior of Arjuna. Although Arjuna has seen the opulence in the universal form, he cannot forget his friendly relationship with Kṛṣṇa.


🌹 🌹 🌹 🌹 🌹




2 views0 comments

Kommentare


bottom of page